మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు

మావోయిస్టు

27-05-2022

బుధవారం సాయంత్రం 8 గంటల సమయంలో, బీహార్ రాష్ట్రం గయ జిల్లా బాంకే బజార్ బ్లాక్ పరిధిలోని లుతువా తోలా బాబు రామ్‌దిహ్ గ్రామంలోని పెద్ద మర్రి చెట్టు కింద కట్టిన గట్టుపైన ఆజ్ఞాత వ్యక్తులు ఒక మృతదేహాన్ని ఉంచి వెళ్ళిపోయారు. మృత దేహాన్ని చూసి, అక్కడ రాటకి కట్టి వున్న ఆవు గాభరాపడి అరవడంతో ఏమైందో చూడ్డానికి వచ్చిన రామ్‌దేవ్ యాదవ్ అక్కడ ఉన్న మృతదేహాన్ని చూసి, మొదట తన భార్యకు విషయం చెప్పి, మృతదేహాన్ని కప్పిన దుప్పటిని తొలగించి చూస్తే మరెవరో కాదు, అతని కుమారుడు, మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ అలియాస్ విజయ్ యాదవ్ అలియాస్ రూపేష్ జీ.

మృతదేహాన్ని చూసి కేకలు వేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం యావత్ భారతదేశం దావానలంలా వ్యాపించింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులు కూడా పెద్దఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. చూడటానికి వచ్చే శ్రేయోభిలాషుల వారి వాహనాలను లుతువా క్యాంపు దగ్గర ఉంచాలని ఆదేశించడంతో అక్కడి నుంచి వారు కిలోమీటరు దూరం నడిచి రావాల్సి వచ్చింది. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం తీసుకెళ్లాలని పోలీసులు అంటే, సందీప్ యాదవ్ బంధువులు వీడియో రికార్డ్ చేయాలని డిమాండ్ చేశారు. సందీప్ యాదవ్ కుమారుడు సోను వీడియో రికార్డ్ చేసినందుకు పోలీసులు చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడడంతో పోలీసులతో ఘర్షణ జరిగింది.

రాత్రి 1 గంట ప్రాంతంలో పోస్ట్‌ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గయా జిల్లాలోని మగధ మెడికల్ కాలేజీకి తరలించారు. ఉదయం 10 గంటల తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించి, చాలా తర్జనభర్జనల తర్వాత, గురువారం మధ్యాహ్నం బాబు రామ్‌డిహ్‌లో ఉన్న అతని పూర్వీకుల నివాసానికి మృతదేహాన్ని అంబులెన్స్‌ లో పోలీసు రక్షణతోకు తీసుకువచ్చారు. మృతదేహం గ్రామానికి చేరుకోగానే వేలాది మంది మహిళలు, పురుషులు 2నిమిషాల పాటు మౌనం పాటించి మృతదేహానికి నివాళులు అర్పించారు. సందీప్ యాదవ్ వీరోచిత జీవితాన్ని గురించి జగదీష్ యాదవ్ అలియాస్ మాస్టర్ సాహిబ్ మాట్లాడి కామ్రేడ్ ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మృతదేహంపై ఎర్రటి వస్త్రాలు ఉంచి అమరవీరుడు సందీప్‌ అమర్‌ రహే, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, లాల్‌ సలామ్‌ అంటూ నినాదాలు చేస్తూ నివాళులర్పించారు.

గయా జైలులో ఉన్న మృతుడి సోదరుడు సంజయ్ యాదవ్ అలియాస్ భూతాలి సోదరుడి దహన సంస్కారాలకు పెరోల్‌పై వచ్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంత్యక్రియల కోసం గ్రామం నుంచి నది ఘాట్‌కు తీసుకెళ్లారు. అప్పటి వరకు స్థానిక పోలీసులెవరూ ఘటనా స్థలంలో లేకపోవడం గమనార్హం. మృతదేహాన్ని చితిపై పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నప్పుడు వచ్చిన పోలీసు బలగాలు ఘాట్ వద్ద ఉన్న వ్యక్తులను వీడియో రికార్డింగ్ చేసారు. ఇంతలో ఓ గ్రామస్థుడు లాల్ సలాం అనడంతో పోలీసు అధికారులు అతన్ని దుర్భాషలాడారు. కానీ ప్రజలు ఇచ్చిన‌ నినాదాలతో పోలీసుల నోళ్ళు మూతబడ్డాయి..

రూపేష్ జీ మధుమేహ, గుండె జబ్బులకు కొంతకాలంగా అడవిలోనే చికిత్స పొందుతున్నారు. 55 ఏళ్ళ వయస్సు గల రూపేష్ (సందీప్ యాదవ్) మెడిసిన్ రియాక్షన్ ఫలితంగా గుండెపోటు రావడంతో మరణించినట్టు తెలుస్తోంది. అతను గత 20 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ బీహార్-జార్ఖండ్ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యునిగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. సందీప్ యాదవ్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి విప్లవ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఆయన ముప్పై ఏళ్ళకు పైగా విప్లవం కోసం పనిచేస్తున్నారు.

(indiaedgenews.com, magadhheadlines.com సౌజన్యంతో)

Keywords : bihar, gaya, sandeep yadav, vijay yadav, rupesh jee, cpi maoist, martyr
(2024-04-19 22:10:22)



No. of visitors : 2478

Suggested Posts


Leaders Of CPI Maoist In Bihar Seek To Consolidate Their Cadre Base Amidst State Repression

The CPI(Maoist) leaders in Bihar are trying to consolidate their cadre base and moving places to meet their supporters. Central intelligence agencies have alerted the state police on the movement of top Maoist leaders like Vijay Yadav alias Sandeep ji, Nanadlal Yadav alias Nitesh ji, Indal Bhokta and a few others....

భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నం,భూమిపుత్రుడు అరవింద్‌ - రవి నర్ల

భారతదేశంలోని విప్లవశ్రేణులకూ, బీహార్‌లోని రైతులకూ, రైతు కూలీలకూ, పీడిత ప్రజలకూ, ముఖ్యంగా మగధ్‌ ప్రాంతంలోని పీడిత ప్రజానీకానికందరికీ అత్యంత ప్రియమైన విప్లవ నాయకుడు. బ్రహ్మర్షిసేన, భూమిసేన మొదలుకొని రణవీర్‌ సేన వరకు భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నంగా నిలిచి వాటిని భూస్థానితం చేసిన ఎర్రసైన్యపు సేనాని.

బాలకపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు... బాధితురాలికి గుండుగీయించి ఊరేగించిన గ్రామ పెద్దలు

బీహార్ గయ జిల్లాలో జరిగిన ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14వతేదీన ఇంటి నుండి బైటికి వెళ్ళిన ఈ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు బలిసిన కుటుంభాలకు చెందిన దుర్మార్గులు కిడ్నాప్ చేసి పంచాయితీ భవనంపైకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. స్పృహతప్పిన ఆ బాలికను అక్కడె వదిలేసి వెళ్ళి పోయారు.

ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి

జార్ఖండ్లో గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో గతేడాది జూన్‌ 29న జార్ఖండ్‌ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్‌ అన్సారీ అనే 40 ఏళ్ళ వ్యక్తిపై 12 మంది దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరణశిక్ష విధించింది.

బీహార్ లో మహా కూటమిదే గెలుపు ?

బిహార్ లో నితీష్, లాలూల జోడీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీహార్ వాసులు మహాకూటమికే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.....

పిల్లవాడిని మోసుకొని రోదిస్తూ పరిగెడుతున్న ఆ తల్లి కష్టానికి కారణమెవరు ?

బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లా లోని షాహోపూర్ గ్రామానికి చెందిన గీరెజ్ కుమార్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి,ఒక కొడుకు కొడుకుకు మూడేళ్ళు. కొద్ది రోజులుగా కొడుకు రిషుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు.

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader

The internet canʹt stop admiring TV9 Bharatvarsh reporter Rupesh Kumarʹs questioning of a self-proclaimed Bharatiya Janta Party leader who broke ICU rules in a Muzaffarpur hospital.

జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?

అధికారానికి ఎదురు నిలిచి సత్యం పలికిన నేరానికి చెరసాలల్లో మగ్గుతున్న ప్రియమైన మిత్రులారా, మా పేర్లు కళ్యాణి, తన్మయ్. బీహార్ ఈశాన్య కొసన అరారియా అనే చిన్న జిల్లాకు చెందినవాళ్లం. బీహార్ లో భూమిలేని నిరుపేదల మధ్య పనిచేసే జన జాగరణ శక్తి సంఘటన్ కార్యకర్తలం.

టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం

బీహార్‌లోని కైమూర్ ప్రాంతంలోని నూట ఎనిమిది గిరిజన గ్రామాలు ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. గత నెలలో బీహార్ పోలీసులు ఈ ప్రాంతంలోని గిరిజన గ్రామాలపై విరుచుకుపడి గ్రామస్తులను దారుణంగా కొట్టి అనేక మందిని అరెస్టులు చేసినందుకు నిరసనగా, తమ ప్రాంతాన్ని టైగర్ రిజర్వుడు ఫారెస్టుగా ప్రకటించడానికి వ్యతిరేకంగా, మ

ఊరు మునుగుతుంది ఇసుక తవ్వకండి అన్నందుకు... లాఠీచార్జ్, టియర్ గ్యాస్,సంకెళ్ళు, జైలు....

ఇసుక తవ్వకాలు జరిపితే వర్షాకాలంలో తమ గ్రామం మునిగిపోతుందని, తవ్వకాలు జరపొద్దన్నందుకు అనేక మంది మహిళలు, పురుషలు, పిల్లలు, వృద్దుల‌పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మావోయిస్టు