శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు

శ్రీలంక

11-05-2022

(వీక్షణం మాసపత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన వ్యాసం)

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, దాని ఫలితంగా దాదాపు అంతర్యుద్ధ స్థాయిలో సాగుతున్న ఘర్షణలు, పాలక పక్ష దుర్మార్గాలు పత్రికల్లో చదివే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు. నేనిక్కడ శ్రీలంక పరిణామాల్లో గుర్తించదగిన నాలుగు సంగతులు, వాటికీ భారత సమాజానికీ పోలికలు మాత్రం చెప్పదలచాను:

1. శ్రీలంక ఆర్థిక పరిస్థితిలో గత కొద్ది సంవత్సరాలుగా, ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థల షరతుల ఫలితంగా, తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వం కొంతకాలం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆదేశాలు పాటించి, పరిస్థితి చెయ్యి దాటిన తర్వాత ఐ ఎం ఎఫ్ సహాయాన్ని తిరస్కరించినప్పటికీ, పాత ఆంక్షల ఫలితాలు కొనసాగుతూనే ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య నిలువలు తరిగిపోవడం, ప్రత్యామ్నాయాల ప్రణాళిక లేకుండా హఠాత్తుగా రసాయనిక ఎరువులను రద్దు చేయడం వంటి అనేక అసమర్థ, అవకతవక ఆర్థిక నిర్వహణా చర్యలతోపాటు, కోవిడ్ సంక్షోభం, దేశంలో తీవ్రవాద బాంబుదాడులు, యుక్రేన్ పై రష్యా దాడి వంటి పరిణామాలన్నీ కలిసి శ్రీలంక ఆర్థిక, రాజకీయ సామాజిక వ్యవస్థలు అల్లకల్లోలమయ్యాయి.

అసాధారణమైన ద్రవ్యోల్బణం, అన్ని నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహారపదార్థాల, ఔషధాల కొరత, నిత్యావసరాల కోసం ఫర్లాంగుల కొద్దీ క్యూలు, పరిశ్రమల, సేవా సంస్థల మూసివేత, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. అధికార శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ ఎల్ పి పి) గద్దె దిగవలసిందే అని ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనకు ప్రజల మద్దతు లభించింది. కొంతకాలంగా ప్రధాని అధికార నివాసం ముందర నిరసన ప్రదర్శనలు జరుపుతున్నవారి మీద ఎస్ ఎల్ పి పి గూండాలు నిన్న మధ్యాహ్నం దాడి చేసి, నిరసన గుడారాలు, వేదికలు పీకివేసి, నిరసనకారులను కొట్టి బీభత్సం సృష్టించారు. ఈ గూండాలు ప్రధాని నివాసంలోకి వెళ్లి బైటికి రాగానే ఈ దాడులు చేశారు గనుక ఆయన ఆదేశం మేరకే ఈ హింసాకాండ జరిగి ఉంటుందని శ్రీలంక పత్రికలు కోడై కూస్తున్నాయి.

ఆ హింసాకాండ జరుగుతుండగా శ్రీలంక పోలీసు బలగాలు చోద్యం చూస్తూ నిలబడ్డాయి గాని విధ్వంసకులను ఆపలేదు. రెండు మూడు గంటల్లోనే తమ శక్తి కూడదీసుకున్న నిరసనకారులు, ప్రజలు, విద్యార్థులు తిరగబడ్డారు. దేశవ్యాప్తంగా అధికారపక్ష నాయకుల మీద, వారి ఆస్తుల మీద, ప్రభుత్వ బలగాల మీద ప్రతిచర్యలు జరుగుతున్నాయి. ప్రజా ఆగ్రహానికి సమయం వస్తే దాన్ని భూమి మీద ఏ శక్తీ ఆపలేదని మరొకసారి రుజువవుతున్నది.

భారత ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థల్లో కూడా శ్రీలంక పరిణామాలతో పోల్చదగినవన్నీ జరిగాయి. భారత ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకునే సమయం ఇంకా వచ్చినట్టు లేదు. కులం, మతం, ప్రాంతం, భ్రమలు, పార్టీ విధేయతలు, స్వప్రయోజనాలు వంటి అనేక అడ్డుకట్టలు భారతదేశంలో ఉన్నట్టే శ్రీలంకలో కూడ ఉన్నాయి. కాని అక్కడ ఆ ఆగ్రహం కట్టలు తెంచుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా పాలకపక్షం అణచివేయవచ్చు. లేదా ప్రజాగ్రహమే గెలవవచ్చు. భవిష్యత్తు ఏమైనా, శ్రీలంక చరిత్రలో ఈ వర్తమాన క్షణం, సోమవారం నాటి సంఘటనలు ʹఆణవశక్తి కన్నా మానవ శక్తి మిన్నʹ అని అనేకసార్లు రుజువైన చారిత్రక సత్యాన్ని మరొకసారి చూపుతున్నాయి.

2. నిన్న మధ్యాహ్నం ప్రధాని అధికార నివాస భవనం ముందు జరిగిన ఘటనల గురించి దాదాపు శ్రీలంక పత్రికలన్నీ ఖండనలు రాశాయి. శ్రీలంక ఇంగ్లిష్ పత్రికల్లో ప్రధానమైన ʹది ఐలాండ్ʹ దినపత్రిక ʹఎస్ ఎల్ పి పి గూండాల దాడులతో రగుల్కొన్న విస్తృత హింసాకాండʹ అని మొదటి పేజీ పతాకశీర్షిక పెట్టింది. మనదేశంలో ఆర్ ఎస్ ఎస్, భారతీయ జనతా పార్టీ గూండాలు అంతకు ముందంతా అలా ఉంచి గత ఎనిమిది సంవత్సరాల్లోనే ఇటువంటి హింసాకాండలు ఎన్నో జరిపారు. విచారకరమైన విషయమేమంటే ఆ గూండాలను గూండాలు అని పతాకశీర్షికలో చెప్పగల వెన్నెముక, ధైర్యం ఉన్న పత్రికలు మనదగ్గర ఉన్నాయా వెతుక్కోవలసిందే.

3. నిన్న మధ్యాహ్నం ఒక అధికారపార్టీ పార్లమెంటు సభ్యుడి వాహనానికి ఎదురుగా నిరసన తెలుపుతున్న ప్రదర్శనకారుల మీద ఆ కారులోంచి కాల్పులు జరిపి అక్కడికక్కడ ఇద్దరు ప్రదర్శనకారులను చంపేశారు. ఒకరకంగా ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో రైతు ఆందోళనకారుల మీదికి వాహనాలు నడిపించిన భాజపా మంత్రి కుమారుడి ఘటన లాంటిదే ఇది. శ్రీలంక నిరసనకారులు ఆ వాహనాన్ని పడదోశారు. పార్లమెంటు సభ్యుడూ ఆయన వ్యక్తిగత అంగరక్షక అధికారీ పక్కన ఉన్న భవనంలోకి పారిపోయారు. నిరసనకారులు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. లోపల ఆ పార్లమెంటు సభ్యుడు అంతకు ముందు ప్రదర్శనకారుల మీదికి ఉపయోగించిన తుపాకిని తనమీదికి తానే ఎక్కుపెట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

4. అత్యంత దుర్మార్గమైన హింసావాద ఎస్ ఎల్ పి పి కి ʹశాంతి మతంʹ అని చెప్పబడే బౌద్ధం మద్దతు సంపూర్ణంగా ఉన్నదని అందరికీ తెలిసిందే. నిన్నటికి నిన్న ప్రదర్శనకారుల మీద హింసాకాండకు పూనుకున్న ఎస్ ఎల్ పి పి గూండాలకు బౌద్ధ సన్యాసులు నాయకత్వం వహిస్తూ కనిపించారని పత్రికలు రాస్తున్నాయి. ʹశాంతి మతంʹ సన్యాసులే అలా చేసినప్పుడు, ఎంతమాత్రమూ శాంతి మతంగా చెప్పడానికి వీలులేని హిందూత్వవాదులు అధికారపక్ష హింసాకాండను నడిపించడంలో ఆశ్చర్యమే లేదు. భారత సమాజంలో రానున్న అంతర్యుద్ధంలో, అది ఎప్పుడు వచ్చినా, మతం పోషించగల పాత్ర గురించి జాగరూకంగా ఉండవలసిన అవసరాన్ని శ్రీలంక పరిణామాలు మరొకసారి గుర్తు చేస్తున్నాయి.

- ఎన్.వేణుగోపాల్

Keywords : srilanka, india, rajapaksa, mahenda rajapaksa, emergency, People struggle
(2024-04-14 19:46:24)



No. of visitors : 926

Suggested Posts


ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


శ్రీలంక