హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం


హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం

హిందీ

30-04-2022

హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి అని ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ హెచ్చరించారు.. హిందీ మాట్లాడని వ్యక్తులు విదేశీయులుగా భావించబడతారని, వాళ్ళు విదేశీ శక్తులతో చేతులు కలిపినవారిగా భావించాలని ఆయన హూంకరించారు.

ది న్యూస్ మినిట్ ప్రకారం, నటులు అజయ్ దేవగన్ మరియు కిచ్చా సుదీప్ మధ్య ట్విట్టర్ యుద్దం తర్వాత మరోసారి హిందీ భాష అంశం ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనిపై పై మీడియా అడిగిన ప్రశ్నకు నిషాద్ స్పందించారు.

ʹభారతదేశంలో నివసించాలనుకునే వారు హిందీని ప్రేమించాలి. మీరు హిందీని ఇష్టపడకపోతే, మీరు విదేశీయులుగా, విదేశీ శక్తులతో చేతులు కలిపినవారిగా భావించబడుతుంది. మేము ప్రాంతీయ భాషలను గౌరవిస్తాము, కానీ ఈ దేశం ఒకటి, భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం, భారతదేశం ʹహిందూస్థాన్ʹ. అంటే హిందీ మాట్లాడేవారి ప్రదేశం. హిందుస్థాన్ లో హిందీ మాట్లాడని వారికి చోటు లేదు. వారు ఈ దేశాన్ని వదిలి వేరే చోటికి వెళ్లాలిʹ అని నిషాద్ పేర్కొన్నట్లు ది న్యూస్ మినిట్ తెలిపింది.

నిషాద్ నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్ వ్యవస్థాపకుడు, దీనిని సాధారణంగా నిషాద్ పార్టీ అని పిలుస్తారు. ఆయన బీజేపీకి మిత్రపక్షం.

బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒకే దేశం, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే తిండి, ఒకే భాష లాంటి నినాదాలతో దేశ రాజ్యాంగాన్ని, ఫెడరల్ వ్యవస్థని ప్రశ్నిస్తున్న ఉన్మాదులు దేశంలో అరాచకం సృష్టిస్తున్నారు.

హిందీ భారతదేశం యొక్క జాతీయ భాష కాదనే విషయం ఎప్పుడో తేలిపోయిన అంశం. అయినప్పటికీ, కొందరు రాజకీయ నాయకులు ఇతర భారతీయ భాషల కంటే హిందీ భాషే గొప్పదంటూ తరచుగా వాదిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, వివిధ భాషలు మాట్లాడే పౌరులు ఒకరితో ఒకరు సంభాషించుకోవాలంటే అది హిందీలోనే జరగాలి అంటూ మాట్లాడారు.

ఆయన వ్యాఖ్యలపై పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. అమిత్ షా హిందీ గురించి మాట్లాడిన మాటలు భారతదేశ ʹసమగ్రత మరియు బహుత్వానికిʹ విరుద్ధంగా ఉన్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.

ఆ తర్వాత మళ్ళీ కన్నడ నటుడు కిచ్చ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ దేవ్ గన్ లు ఒకరిపై ఒకరు చేసుకున్న‌ ట్వీట్లు మళ్ళీ హిందీ సమస్యను వేదిక మీదికి తీసుక‌వచ్చింది.

Keywords : hindi language, Uttara pradesh, sanjay nishad, ajay devgan, kicha sudeep, amit shah
(2023-05-31 17:10:41)



No. of visitors : 336

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల‌ బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా

Search Engine

RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
more..


హిందీ