ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు


ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు

ప్రభుత్వం

17-05-2022

మేం మూలవాసులం, ఆదివాసులం హిందూ మతం మాది కాదంటూ గొంతెత్తి నినదించండి

ప్రియమైన మూలవాసీ పోరాట ప్రజలకు, మీరంతా సమైక్యమై మేం మూలవాసీలమే కానీ హిందూవులం కామంటూ గొంతెత్తి నినదించాల్సిందిగా మా పార్టీ పిలుపునిస్తున్నది. కొద్ది రోజుల క్రితం ప్రబల మూలవాసీ రాష్ట్రం అసోం నుండి దేశీయ వ్యవహారాల మంత్రి, కరుడుగట్టిన హిందుత్వ దుష్ట శక్తి అమిత్ షా 2024 వరకు దేశ జనగణనాల డిజిటలైజేషన్ పూర్తవుతుందని ప్రకటించాడు. దీనితో వారు జనగణనాలను పూర్తి చేయడానికి వేగిరపడుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. దేశంలోని కోట్లాది మూలవాసీ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేస్తూ జనగణనాల కార్యక్రమాన్ని పూర్తిచేయపూనుకోవడం తీవ్ర తప్పిదం అవుతుంది. దీనిని మా పార్టీ మధ్య రీజినల్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తున్నది.

మన దేశ జనాభాలో మూలవాసీ ప్రజలు దాదాపు 8.4 శాతం ఉన్నారు. కానీ, భారత పాలక వర్గాలు వీరిని మూలవాసీలుగా గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి. ప్రత్యేకంగా కరుడుగట్టిన శక్తులు వారి మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మన దేశ మూలవాసుల అస్థిత్వాన్ని అంతం చేయడానికే వారిని వనవాసులంటూ గుర్తిస్తున్నది. ఆంగ్లేయుల పాలనలో మన దేశ మూలవాసులను ప్రకృతి మతానికి చెందినవారుగా గుర్తించారు. జనగణనాల జాబితాలో కూడా వారిని ఆ విధంగానే పేర్కొన్నారు. కానీ, సోకాల్డ్ స్వాతంత్య్రానంతరం కొనసాగుతున్న జనగణనాలలో మూలవాసులను హిందువులుగానే పేర్కొంటున్నారు. భారత పాలకవర్గాల ఈ కుతంత్రాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దేశ మూలవాసులందరినీ ప్రకృతి మతం పేరుతో విడిగా ఒక కాలం ఏర్పర్చి దాని కింద నమోదు చేయాలనీ మా పార్టీ డిమాండ్ చేస్తున్నది.

మన దేశంలో అనేక తెగలు అడుగంటిపోతున్నవి. ఈరోజు ఎన్నో తెగలు అస్థిత్వపు అంచుల మీద కొట్టుమిట్టాడుతున్నవి. వారిని భారత ప్రభుత్వం పీవీటీజీ సమూహాలుగా గుర్తిస్తున్నది. నిజానికి వారు ఈ వినాశకర పరిస్థితులకు చేరడానికి పాలకవర్గాల నిర్లక్ష్యమే కారణం తప్ప మరేం కాదు. వారి అభివృద్ధిని పట్టించుకోకుండా వారిని లుప్తమయ్యేవైపు నెడుతున్నాయి.

మరోవైపు వారి ఉనికిని, గుర్తింపును లేకుండా చేయడానికి భారత ప్రభుత్వం వారిని జనాభా లెక్కల సేకరణలో హిందువులుగా పేర్కొంటున్నది. ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం రూపొందించిన సీఏఏ లో దేశంలోని ఆరు మతాలను పేర్కొంటూ కోట్లాది మూలవాసీ ప్రజలను హిందూ మతంలో భాగంగానే పేర్కొంది. దీనితో కోట్లాది మూలవాసులు తమ నిరసనను తెలుపుతూ సీఏఏను రద్దు చేయాలనీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇపుడు మరోసారి వారి మెడపై జనాభా లెక్కల సేకరణ అనే కత్తిని వేలాడదీస్తున్నారు. కాబట్టి మీరంతా సమైక్యమై మూలవాసుల కోసం విడిగా ఒక కాలం జత చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందిగా మా పార్టీ కోరుతున్నది. లేనిపక్షంలో జనగణనాలను బహిష్కరించాల్సిందిగా పిలుపునిస్తున్నది. నో మూలవాసీ - నో సెన్సస్ రణనినాదంతో న్యాయమైన పోరాటానికి నడుం బిగించండి. .

విప్లవాభివందనాలతో
ప్రతాప్,
అధికార ప్రతినిధి,
మధ్య రీజియన్,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : adivasi, hindutva, assam, cpi maoist, pratap, abhay
(2023-09-26 04:07:38)No. of visitors : 1419

Suggested Posts


జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

Search Engine

అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
more..


ప్రభుత్వం