పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం


పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం

పౌర

25-04-2022

పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగవ మహాసభలు విజయవంతంగా జరిగాయి. 24 ఏప్రిల్ 2022 ఆదివారం పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఏ ఐ టి యు సి భాస్కర్ రావు భవన్ లో ఈ సభలు జరిగాయి. ముందుగా పౌరహక్కుల ఉద్యమంలో అసువులు బాసిన అమరుల స్థూపాన్ని ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆవిష్కరించారు అనంతరం మహాసభ నిర్వహణ మహాసభలకు ప్రధాన వక్తలుగా పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్‌ నారాయణ రావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ మహాసభల నుద్దేశించి ప్రసంగించిన వక్తలు తెలంగాణ రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం, దళితులపై దాడులు, రాజ్యహింస విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. తెలంగాణ పోరాట ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రభుత్వం పని చేయడం లేదని, ఆదిప‌త్య ధోరణి లో ప్రభుత్వం ప్రజలపై దమనకాండ పెరిగిపోయిందని, రైతు ఆత్మహత్యలు పెరిగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతుల మీద దాడులకు పాల్పడుతూ ప్రభుత్వంనిరంకుశ ధోరణి అవలంబిస్తోందని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో లాకప్ డెత్ లు జరగడం, కుల దురహంకార హత్యలు పెరిగిపోవడం, న్యాయవాదుల మీద, రచయితల మీద, కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు మీద అక్రమ కేసులు నమోదు చేయడం, ప్రశ్నించకుండా ఉండడానికి వారిని జైల్లో నిర్బంధించే ఈ ప్రక్రియ కొనసాగుతుందనివారు ఆరోపించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభల సందర్భంగా కొన్ని తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది

మహాసభ తీర్మానాలు

1,రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి .రామగుండం ఎరువుల కర్మాగారం.,ఎన్ టి పి సి లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులను శాశ్వత కార్మికులుగా గుర్తించాలి

2,సింగరేణి కి చెందిన 4 బొగ్గు బ్లాకుల వేలం వేయకుండా సింగరేణి కేటాయించాలి

3, సింగరేణి విద్య, వైద్యం కార్మికుల తో పాటు ప్రభావిత గ్రామాల ,భూ నిర్వాసితులు ప్రజలకు ఉచితంగా అందించాలి

4సింగరేణి విశ్రాంత కార్మికులకు మినిమమ్ ఇరువైఐదువేల రూపాయలు పెన్షన్ అందించాలి

ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం నూతన కార్యవర్గాన్నిఎన్నుకోవడం జరిగింది. శ్రీపతి రాజు గోపాల్ పౌరహక్కుల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షురాలిగా పుల్ల సుచరిత, రెండవ ఉపాధ్యక్షులుగా నారా వినోద్ , ప్రధాన కార్యదర్శిగా మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శులుగా, బొడ్డుపల్లి రవి ,గడ్డం సంజీవ్ కుమార్,అడ్వకేట్, కోశాధికారిగా పోగుల రాజేశం, కార్యవర్గ సభ్యులుగా యాదవనేని పర్వతాలు,కడ రాజన్న ,మోట పలుకుల వెంకట్ లను ఎన్నుకొన్నారు.

ఈ మహాసభల సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నుండి ప్రతినిధులుగాహాజరై మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం కృషిని భవిష్యత్తులో చేయబోయే పనులను మరింత విస్తృతంగా చేయాలని సూచించారు,గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులు,శైలజ, IFTU నాయకులు ఐ. క్రిష్ణా, విరసం సభ్యులు బాలసాని రాజయ్య,తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రతినిధి గుమ్మడ కోమ్మురయ్య, గాండ్ల మల్లేశం, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడు హుస్సేన్, కవి రచయిత జర్నలిస్ట్ మాదాసు రామ్మూర్తి, సామాజిక ఉద్యమకారుడు పోరెడ్డి వెంకట్ రెడ్డి,రైతుసంఘం నాయకులు ముదిమడుగుల మల్లన్న, DTF రాష్ట్ర నాయకులు, వెంకట్రాజం ప్రముఖ న్యాయవాది శైలజ,ఆడెపు సమ్మన్న,బేబీ సత్యం శ్రీమన్నారాయణ, పి కె ఎం . రామ్ చందర్, రమేష్ తదితర కళాకారులు పాల్గొన్నారు.


సమావేశం ప్రారంభానికి ముందు అమరుల స్తూపానికి నివాళులు అర్పిస్తున్న పౌరహక్కుల సంఘం నాయకులు,ప్రతినిధులు

Keywords : CLC, Karim nagar, godavari khani, peddapalli, civil liberties committee
(2022-06-28 14:39:33)No. of visitors : 413

Suggested Posts


ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


పౌర