ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌

ప్రపంచ

28-04-2022

అరుణారుణ మే దినోత్సవం వర్ధిల్లాలి!

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విప్లవకర పరిస్థితిని ఉపయోగించుకోవడం, విధ్వంసక సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడం, యుద్ధాలకు తావు లేని సోషలిజాన్ని స్థాపించడం ప్రపంచ శ్రామికవర్గం, మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ శక్తుల తక్షణ కర్తవ్యం!

ప్రపంచ శ్రామికవర్గం తన పోరాట సంకల్పాన్ని తెలిపే రోజు మే డే. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, సార్వభౌమాధికారం కోసం శ్రామికవర్గం తన శక్తుల సమతుల్యతను అంచనా వేసే రోజు. మరింత దృఢ సంకల్పంతో అలుపెరుగని పోరాటానికి తన మొత్తం శక్తిని సమీకరించుకునే రోజు. ఈ రోజున తమ దేశాల శ్రామికవర్గ విప్లవాల విజయానికి, తద్వారా ప్రపంచ సోషలిస్టు విప్లవ సాధనకు ప్రతిజ్ఞ చేస్తుంది. మే డే సందర్భంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిరంతరాయంగా పోరాడుతున్న ప్రపంచ శ్రామిక వర్గానికి మా పార్టీ కేంద్ర కమిటీ లాల్ సలాం చెప్తోంది.

ప్రపంచాన్ని, పర్యావరణాన్ని, ప్రజలను నాశనం చేయడం సామ్రాజ్యవాద స్వభావం. అది నిరంతర విధ్వంసంలో మాత్రమే సజీవంగా ఉంటుంది. సామ్రాజ్యవాదం విధ్వంసక కరోనాను సృష్టించింది, తన ఆర్థిక, విత్త సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రపంచీకరణ విధానాలలో భాగంగా ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మిస్తోంది. మొత్తం భారాన్ని ప్రజలపై మోపుతోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని వెనుకబడిన దేశాలకు చెందిన దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు సహకరిస్తోంది. బలవంతపు, అసమాన ఒప్పందాల ద్వారా పెట్టుబడి, సాంకేతికత పేరుతో సహజ, శ్రామిక శక్తిని, మార్కెట్‌లను విచక్షణారహితంగా కొల్లగొడుతోంది.

అయితే సంక్షోభం నుంచి కోలుకొనేలా కనిపించడం లేదు. మాంద్యం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్రతరమయ్యాయి. ఆరోగ్యం, విద్యతో సహా మొత్తం ప్రజల జీవనం సంక్షోభంలో పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధనికులు, పేదల మధ్య అసమానతలు పెరుగుతున్నాయి. యుద్ధంపై ఆధారపడిన అమెరికా ఆర్థిక వ్యవస్థ అత్యధిక లాభాల కోసం ప్రపంచంలోని అన్ని మూలల్లో అనేక యుద్ధాలను ప్రేరేపిస్తోంది, ఆయుధాలను అమ్ముతోంది. జీవితం భయంకరంగా మారింది, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వాటిని అణిచివేసేందుకు సామ్రాజ్యవాదం ఫాసిస్టు శక్తులకు ఆసరాగా నిలుస్తోంది. సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న విధ్వంసకర విధానాల కారణంగా అంతర్జాతీయ, దేశీయ రంగాల్లో మౌలిక వైరుధ్యాలు తీవ్రరూపం దాల్చి విప్లవకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

సామ్రాజ్యవాదానికి, అణగారిన జాతులు, అనేక వెనుకబడిన దేశాల ప్రజలకూ మధ్య వైరుధ్యం తీవ్రతరమై, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ఉపాధి, విద్య, ఆరోగ్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించని, ధరల పెరుగుదలకు కారణమైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక వెనుకబడిన దేశాల ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారు. జాతుల అణచివేతకు వ్యతిరేకంగా అణగారిన జాతులు పోరాడుతున్నాయి.

గత 20 ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్‌ను అణిచివేస్తున్న అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం గత ఏడాది కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో ఒకటి. 1975లో వియత్నాంలో లాగానే 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ఓటమిని చవిచూసింది. ప్రజలు దృఢ సంకల్పంతో పోరాడితే, ఆధునిక సామ్రాజ్యవాద సైన్యాలను అంతమొందించవచ్చని ఈ పరిణామాలు చూపిస్తున్నాయి. భారతదేశంలో, బ్రాహ్మణీయ, హిందుత్వ మోడీ ప్రభుత్వ నయా ఉదారవాద, కార్పొరేట్ ప్రాయోజిత విధానాలకు వ్యతిరేకంగా వివిధ అణగారిన వర్గాలు, సెక్షన్లు, ఆదివాసీ, అణగారిన జాతుల ప్రజలు సమరశీల పోరాటాలు జరుపుతున్నారు.

కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన నాలుగు కోడ్‌లు, ప్రైవేటీకరణ, తాత్కాలిక కాంట్రాక్ట్‌ వ్యవస్థ, కృత్రిమ ఇంటెలిజెన్స్‌, కార్మికులపై పని భారం-పని గంటల పెంపు, నిజ వేతనాల పతనం, భయంకరమైన పని పరిస్థితులు, సంక్షేమ కార్యక్రమాలలో కోతకు వ్యతిరేకంగా, కనీస వేతనాలు, ఉపాధి హామీ కోసం కార్మికులు ఐక్య పోరాటాలు చేస్తున్నారు.

రైతు సంఘాల విస్తృత మద్దతుతో మార్చి 28-29 తేదీల్లో కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె అపూర్వ విజయం సాధించడం కార్మిక ఐక్యతకు నిదర్శనం.

సామ్రాజ్యవాద దేశాలలో బూర్జువాజీ- శ్రామికవర్గం మధ్య వైరుధ్యం సామ్రాజ్యవాదం తన సంక్షోభాన్ని అధిగమించడానికి శ్రామికవర్గం, మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేస్తోంది. కృత్రిమ మేధస్సును, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని శాశ్వత ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలలో కోత పెడుతోంది. ప్రజలపై విపరీతమైన పన్ను భారం మోపుతోంది. కరోనా సంక్షోభం వల్ల విధించిన కోవిడ్ ఆంక్షలు, ఉద్యోగాల తొలగింపు, ఎక్కువ పని గంటలు, వేతనాల తగ్గుదల, అధిక ధరలు - శ్రామికవర్గం, ఉద్యోగులు, విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తల పెద్ద ఎత్తున ఆందోళనలు, సమ్మెలకు దారితీస్తున్నాయి. అనేక దేశాలలో కార్మికుల ప్రదర్శనలు సమరశీల రూపాన్ని సంతరించుకుంటున్నాయి.

సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యం

క్షీణిస్తున్న అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ అత్యంత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అమలు చేస్తున్నాడు. సామ్రాజ్యవాద పోటీదారులుగా ముందుకు వస్తున్న రష్యా, చైనాలను నియంత్రించడానికి NATO, G-7 దేశాల ఆధిపత్యాన్ని నిలబెట్టింది, ʹQUADʹని బలోపేతం చేసింది; ʹAUKUSʹ ని ఏర్పాటు చేసింది. అయితే యూరప్ మాత్రం అమెరికాకు సహకరించే స్థితిలో లేదు. చమురు, గ్యాస్ దిగుమతుల కోసం జర్మనీ, ఫ్రాన్స్‌లు రష్యాపై ఆధారపడి ఉన్నాయి. మరోవైపు తైవాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తైవాన్ సముద్ర జలాల్లో చైనా, అమెరికాలు పోటీ పడుతూ చేస్తున్న సైనిక విన్యాసాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. రష్యా, చైనాలు సైనిక సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటి నుండి సామ్రాజ్యవాద దేశాల మధ్య ఉద్రిక్తతలు, విభేదాలు ఇంతకుముందెన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగింది. అమెరికా రష్యాకు యిచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించింది. నయాన్నో, భయాన్నో 30 దేశాలను భాగస్వాములుగా చేసి NATOను విస్తరించింది; NATOలో వున్న ఐరోపాలో 3వ అతిపెద్ద సైనిక శక్తిగా ఉన్న ఉక్రెయిన్‌లో చేరనున్నట్లు ప్రకటించింది; ఉక్రెయిన్‌తో ఉమ్మడి సైనిక విన్యాసాలు చేసింది; ఉక్రెయిన్‌కు మద్దతుగా తన సైనిక బలగాలు, యుద్ధ నౌకలు, క్షిపణులను మోహరించింది. దీనితో రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్షన్నర సైన్యాన్ని మోహరించింది. సామ్రాజ్యవాద వైరుధ్యాలు బద్దలై ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దారితీసింది. ఇది గత రెండు నెలలుగా విధ్వంసకర రీతిలో కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏప్రిల్ 12న జరిగిన చర్చలు విఫలమయ్యాయి. యుద్ధం నిస్సందేహంగా మరింత విధ్వంసానికి దారి తీస్తుంది. ఇది ప్రజలను భరించలేని అణచివేత, సంక్షోభాలలోకి నెట్టివేస్తుంది. సామ్రాజ్యవాద దేశాల ఆర్థిక, ఆధిపత్య ప్రయోజనాల కోసం జరుగుతున్నా క్రీడల్లో ప్రపంచ శ్రామికవర్గం, ఇతర అణగారిన వర్గాలు, అణగారిన జాతులు నలిగిపోతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉంది.

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం రూపంలో చెలరేగిన యుద్ధం సామ్రాజ్యవాద యుద్ధం. ఉక్రెయిన్ అమెరికా చేతిలో ఒక ఎర. కార్మికులు, రైతులు, మధ్యతరగతి, ఇతర అణగారిన వర్గాలు, అణచివేతకు గురవుతున్న జాతులకు యుద్ధాన్ని ఖండించాలని మా పార్టీ పిలుపునిస్తోంది. ʹకార్మిక వర్గానికిʹ ఒక దేశం అంటూ లేదు ..... అన్ని ప్రాంతాలలోని కమ్యూనిస్టులు ప్రస్తుతం అస్థిత్వంలో ఉన్న (పెట్టుబడిదారీ) సామాజిక-రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి ఒక్క విప్లవోద్యమానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు. ʹప్రపంచ కార్మికులారా ఏకం కండిʹ,... చైతన్యవంతమైన శ్రామికవర్గం సామ్రాజ్యవాద తోడేళ్ళ గుంపులో దేనికీ మద్దతు ఇవ్వదు...ʹ యుద్ధంలోవున్న ఏదో ఒక సామ్రాజ్యవాద దేశ పక్షాన్ని తీసుకోదు...అనే కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, గొప్ప మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు లెనిన్ బోధనలను ఎత్తిపట్టాలని ప్రపంచంలోని శ్రామికవర్గం, అణగారిన వర్గాలు, అణచివేతకు గురవుతున్న జాతులకు పిలుపునిస్తూంది,
తన క్షీణిస్తున్న ప్రపంచ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి ఉక్రెయిన్‌ను బలిపశువుగా మార్చే అమెరికా విధ్వంసకర చర్యలను తిప్పికొట్టాలని, అమెరికా నాయకత్వంలో వున్న నాటోను ఉపసంహరించుకోవాలని, ప్రపంచ ప్రజల ఆకాంక్షల మేరకు రష్యా తక్షణమే, బేషరతుగా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని, రష్యా తన సైన్యాన్ని వెనక్కితీసుకోవాలనే డిమాండ్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సమరశీల పోరాటాలు చేస్తున్నారు.

సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా ప్రపంచ శ్రామికవర్గ కర్తవ్యం. తద్వారా పుతిన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంఛాలి. 1917లో కామ్రేడ్స్ లెనిన్, స్టాలిన్‌ల నాయకత్వంలోని శ్రామికవర్గం నాయకత్వంలో మొత్తం అణగారిన వర్గాలు, పీడిత జాతులు, మొదటి ప్రపంచ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చడం ద్వారా సాధించిన అక్టోబర్ విప్లవ విజయ గొప్ప అనుభవం నుండి శ్రామికవర్గం నేర్చుకోవాలి. రష్యా అణుయుద్ధంలో మునిగి మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభిస్తే కనక , ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, పుతిన్ ప్రభుత్వాన్ని కూలదోయాలి. శ్రామికవర్గం నాయకత్వంలో నూతన, ఉన్నతమైన సోషలిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ను పురికొల్పడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ శ్రామికవర్గం నాయకత్వంలో అమెరికా, ఐరోపా దేశాలలోని అణగారిన ప్రజలు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. USNATO కూటమి మూడవ ప్రపంచ యుద్ధంలో మునిగితే కనక, అది అంతర్యుద్ధంగా రూపాంతరం చెందాలి.

అదేవిధంగా, కొత్త సోషల్-సామ్రాజ్యవాద శక్తి అయిన చైనా దేశ శ్రామికవర్గం దీనికి గుణపాఠం నేర్పాలి.
మానవతా దృక్పథంతో ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా పారిపోతున్న ఉక్రెయిన్ ప్రజలను రక్షించాలని మా పార్టీ ప్రపంచ శ్రామికవర్గానికి, పీడిత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూంది. ఉక్రెయిన్‌లోని శ్రామికవర్గం, పీడిత ప్రజలు నాటో అనుకూల, ముఖ్యంగా US సామ్రాజ్యవాద అనుకూల NATO ఉపగ్రహంగా మార్చిన , జెలెన్స్‌కీ ప్రభుత్వపు US-EU అనుకూల సామ్రాజ్యవాద విధానాలను ఖండించాలి. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, తమ జాతీయత మనుగడ కోసం సామ్రాజ్యవాదులు విధించిన యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలి. ఉక్రెయిన్ దేశంలోని పీడిత ప్రజలు శ్రామికవర్గం నాయకత్వంలో అన్ని రకాల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి సార్వభౌమాధికారాన్ని సాధించాలి.
అణచివేతకు గురవుతున్న జాతులు, డోన్‌బాస్ ప్రాంతంలోని డోనెట్స్క్, లుహాన్స్క్ రిపబ్లిక్‌ల ప్రజలు రష్యన్ సామ్రాజ్యవాదంపై ఆధారపడకుండా, శ్రామికవర్గం నాయకత్వంలో తమ స్వయంశక్తిపై ఆధారపడి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలి. సామ్రాజ్యవాద దేశాలతో దళారీ ప్రభుత్వాలు చేసుకున్న సైనిక ఒప్పందాలతోపాటు అన్ని రకాల ఒప్పందాల రద్దు కోసం వెనుకబడిన దేశాల ప్రజలు పోరాడాలి. సామ్రాజ్యవాద దోపిడీ, అణచివేతల నుంచి విముక్తి సాధించి ప్రపంచ శాంతిని నెలకొల్పేందుకు, సామ్రాజ్యవాదాన్ని ఈ భూమి నుండి పారదోలి, యుద్ధాలకు తావులేని సోషలిజాన్ని స్థాపించడం ప్రపంచంలోని శ్రామికవర్గం, మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ శక్తుల ముందున్న ఏకైక మార్గం, తక్షణ కర్తవ్యం.

ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి, ప్రస్తుత నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా తగిన అంతర్జాతీయ విప్లవకర శ్రామిక సంస్థను స్థాపించడం అవసరం. ఇటీవలి కాలంలో, ప్రస్తుత శ్రామిక ప్రజల డిమాండ్లపై, వారి విముక్తి దిశలో సోషలిస్ట్, నూతన ప్రజాస్వామిక విప్లవాలు, జాతి విముక్తి పోరాటాలకు ఐక్య నాయకత్వాన్ని అందించడానికి ప్రపంచంలోని అగ్రగామి సమూహాలు, సంస్థలు క్రమంగా సంఘటితం అవుతున్నాయి. వీటి మధ్య ఐక్యత, సంఘీభావం పెంపొందుతున్నాయి. అంతర్జాతీయ వేదిక నిర్మాణ ఆవశ్యకతపై మా పార్టీ వైఖరికి కొన్ని మావోయిస్టు సంస్థలు అంగీకరించి వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించడం స్వాగతించదగిన పరిణామం. ఇది ప్రపంచ శ్రామికవర్గపు అభివృద్ధి చెందుతున్న స్వీయాత్మక బలాన్ని సూచిస్తుంది. దీని ఆధారంగా, సామ్రాజ్యవాదుల అన్ని రకాల దాడులను, యుద్ధాలను ఎదుర్కోవడానికి, ప్రపంచంలో శాంతిని స్థాపించడానికి, ముఖ్యంగా ఉక్రెయిన్, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు ఐక్య నాయకత్వాన్ని అందించడానికి నిర్దిష్ట ప్రణాళికతో అంతర్జాతీయ ఐక్య వేదికలను స్థాపించడానికి ప్రయత్నిద్దాం. ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని పురోగమింపచేద్దాం. ఈ దిశగా మనం మరింత సంఘటితం అవుదాం.

అమృత్,
కేంద్రకమిటీ,
అంతర్జాతీయ వ్యవహారాలు,
సీపీఐ మావోయిస్ట్

Keywords : cpi maoist, central committee, international affairs, amrut, abhay,
(2024-09-01 15:42:47)



No. of visitors : 1883

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రపంచ