ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక


ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక

ఛత్తీస్‌గఢ్

15-05-2022

2022, ఏప్రిల్ 14-15 అర్ధరాత్రి బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన బోట్టెటాంగ్, మెట్టగూడెం (ఉసూర్ బ్లాక్), దులేద్, సక్లేర్, పొట్టేమంగి (కొంటా బ్లాక్) గ్రామాలపై డ్రోన్‌లను ఉపయోగించి బాంబు దాడి చేశారు. డ్రోన్‌ల ద్వారా తమ గ్రామాలపై బాంబు దాడులు జరిగాయని స్థానికులు చెప్పిన విషయాన్ని రుజువు చేస్తూ డ్రోన్‌ల అవశేషాలు, బాంబుల లోహపు అవశేషాలు, ధ్వంసమైన చెట్ల ఫొటోలు మొదలైనవి వివిధ మీడియాలలో వచ్చాయి. ఇటువంటి అవశేషాలను చూసినప్పుడు సల్వా జుడుం, ఆపరేషన్ గ్రీన్-హంట్ లాంటి వివిధ రూపాల్లో దీర్ఘకాలంగా రాజ్య అణచివేతను ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నదానిపై ఎలాంటి సందేహమూ కలగదు.
కొద్దికాలం క్రితమే, 2022 మార్చి రెండవ వారంలో, బీజాపూర్ జిల్లా గంగులూర్ గ్రామంలో కూంబింగ్ ఆపరేషన్ పేరుతో కేంద్ర పారామిలిటరీ బలగాలు వేసిన పేలని మోర్టార్ షెల్‌లను చూపిస్తూ, ఆదివాసీ కార్యకర్త సోనీ సోరీ ఆందోళన కలిగించే వీడియో సందేశాలను పంపారు. 2021 ఏప్రిల్ 19వ తేదీన బస్తర్ నిద్రిస్తున్న సమయంలో ఇదే విధమైన వైమానిక దాడి జరిగింది. బీజాపూర్ జిల్లాలోని బోతలంక, పాలగూడెం గ్రామాల మధ్య ఉన్న ఆదివాసీ పల్లెల్లో కనీసం 12 బాంబులు వేసారు.
బహుళ-మిలియన్-డాలర్ల ఒప్పందాల ద్వారా పెరుగుతున్న సైనికీకరణతో సమానంగా ప్రజలపై ఇటువంటి అధునాతన దాడిని మనం చూస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో, ప్రభుత్వం రూ. 5,25,166 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది, గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు రూ. 4,78,196 కోట్లతో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ.
ఇటీవల, భారత ప్రభుత్వం 70వేల AK-203 అసాల్ట్ రైఫిల్స్‌ను సత్వరం కొనడానికి, రష్యాతో రూ. 5142 కోట్ల ఒప్పందాన్ని, దాంతోపాటు ఇలాంటి 6 లక్షల రైఫిళ్లను తయారు చేసే జాయింట్ వెంచర్‌ కోసం చేసుకున్న ఒప్పందాల్ని ʹతిరుగుబాటు నిరోధక కార్యకలాపాలకు మంచిదనిʹ కూడా భావిస్తోంది. అదేవిధంగా, 180 ఇజ్రాయెలీ UAVలు, 68 హెరాన్ మార్క్ Iలు కార్యాచరణ సామర్థ్యంలో ఉన్నప్పటికీ, హెరాన్ మార్క్ II డ్రోన్‌ల కొనుగోలు కోసం ఇజ్రాయెల్‌తో 200 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకుంది. అటువంటి ఆయుధ ఒప్పందాల జాబితా చాలా పెద్దదే కానీ సమగ్రమైనది కాదు.
బొగ్గు, ఇనుప ఖనిజం, సున్నపురాయి, బాక్సైట్, డోలమైట్, టిన్, మాంగనీస్ ధాతువు, బంగారం, రాగి వంటి గణనీయమైన నిక్షేపాల వనరులను దోపిడీ చేయడానికి తన కార్పొరేట్ స్నేహితులకు సహాయం చేయడంలో, కార్పొరేట్ దోపిడికి వ్యతిరేకంగా నిరంతరంగా సాగుతున్న ప్రతిఘటనా ఉద్యమాలు, పెరుగుతున్న ప్రజల పోరాటాలూ రాజ్యానికి ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల, రాజ్యం ఖనిజ సంపన్న ప్రాంతాలను సైనికీకరణ చేస్తోంది, పారామిలటరీ శిబిరాలను నిర్మిస్తోంది, (DRG), SPOలను నియమించి కుఖ్యాత సల్వా జుడుం తరహాలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోయా కమాండోలు, బస్తరియా ఫైటర్స్ వంటి సహాయక బలగాలను ఏర్పాటు చేస్తోంది. బలగాల రవాణాకు హెలికాప్టర్లను, వైమానిక బాంబు దాడులకు డ్రోన్‌లను ఉపయోగిస్తోంది.
బుల్లెట్ కంటే చాలా విస్తృతమైన, ప్రాణాంతకమైన ప్రభావాన్ని కలిగించే వైమానిక బాంబు దాడులు, మోర్టార్ షెల్లింగ్‌ల ఘటనలు అన్నింటికంటే చాలా ఆందోళన కలిగించేవి. అవి పోరాట యోధులను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేవు. అందువల్ల, మరణాల సంఖ్య పెరుగుతుంది. పౌరులు కూడా నివసించే ప్రాంతాలపై చేసే దాడులను చట్టవిరుద్ధమైనవి, అనైతికమైనవి అని నిషేధించిన జెనీవా ఒప్పందాన్ని (1949) భారత ప్రభుత్వం కూడా ఆమోదించింది.
ʹమావోయిస్ట్ సమస్యʹ పరిష్కారానికి, ʹఅనుబంధ నష్టాన్నిʹ మాఫీ చేయగలిగే పూర్తిస్థాయి యుద్ధం చేయడం కోసం తీసుకువచ్చిన దుర్మార్గ ఆపరేషన్ సమాధాన్ -ప్రహార్ కింద ఇటువంటి దౌర్జన్య, క్రూరమైన చర్యలు చేబడుతున్నారని మేము అభిప్రాయపడుతున్నాం. తమ జల్-జంగల్-జమీన్ కోసం పోరాడుతున్న ఆదివాసీ ప్రజలపై ఇటువంటి క్రూరత్వాన్ని ఆపడానికి, ప్రజలంతా ఐక్యంగా ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌ను వ్యతిరేకించాలి.
తన స్వంత ప్రజలపై జరుగుతున్న క్రూర చర్యలను ఖండిస్తూ కార్పొరేటీకరణ - సైనికీకరణ వ్యతిరేక వేదిక (ఫోరం అగైన్స్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్) ఈ క్రింది అంశాలపై డిమాండ్ చేస్తోంది.
1. వైమానిక బాంబు దాడులపై వెంటనే న్యాయ విచారణ జరిపి, దాడికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
2. ఛత్తీస్‌గఢ్, దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రజలపై వైమానిక బాంబు దాడులను, మోర్టార్ షెల్లింగ్‌లు వేయడాన్ని ఆపాలి.
3. పోలీసు, పారామిలిటరీ క్యాంపు ప్రాజెక్టులను నిర్మించడాన్ని ఆపాలి! ఆ బలగాలను ఉపసంహరించుకోవాలి!
4. రాజ్యాంగం, PESA చట్టం- 1996 5వ, 6వ షెడ్యూల్ ప్రకారం గ్రామసభలకు మంజూరు చేసిన స్వయంప్రతిపత్తిని రాజ్యం తప్పనిసరిగా గౌరవించాలి.
5. పోలీసు లేదా పారామిలటరీ క్యాంపులు, మైనింగ్, ఇతర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగే అన్ని ప్రజా ఉద్యమాలతో రాజ్యం తప్పనిసరిగా చర్చలు జరపాలి.
6. ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ లను ఆపివేయాలి.

Keywords : chattis garh, drone, bomb attacks, bjp, congress, crpf, army
(2022-12-04 09:14:27)No. of visitors : 432

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
more..


ఛత్తీస్‌గఢ్