అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం

అదానీ

01-05-2022

ఛత్తీస్‌గఢ్‌, సూరజ్‌పూర్ జిల్లాలో స్థానిక మహిళలు 2022 ఏప్రిల్ 26 ఉదయం హస్దియో అరణ్యంలో మైనింగ్ ప్రాజెక్ట్ కోసం నరికేస్తున్నచెట్లను కౌగిలించుకునే ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు.

ఏప్రిల్ 6న పర్సా ఈస్ట్ కేట్ బేసెన్ బొగ్గు గనుల రెండవ దశకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తుది క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సుర్జాపూర్ జిల్లాలో చెట్ల నరికివేత మొదలైంది. రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ యాజమాన్యంలో ఉన్న రెండు ప్రాజెక్టులు అదానీ గ్రూప్ నిర్వహణలో వున్నాయి.

అటవీ అధికారులు, జిల్లా పరిపాలనాధికారులు చెట్లను నరికివేయబోతున్నారని జనార్దన్‌పూర్ గ్రామంలోని స్థానిక మహిళలకు ఏప్రిల్ 26న సమాచారం తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకుని చెట్లను కౌగిలించుకుని తమ నిరసనను తెలిపారు. స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం చూసిన వెనక్కి వెళ్లిపోయిన అధికారులు తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి వచ్చి సుమారు 300 చెట్లను నరికివేశారు,ʹ అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అలోక్ శుక్లా చెప్పారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామంలో ప్రజలు చాలా కాలంగా నిరసనలు చేస్తున్నారని, మార్చి 2 నుండి నిరవధిక నిరసనలు చేస్తున్నారు.

2019లో అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సంతకాలు చేయించుకున్న నకిలీ సమ్మతి పత్రాలను పరిశీలించాలని ప్రజలు ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు విజ్ఞప్తి చేసినప్పటికీ రాజ్యం ప్రాజెక్ట్‌‌కు క్లియరెన్స్ ఇచ్చింది. అటవీ సలహా కమిటీ క్లియరెన్స్ నివేదిక ప్రకారం, ప్రాజెక్ట్ కోసం 95,000 చెట్లను నరికివేస్తారు. కానీ తమ అంచనా ప్రకారం, పార్సా బొగ్గు బ్లాక్‌లో మైనింగ్ ప్రారంభించడానికి 841 హెక్టార్ల అడవిలో విస్తరించి ఉన్న 200,000 కంటే ఎక్కువ చెట్లను నరికివేయవలసి ఉంటుంది అని కార్యకర్తలు అంటున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, సర్గుజా, సూరజ్‌పూర్ జిల్లాల్లో హస్డియో అటవీ ప్రాంతం 170,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఒక ప్రసిద్ధ వలస కారిడార్, ఏనుగులు గణనీయమైన సంఖ్యలో వున్నాయి. ఇది మహానదికి అతిపెద్ద ఉపనది అయిన హస్డియో నది పరివాహక ప్రాంతం కూడా. దాదాపు 840 ఎకరాల దట్టమైన అడవులు నాశనమై, ఈ ప్రాంతంలోని జీవవైవిధ్యంపై ప్రభావం చూపుతాయి. 2009లో ఈ ప్రాంతాన్ని మైనింగ్ చేయకూడని ప్రాంతంగా (No-Go Zone) కేంద్రం ప్రకటించినప్పటికీ, ఆ విధానం ఖరారు కాకపోవడంతో మైనింగ్ కొనసాగింది.

1,200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ సర్గుజా, సూరజ్‌పూర్ జిల్లాల్లోని ఫతేపూర్, హరిహర్‌పూర్, సైలీ గ్రామాల నుండి సుమారు 700 మందిని నిర్వాసితులను చేస్తుంది. ఈ ప్రాంతంలో 300 చెట్లను కోల్పోయిన గ్రామస్థులు ఇప్పుడు రాత్రిపూట నిఘా ఉంచాలని, ఇతరులతో ఫోన్‌ సంపర్కంలో వుండాలనుకుంటున్నారు. ʹపగటిపూట ప్రజలు ఉండడం గమనించిన అధికారులు చెట్ల నరికివేతను ఆపారు. కానీ ఇప్పుడు రాత్రిపూట అడవిని నరికి వేస్తారేమోనని భయంగా ఉంది. కొంతమందిమి యిక్కడనే వుండి, వారు గొడ్డళ్లతో రాగానే మిగతా వాళ్ళకి తెలియచేస్తాం. చెట్లు నరికేందుకు వస్తున్నారని స్థానికులకు అధికారులు ఎలాంటి సమాచారం యివ్వలేదు, ప్రజలు నిరసన తెలిపితే కనక అధికారులు వారికి నచ్చచెప్పి వెనక్కు వెళ్ళేలా చేయాలనుకున్నారు. ఈ అడవి ఇక్కడి ఆదివాసీలకు జీవనాధారం. ఎట్టి పరిస్థితులలోనైనా రక్షించుకొంటాం. మా సమ్మతి లేకుండా ఈ ప్రాజెక్ట్‌‌కు క్లియరెన్స్ యిచ్చారు. కానీ వారిని ముందుకు వెళ్లనీయంʹ అని గ్రామస్తులు అంటున్నారు.

మూడు గ్రామాలకు చెందిన 80 శాతం మంది గ్రామస్తులు అడవిని నాశనం కాకూడదని అటవీ భూమిని మళ్లించడానికి యిస్తామన్న నష్టపరిహారాన్ని కూడా అంగీకరించలేదు. గత మూడు సంవత్సరాలుగా, పర్సా బొగ్గు బ్లాక్‌లోని బాధిత సంఘాలు నకిలీ గ్రామసభల సమస్యను క్రమం తప్పకుండా వెలుగులోకి తెస్తున్నాయి. బాధిత సముదాయం అంతా 2019 డిసెంబర్ నుంచి 75 రోజుల పాటు ధర్నాలో కూచుని, రాయ్‌పూర్‌కు 300 కి.మీ పాదయాత్రను నిర్వహించి, అడవి నరకటానికి అనుమతి నివ్వడానికి ఆధారపడిన నకిలీ గ్రామసభ సమ్మతి లేఖపై చర్య తీసుకోవాలని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, కలెక్టర్, ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, గవర్నర్ అనుసియా ఉయికేలను కోరారు. స్థానికుల ఒత్తిడి కారణంగా ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఇవ్వడానికి అధికారులు గ్రామసభలను ఒప్పించలేక, రహస్య సమావేశం నిర్వహించి, సమ్మతి పత్రాలపై సంతకం చేయమని సర్పంచ్‌లు లేదా గ్రామ పెద్దలను ఒత్తిడి చేశారు.

ఈ వ్యవహారంపై విచారణ జరపాలని గవర్నర్‌ ఆదేశించారు. గ్రామసభ లేఖలు నకిలీవి అయినప్పుడు, రాజ్యం స్థానికులతో మాట్లాడి వారి వాఙ్మూలంను తీసుకోవాలి. కానీ, ఇప్పటివరకు, ఈ విషయంపై దర్యాప్తు చేయలేదు. భూపేష్ బఘెల్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తాజా అనుమతులను ప్రాసెస్ చేయడానికి ఆసక్తిగా ఉంది, తగిన ప్రక్రియలను అనుసరించకపోవడంతోపాటు రాజ్యాంగపరమైన ఔచిత్యాన్ని కూడా విస్మరించింది. నకిలీ గ్రామసభ సమస్యపై విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు తుది అనుమతులనివ్వడం అంటే, పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం 1996, అటవీ హక్కుల చట్టం 2006, రాజ్యాంగంలోని షెడ్యూల్ 5లోని నిబంధనల ప్రకారం ఆదివాసీల చట్టపరమైన, రాజ్యాంగ హక్కులను నిర్ద్వంద్వంగా విస్మరించడం, ఉల్లంఘించడమే అవుతుంది.

హస్డియో అరణ్య ప్రాంతంలో రెండవ దశ మైనింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వడాన్ని నిరసిస్తూ 2022 ఏప్రిల్ 11 న ఢిల్లీలో ఛత్తీస్‌ఘడ్ సదన్ ముందు జరిగిన ప్రదర్శన లో ʹCoP26 వంటి అంతర్జాతీయ సమావేశాలలో అటవీ ప్రాంతాన్ని, కార్బన్ సింక్‌లను పెంచుతామని, శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు, సుసంపన్నమైన జీవవైవిధ్యం ఉన్న అడవులను నాశనం చేయాలని ఆదేశాలు ఇస్తుందిʹ అని పర్యావరణవేత్త భవ్రీన్ కంధారి అన్నారు.

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయా ఉయికే నకిలీ / నకిలీ గ్రామసభ సమ్మతి లేఖ మొత్తం సమస్యపై విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు, అటువంటి విచారణ పెండింగ్‌లో ఎటువంటి చర్య తీసుకోవద్దని ఆదేశించారు. భూపేష్ బఘెల్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తాజా అనుమతులను ప్రాసెస్ చేయడానికి ఆసక్తిగా ఉంది, తగిన ప్రక్రియలను అనుసరించకపోవడంతోపాటు రాజ్యాంగపరమైన ఔచిత్యాన్ని కూడా విస్మరించింది. నకిలీ గ్రామసభ సమస్యపై విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు తుది అనుమతులనివ్వడం అంటే, పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం 1996, అటవీ హక్కుల చట్టం 2006, రాజ్యాంగంలోని షెడ్యూల్ 5లోని నిబంధనల ప్రకారం ఆదివాసీల చట్టపరమైన, రాజ్యాంగ హక్కులను నిర్ద్వంద్వంగా విస్మరించడం, ఉల్లంఘించడమే అవుతుంది.

2015లో హస్దియో అరణ్యాన్ని సందర్శించి మైనింగ్‌కు వ్యతిరేకంగా సముదాయాల ప్రతిఘటనకు సంఘీభావం తెలిపినరాహుల్ గాంధీకి కూడా పర్యావరణవేత్తలు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరుతో స్థానిక సముదాయాలకు ఎటువంటి అన్యాయం జరగకుండా, వారి రాజ్యాంగ హక్కులను సక్రమంగా పరిరక్షిస్తామని తాను, కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తానని వేలాది మంది ఆదివాసీలకు ఆయన హామీ ఇచ్చారు. అయితే, ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, భూపేష్ బాఘేల్, అశోక్ గెహ్లాట్ లు అదానీ ప్రయోజనాలు, దురాశల కోసం హస్దియో అడవులను నాశనం చేయడానికి కుట్ర పన్నారు.

(downtoearth.org.in సౌజన్యంతో )

తెలుగు అనువాద‍: పద్మ‌ కొండిపర్తి

Keywords : chattis garh, adani, adivasi, surajpur, rajasthan, congress, Environmentalists protest Chhattisgarhʹs green signal to mining projects in Hasdeo Aranya, Women in Chhattisgarh recreate ʹChipko movementʹ to save Hasdeo Aranya
(2024-04-19 22:00:07)



No. of visitors : 1084

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అదానీ