వీవీని తిరిగి జైలుకు పంపేందుకు ఏన్ఐఏ కుట్ర‌ -విరసం

వీవీని

15-04-2022

విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు భీమాకోరేగావ్ కేసులో దాఖ‌లుచేసిన అన్ని పిటిష‌న్ల‌ను బాంబే హైకోర్టు బుధ‌వారం కొట్టివేసింది. కంటి శస్త్ర‌చికిత్స పూర్తిచేసుకుని మూడు నెల‌ల్లో తిరిగి జైలుకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు చేసి దాదాపు నాలుగేళ్లు అయిన ద‌ర‌మిలా శాశ్వ‌త బెయిలు కోసం పెట్టిన ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. కండీష‌న్ తొల‌గించి ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లే వీలు క‌ల్పించేందుకూ నిరాక‌రించింది.

ఇక మిగిలింది తాత్కాలిక మెడిక‌ల్ బెయిల్‌. ఈ బెయిల్‌ను కూడా తీసివేసిన‌ట్టే! మూడునెల‌ల కాలానికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ను గ‌డువు తీర‌గానే స‌మీక్షిస్తామ‌ని త‌న తీర్పులో కోర్టు చెప్ప‌కపోవ‌డ‌మే దీనికి కార‌ణం. కాట‌రాక్ట్ చికిత్స చేయించుకుని జైలుకు వెళ్లిపోవాల‌ని న్యాయ‌మూర్తి స్ప‌ష్టంగానే ఆదేశించారు. నిజానికి, వీవీ విష‌యంలో ఎన్ఐఏ ఇదే కోరుకుంది. ఆయ‌న‌ను తిరిగి జైలుకు పంపాల‌ని ఏడాదిగా ఈ సంస్థ చేయ‌ని కుట్ర‌లు లేవు. ఇందుకు అది చేస్తూ వ‌చ్చిన వాద‌న‌లే న్యాయ‌మూర్తి త‌న తీర్పుగా చ‌దివి వినిపించారు. *ఆరోగ్య‌ప‌రిస్థితులు చూసుకోడానికి జైలులో వైద్యులున్నారు.. మెడిక‌ల్ బెయిల్ తీసివేసి ఆయ‌న‌ను వెంట‌నే జైలుకు పంపేయండి* అని ఈ సంస్థ తెస్తున్న ఒత్తిడికి జ‌డ్జి పూర్తిగా లొంగిపోయారు. అందువ‌ల్లే ఈ తీర్పును, ఎన్ఐఏ తీరును విర‌సం ఖండిస్తోంది.

కోర్టులు వాచ్య రూపేణా ప్ర‌క‌టించుకునే ప్ర‌జాస్వామిక, లౌకికి అనుకూల వైఖ‌రికీ.. అవి లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చే తీర్పుల‌కు పొంత‌న ఉండ‌టం లేదు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఇటీవ‌లికాలంలో గ‌మ‌నిస్తున్న కొత్త పోక‌డ ఇది. అయితే, మిగ‌తా రాజ్యాంగ అంగాల మాదిరిగానే జ్యుడీషియ‌రీని కూడా నిరంకుశ ఉద్యోగ‌వ‌ర్గ‌మే న‌డిపిస్తోంది. జ‌వాబుదారీత‌నం, బాధ్య‌త లేని వ్య‌వ‌స్థ ఇది. ప్ర‌జా ప్రాతినిథ్యం లేని ఇలాంటి వ్య‌వ‌స్థ‌లు గాజుక‌న్ను న్యాయ‌మే అందించ‌గ‌ల‌వు. అందుకే ఇలాంటి తీర్పులు వ‌స్తున్నాయి.

వ్య‌వ‌స్థ అన్న త‌ర్వాత రాజ్యాంగం ప్ర‌కారం పోయి ప్ర‌జామోదం పొందే కొంద‌రు బ్యూరాక్ర‌ట్లు, రెండు, మూడు మంచి తీర్పులు ఇచ్చే న్యాయ‌మూర్తులు ఉంటూనే ఉంటారు. అటువంటి పిడికెడు మందిని చూపించి వ్య‌వ‌స్థ‌ల‌ను స‌మ‌ర్థించుకోవ‌డం పాల‌క‌వ‌ర్గాల‌కే చెల్లు. ప్ర‌జా ఉద్య‌మాల ఒత్తిడి వ్య‌వ‌స్థ‌ల‌పై నిరంత‌రం ఉండ‌ట‌మే నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం! పుట్ట‌డ‌మే ఎన్ఐఏ వంటి సంఘ్ సంస్థ‌లు ప్ర‌జాస్వామ్యాన్ని హ‌త్య‌చేశాయి. ప్ర‌జా ఉద్య‌మాల‌ను బ‌ల‌ప‌రిచే అన్నిర‌కాల‌ భావ‌జాలాల‌పై క‌క్ష పూని ప‌ని చేస్తున్నాయి. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను లొంగ‌దీసుకుని అన్యాయ‌మైన తీర్పుల‌ను రాయిస్తున్నాయి.

తీవ్ర అనారోగ్యంతో గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన వీవీ ఆరు నెల‌ల కాలానికి మెడిక‌ల్ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ బెయిల్ గ‌డువు ఆ ఏడాది సెప్టెంబ‌రుతో ముగిసింది. అప్పుడు వీవీ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వేసిన మూడు పిటిష‌న్ల‌పై నిర్ణ‌యాన్ని ఇప్ప‌టివ‌ర‌కు కోర్టు సాగ‌దీసింది. నిజానికి, వీవీని తిరిగి జైలుకు పంపింపాల‌ని ఎన్ఐఏ తెచ్చిన ఒత్తిడే ఈ సాగ‌దీత‌కు కార‌ణం. అయితే..ఇదే కేసులో జైలుకు పంపిన ప్ర‌తిష్ఠ క‌లిగిన జేసూట్‌ స్టాన్ స్వామి దుర్భ‌ర మ‌ర‌ణం కోర్టును వెనుక‌డుగు వేసేలా చేసింది. జైలుకు తిరిగి వెళ్లాల్సిన గ‌డువు ముగిసిపోతున్నా..బెయిల్‌పై చివ‌రినిమిషం వ‌ర‌కు స్పందించేది కాదు. ఆయ‌న క్షేమం కోరే కుటుంబ‌స‌భ్యుల‌ను, న్యాయ‌వాదుల‌ను ప్ర‌తిసారీ తీవ్ర ఆందోళ‌న‌లోకి నెట్టేసేది. మూడు వారాలుగా తీర్పును రిజ‌ర్వులో పెట్టిన కోర్టు.. వీవీ వేసిన మూడు పిటిష‌న్ల‌లో దేనినీ స్వీక‌రించలేదు. మొత్తంగా విచార‌ణ ప్ర‌క్రియ‌నే ఒక ప్ర‌హ‌స‌నంగా ముగించేసింది. ఈ క్ర‌మంలోనే మూడు బెంచీలు మారాయి. వీవీ పిటిష‌న్ల‌పై రేపో మాపో తీర్పు వ‌స్తుంద‌ని ఆశించిన‌ప్పుడ‌ల్లా.. బెంచ్ మారిపోయేది. ఎన్ఐఏకు న‌చ్చిన బెంచ్ ఏర్ప‌డేవ‌ర‌కు ఈ డ్రామా విసుగూవిరామం లేకుండా సాగింది. రెండోసారి వేసిన బెంచ్.. వీవీ త‌ర‌ఫు వాద‌న‌లు విన‌డానికే ఇష్ట‌ప‌డ‌లేదు. ఎన్ఐఏ ఒత్తిడికి పూర్తిగా లొంగిపోయింది. వీవీ వ‌య‌సు..దీర్ఘ‌కాలిక‌ అనారోగ్య స‌మ‌స్య‌లు, కుటుంబ స‌ప‌ర్య‌లు అవ‌స‌ర‌మైన శారీర‌క స్థితి.. వీటిలో వేటినీ ప‌రిగ‌ణించకుండానే మూడో బెంచ్ దుర్మార్గ‌మైన తీర్పు రాసేసింది. వీవీని తిరిగి జైలుకు పంపాల‌ని జ‌రుగుతున్న కుట్రలో భాగ‌మైన ఈ తీర్పును విర‌సం వ్య‌తిరేకిస్తోంది. కండీష‌న్ తొల‌గించి, కుటుంస‌భ్యుల‌తో క‌లిసి ఉండేలా శాశ్వ‌త బెయిల్‌ను ఇవ్వాల‌నే న్యాయ‌మైన డిమాండ్‌ను అంద‌రం బ‌ల‌ప‌రుద్దాం.

– అర‌స‌విల్లి కృష్ణ‌, అధ్య‌క్షుడు
– రివేరా, కార్య‌ద‌ర్శి
విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం

Keywords : virasam, varavarararao, bombay highcourt, bail, NIA
(2024-04-08 08:02:10)



No. of visitors : 974

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వీవీని