విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం


విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం

విప్లవ

22-04-2022

ఈ నెల 9వ తేదీన ప్రభుత్వ ప్రభుత్వ నిర్బంధంలో మరణించిన సీపిఐ మావోయిస్టు నాయకురాలు ఉప్పుగంటి నిర్మలా కుమారి ఎలియాస్ న‌ర్మదది బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పాలకులు చేసిన హత్య అని క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం ఆరోపించింది. ఈ మేరకు ఆ సంఘం అధికార ప్రతినిధి రాంకో హిచామి ప్రకటన విడుదల చేశారు.

క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం ప్రకటన పూర్తి పాఠం....

దండకారణ్య విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్ నర్మద అమర్ రహే !

జైల్లో నిర్బంధించి కామ్రేడ్ నర్మదను మృత్యుముఖంలోకి నెట్టిన ప్రభుత్వ ఫాసిస్టు చర్యను ఖండించండి!

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెక్రటేరియట్ సభ్యురాలూ, క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం (కేఏఎమ్ ఎస్) సీనియర్ నాయకురాలు కామ్రేడ్ నర్మద (ఉప్పుగంటి నిర్మలా కుమారి) ఏప్రిల్ 9వ తారీఖున ప్రభుత్వ నిర్బంధంలో తుదిశ్వాస వదిలిందనే సమాచారం మాకు ఆలస్యంగా తెలిసింది. కేఏఎంఎస్ ఆమెకు వినమ్ర నివాళి అర్పిస్తున్నది. ఆమె త్యాగాల దారిలో మరింత దృఢంగా ముందుకు సాగమని కేఏఎంఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నది.

దాదాపు 60 సంవత్సరాల కామ్రేడ్ నర్మదకు 2018లో కాన్సర్ నిర్ధారణ అయింది. చికిత్స పొందుతున్న సమయంలో 2019, జూన్ 12వ తేదీన అమెను తన జీవిత సహచరుడు కామేడ్ కిరణ్ (రాణీ సత్యనారాయణ)తో పాటు పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న కామ్రేడ్ నర్మదను, సరైన చికిత్స అందకుండా చేసి చంపాలనే నేరపూరిత, క్రూరమైన ఉద్దేశ్యంతో ప్రభుత్వమూ, అధికారులు ఆమెను ముంబయి జైలులో బంధించారు. కామ్రేడ్ నర్మద సహా మావోయిస్టు కేసుల్లో మగ్గుతున్న యావత్తు మహిళా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని 2021, మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా కేఏఎంఎస్ ప్రచారోద్యమాన్ని నడిపింది. జైలు నుండి విడుదల చేసి ఆమె ప్రాణాలను కాపాడాలని కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతేకాదు ఆమె బెయిల్ కోసం కోర్టుల్లో న్యాయపోరాటం కూడా జరిగింది. కానీ క్రూరమైన న్యాయవ్యవస్థ మృత్యువుతో పోరాడుతున్న కామ్రేడ్ నర్మదకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి తమ హంతక ముఖాన్ని బహిర్గతం చేసుకుంది.

ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిన విషమ పరిస్థితిలో ఆమెను ముంబయిలోని కేన్సర్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే అమె మరణించింది. వాస్తవానికి ఇది మరణం కాదు, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ చేసిన దారుణ హత్య. ఈ హత్యను కేఏఎంఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. పోరాటం, అసమ్మతిని అణచిపెట్టడం కోసం ఫాసిస్టు పద్దతిని అవలంబిస్తూ చట్టవిరుద్దంగా అరెస్టు చేసిన యావత్తు ఖైదీలను జైళ్ల నుండి విడుదల చేయాలని ఈ సందర్భంగా కేఏఎంఎస్ మరొకసారి డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్ లో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో మిలిటెంట్ ఆందోళన చేపట్టాలని కేఏఎంఎస్ సభ్యురాళ్లతో పాటు దేశీయ, అంతర్జాతీయ విప్లవ, మానవ హక్కుల, ప్రజాస్వామిక, ప్రగతిశీల సంఘాలకూ, మహిళా సంఘాలకూ, ప్రగతిశీల న్యాయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నది.

ఈ కామ్రేడ్ ఉప్పుగంటి నిర్మలా కుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, గన్నవరం గ్రామంలో పుట్టి పెరిగింది. 80వ దశకంలో తన యవ్వనప్రాయంలో నక్సల్బరీ మార్గం పట్ల ఆకర్షితురాలై విప్లవోద్యమంలో అడుగుపెట్టింది. ఆనాటి నుండి విప్లవం, ప్రజల పట్ల అచంచల విశ్వాసంతో, అకుంఠిత దీక్షతో ముందుకు సాగింది. ప్రారంభ కాలంలో కొన్ని సంవత్సరాలపాటు ఆమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార పత్రిక - ʹప్రభాత్ʹ సంపాదక మండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించింది. తర్వాత ఆమె గఢ్ చిరోలి యుద్ధ మైదానంలో కాలుమోపింది. ఒకవైపు సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తూ రెండో వైపు క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘానికి నాయకత్వం వహించింది. ఆమె కొన్ని సంవత్సరాల పాటు కేఏఎంఎస్ జోన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించింది.

దండకారణ్యంలో మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో, దానికి దేశవ్యాప్త గుర్తింపును తేవడంలో ఆమె అమూల్యమైన, అవిస్మరణీయమైన పాత్ర నిర్వహించింది. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ మహిళా ఉద్యమంలో, విప్లవోద్యమంలో మహిళా కామ్రేడ్ల క్రియాశీలత, సామర్థ్యాలను పెంపొందించడం కొరకు ప్రయత్నించింది. మహిళా కామ్రేడ్లను సమర్థవంతమైన నాయకురాళ్లుగా, సాహసిక కమాండర్లుగా తీర్చిదిద్దడానికి ఆమె నిరంతరం పాటుపడింది. కేఏఎంఎస్ అధికారిక పత్రిక ʹపోరుమహిళʹ నిర్వహణలో ఆమె ప్రముఖ పాత్ర వహించింది.

ఆమె ఒక మంచి రచయిత్రి. ʹనిత్య అనే కలం పేరుతో మహిళా సమస్యలపై అనేక వ్యాసాలు, కథలు రాసింది. విప్లవోద్యమంలో తను వహించిన ముఖ్యమైన పాత్ర ఫలితంగా అమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆ తర్వాత డీకే ఎస్ జెడ్ సీ సెక్రటేరియట్ సభ్యురాలైంది. గఢ్ చిరోలి ఉద్యమంలో ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తూ డీకేఎస్ జెడ్ సీకి చెందిన పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జ్ బాధ్యతలను నిర్వర్తించింది. ఉద్యమ ఎగుడు-దిగుళ్లలో, గడ్డు పరిస్థితిలో, తీవ్రమైన నిర్బంధంలో అమె ధైర్యసాహసాలతో ఉద్యమానికి నేతృత్వం వహించింది. ప్రజలూ, పార్టీ శ్రేణుల ప్రేమనూ, విశ్వాసాన్ని అపారంగా చూరగొన్నది. ఈ క్రమంలో కేన్సర్ వ్యాధికి గురై పోరాట ప్రాంతం నుండి బయటకు వెళ్లింది. చికిత్స పొందుతూ అరెస్టయింది. ,

ఈ విధంగా మహిళా విముక్తి, పీడిత ప్రజల రాజ్యాధికార స్థాపనకై సుదీర్ఘ కాలం పాటు దృఢంగా పని చేసి తన అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన కామ్రేడ్ నర్మద ఆశయాలను ఎత్తిపడుదాం. ఆమె దారిలో మరింత దృఢంగా ముందుకు నడుస్తూ మహిళా ఉద్యమాన్ని బలోపేతం, విస్తృతం చేసి కామ్రేడ్ నర్మద కలలను సాకారం చేద్దాం.

- కామ్రేడ్ నర్మద అమర్ రహే!
- కామ్రేడ్ నర్మద ఆదర్శాలను ఎత్తిపదుదాం!
- కామ్రేడ్ నర్మద మరణానికి బాధ్యులైన ప్రభుత్వానికీ, జైలు అధికారులకూ వ్యతిరేకంగా పోరాడుదాం!

విప్లవాభివందనాలతో,
రాంకో హిచామి,
అధికార ప్రతినిధి ,
క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం,
దండకారణ్యం


Keywords : narmada, KAMS, Kranthi kaari mahila sangham, CPI Maoist, uppuganti nirmala, cancer, maharashtra Jail
(2022-06-28 12:32:25)



No. of visitors : 507

Suggested Posts


దండకారణ్య విప్లవోద్యమ నాయకురాలు కా. నర్మదకు విప్లవ జోహార్లు!

కా. నిర్మల @ నర్మద శనివారం ఉదయం కేన్సర్ తో మరణించిందనే విషాద వార్త తెలిసింది. ఆమె మరణంతో భారత విప్లవోద్యమం ఒక గొప్ప నాయకురాలిని కోల్పోయింది.

నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

అత్యంత సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు నిర్మల అలియాస్ నర్మదా దీదీ మహారాష్ట్ర జైలులో మరణించిన నేప‌థ్యంలో ఏప్రిల్ 25న దండకారణ్య బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. అన్ని కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు.

ʹపూచిన చెట్టుకిందనే రాలిన పువ్వుʹ -ఎన్.వేణుగోపాల్

చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను ఇవాళ బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


విప్లవ