బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు


బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు

బ్రహ్మదేవ్

04-06-2022

2021న, జార్ఖండ్‌లోని లాతెహార్ జిల్లా, గరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిరి గ్రామంలో నివసిస్తున్న 24 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ ను(ఖార్వార్ తెగ), నక్సల్ సెర్చ్ ఆపరేషన్‌లో పేరుతో భద్రతా దళాలు హత్య చేసాయి. బ్రహ్మదేవ్ సింగ్ భార్య జిరామణి దేవి 2021 జూన్ 29 న తన భర్తను హత్యచేసిన భద్రతా బలగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గారూ పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు పెట్టుకుంది, అయితే పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత జిరామణి దేవి కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో, ఈ విషయంపై పోలీసులకు వ్యతిరేకంగా నిరంతరం ఆందోళనలు జరిగాయి. పోలీసుల ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గ్రామ ప్రజలతో పాటు అనేక ప్రజా సంఘాలు ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఉద్యమం, కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ఫలితంగా, సుమారు ఒక సంవత్సరం తర్వాత, గారు పోలీస్ స్టేషన్‌లోని భద్రతా దళాలపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 156(3) ఆధారంగా సదరు పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసు సిబ్బందిలో కోబ్రా 203, జార్ఖండ్ జాగ్వార్, జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు. ఇందులో కోబ్రా 203 బెటాలియన్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్ కిరణ్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ టీమ్ నంబర్ 15 రాజ్‌పాల్ గుర్జార్, జార్ఖండ్ జాగ్వార్ ఏజీ-22 డిప్యూటీ కమాండెంట్ రాజీవ్ కుమార్, అరవింద్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ ధర్మేంద్ర కుమార్ రామ్, ప్రకాష్ సోయ్, ఎస్‌ఐ రూపల్ ప్రసాద్, దివాకర్ ధోబీ ఉన్నారు. గారు పోలీస్ స్టేషన్ కేసు నంబర్ 11/2022 మే 3, 2022న భద్వి సెక్షన్ 302, 201/34 (A) కింద నమోదు అయింది.

2021, జూన్ 12 న జార్ఖండ్‌లోని లాతేహర్ జిల్లా, గరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిరి గ్రామంలో నివసిస్తున్న 24 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ తో సహా అనేక మంది ఆదివాసీ పురుషులు సర్హుల్ (ఆదివాసీ సముదాయపు పండుగ) వేట కోసం గనయీఖాడ్ అడవిలోకి వెళ్లారు. మావోయిస్టుల సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న భద్రతా బలగాలు అటవీ అంచు నుండి వారిపై కాల్పులు ప్రారంభించాయి. తాము మావోయిస్టులం కాదని చేతులు పైకెత్తి నినాదాలు చేశారు. వారి అభ్యర్థన్లను వారి మాటలను ఏ మాత్రం లెక్కచేయకుండా భద్రతా బలగాలు కాల్పులు కొనసాగించడంతో దీనానాథ్ సింగ్ చేతికి తూటా తగిలింది, బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్ గాయాలతో మరణించాడు. ఈ సంఘటనలో అత్యంత విషాదకరమైన, దుర్మార్గమైన అంశం ఏమిటంటే, మొదటి బుల్లెట్ తాకి మరణించిన బ్రహ్మదేవ్ సింగ్‌ను కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత భద్రతా దళాలు మళ్లీ ఒకసారి కాల్చి చనిపోయాడని నిర్ధారించుకున్నాయి.

వారి దగ్గర చిన్న జంతువులను వేటాడేందుకు ఉపయోగించే సాంప్రదాయ భర్తువా తుపాకీ మాత్రమే వుండింది.

ఈ ఘటన తర్వాత, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా, మరణించిన బ్రహ్మదేవ్ సింగ్‌తో సహా ఆరుగురిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు (గరు పి.ఎస్. కేసు నం. 24/2021 తేదీ 13/06/21). పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఘటన గురించి తప్పుడు సమాచారం రాసి, బాధితులనే చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయాన్ని ఎన్‌కౌంటర్‌గా చూపేందుకు భద్రతా బలగాలు, పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ వాస్తవ విరుద్ధంగా కూడా వుంది. బ్రహ్మదేవ్ తో సహా అరుగురుబాధితులపై ఆయుధాల చట్టంతో సహా అనేక సెక్షన్ల కింద కేసు పెట్టారు.

బ్రహ్మదేవ్ సింగ్ భార్య జిరామణి దేవి తన భర్తను భద్రతా బలగాలు హత్య చేయడంపై 2021 అక్టోబర్ లో లతేహర్ జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత, నవంబర్ 20న, జిరామణి ఈ క్రింది డిమాండ్ లతో జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

1) కేసు స్వతంత్ర దర్యాప్తు కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేయాలి.

2) తక్షణమే FIR నమోదు చేయమని లతేహర్ ప్రధాన మేజిస్ట్రేట్‌ను ఆదేశించాలి.

3) దరఖాస్తుదారునికి, సాక్షులకు భద్రత కల్పించాలి.

4) తక్షణమే రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి.

జార్ఖండ్ జనాధికర్ మహాసభ ప్రతినిధి బృందం జూన్ 17న గ్రామస్తులను, బాధిత కుటుంబాన్ని కలుసుకుని, ఘటన గురించి సమాచారాన్ని సేకరించి, పోలీసుల అణచివేత విధానం వల్లే బ్రహ్మదేవ్ సింగ్ హత్యకు గురయ్యాడని, అతని ఇంటికి కొంత దూరంలో బ్రహ్మదేవ్ ని పోలీసులు చంపి, ఎన్‌కౌంటర్ గా చిత్రించడానికి, మృతదేహాన్ని కర్రకు వేలాడదీసి అడవి వైపుకు తీసుకువెళ్లారు అని నిజ నిర్ధారణ నివేదికలో తెలియచేసింది.

అఖిల జార్ఖండ్ ఖర్వార్ ట్రైబల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కేంద్ర ప్రధాన కార్యదర్శి లాల్మోహన్ సింగ్, జూలై 13న జిరామణి దేవి దరఖాస్తుపై తీసుకున్న చర్య గురించి సమాచార హక్కు చట్టం కింద గారు పోలీస్ స్టేషన్ నుండి సమాచారం కోరారు.

రెండవ అప్పీలు తర్వాత, అక్టోబర్ 11న, గారు పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి RTI ప్రత్యుత్తరంలో, విచారణ చేసి, అవసరమైన చర్య తీసుకోవడం కోసం జిరామణి దేవి దరఖాస్తును బర్వాడీ జోన్ పోలీసు సూపరింటెండెంట్‌కు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే బాధ్యత గారు పోలీస్ స్టేషన్‌పై ఉంది కానీ కేసు పరిశోధకుడిది కాదని గమనించాలి. పోలీసుల న్యాయంగా వ్యవహరించడం లేదని, దోషులైన భద్రతా దళాలను రక్షిస్తోందనీ స్పష్టమవుతోంది.

ప్రతిస్పందనగా, సత్య దూరమైన ఎన్‌కౌంటర్ కథని మళ్ళీ ప్రస్తావించారు. తప్పుడు కథనాన్ని రూపొందించడానికి పోలీసుల ప్రయత్నాలు బట్టబయలు అవుతూనే ఉన్నాయి. ఒకవైపు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో బ్రహ్మదేవ్ సింగ్ మరణించిన విషయాన్ని కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు. ఎన్‌కౌంటర్ జరిగాక వెతికినప్పుడు అడవి వైపు బ్రహ్మదేవ్ మృతదేహం దొరికిందని రాశారు. మరోవైపు, పోలీసు ఎన్‌కౌంటర్‌లో బ్రహ్మదేవ్ సింగ్ మరణించాడని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. నిజాన్ని దాచేందుకు పోలీసులు రకరకాల కథనాలు అల్లుతున్నారు.

అఖిల జార్ఖండ్ ఖర్వార్ గిరిజన వికాస్ పరిషత్ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి లేఖ పంపింది, కానీ ఏమీ జరగలేదు.

జార్ఖండ్ జనాధికార్ మహాసభ అనే ప్రజా సంఘం ఈ విషయంపై సవివరమైన నిజనిర్ధారణ చేసి నిరంతరం న్యాయం కోసం పోరాడింది. గ్రామస్తులు, మహాసభలు గత ఏడాది కాలంలో పోలీసు సూపరింటెండెంట్ నుండి ముఖ్యమంత్రికి అనేకసార్లు విజ్ఞప్తి చేశాయి, దీనికి వ్యతిరేకంగా అనేక ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, బాధితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయొద్దని స్థానిక పోలీసులు పలుమార్లు గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై జిరామణి దేవి స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు జార్ఖండ్ హైకోర్టులో కేసు కూడా నమోదైంది. జార్ఖండ్ పీయూసీఎల్ న్యాయ పోరాటానికి సహకరించింది.

ఈ సందర్భంలో, ఆదివాసీల మానవ హక్కుల ఉల్లంఘనలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వున్న నిబద్ధతపై PUCL తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఒక ఆదివాసీ మహిళ తన భర్త హత్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరంతర పోరాటాల తర్వాత కూడా ఒక సంవత్సరం పట్టిందంటే, అది పరిపాలనా పర క్రూరత్వం తెలుస్తోంది. ఇప్పటి వరకు వారికి ఎలాంటి పరిహారం అందలేదు.

పై ఘటనలపై, బ్రహ్మదేవ్ సింగ్, హత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌పై సకాలంలో, న్యాయమైన చర్య తీసుకోవాలని, హత్యకు కారణమైన భద్రతా బలగాలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని జనసంఘటన్ జార్ఖండ్ జనాధికార మహాసభ, ఖార్వార్ తెగల సామాజిక సంస్థ, అఖిల్ జార్ఖండ్ ఖార్వార్ ఆదివాసీ అభివృద్ధి పరిషత్ డిమాండ్ చేశాయి.

బ్రహ్మదేవ్ సహా ఆరుగురు ఆదివాసీలపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.

బ్రహ్మదేవ్ భార్యకు కనీసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, వారి కుమారుడి పోషణ, చదువు, ఉద్యోగానికి సంబంధించిన పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలాగే మిగిలిన ఐదుగురు బాధితులకు పోలీసుల వేధింపులకు పరిహారం చెల్లించాలి.

2022 ఫిబ్రవరి 23న, అదే ప్రాంతానికి చెందిన ఆదివాసీ అనిల్ సింగ్‌ను మావోయిస్టులకు సహాయం చేశాడనే ఆరోపణపై మూడు రోజుల పాటు అక్రమంగా పోలీస్ స్టేషన్‌లో ఉంచి అమానవీయంగా శారీరకంగా, మానసికంగా హింసించారు. ఘటన జరిగి మూడు నెలలు గడుస్తున్నా, అనిల్ దరఖాస్తుపై, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

అనిల్ సింగ్ (కుకు గ్రామం, బర్వాదిహ్ బ్లాక్, లతేహర్)పై కస్టడీ హింసకు పాల్పడిన పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలి, అనిల్‌కు పరిహారం చెల్లించాలి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ల ముసుగులో భద్రతా దళాలు ప్రజలను వేధించకూడదు.

వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టడం పూర్తిగా ఆపాలి. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని స్థానిక పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఉండాలి.

ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఏ గ్రామ పరిధిలోనైనా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించే ముందు గ్రామసభ, సాంప్రదాయ గ్రామపెద్దల సమ్మతి తీసుకోవాలి.

స్థానిక పోలీసులు, భద్రతా దళాలకు ఆదివాసీ భాష, ఆచారాలు, సంస్కృతి, జీవిత విలువల గురించి శిక్షణనివ్వాలి, అవగాహన కల్పించాలి.

(janchowk.com సౌజన్యంతో...)

తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : jharkhand, police, brahmadev, CRPF, fake encounter
(2022-12-03 04:32:49)



No. of visitors : 484

Suggested Posts


వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌, లతేహర్ జిల్లాలోని గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకూ-పిరీ అడవిలో వేట కోసం వెళ్ళిన‌ ఆదివాసీ యువకుల పై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిరి నివాసి 23 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు, అదే గ్రామానికి చెందిన దీనానాథ్ సింగ్ గాయపడ్డాడు.

అవును నేను మావోయిస్టునే..!

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి.

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు రవి అమరత్వం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం.

ʹమావోయిస్టు నాయకులను జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారుʹ

సీనియర్ మావోయిస్టు నాయకులు ప్రశాంత్ బోస్ @ కిష‌న్ దా, అతని సహచరి షీలా మరాండీలమి జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు....

demanding the immediate release of Damodar Turi

We strongly condemn the unlawful arrest of Damodar Turi (Central Convenor Committee member of Visthapan Virodhi Jan Vikas Andolan) by Jharakhand Police on 15 February 2018. And demand for immediate release for him.

Search Engine

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
more..


బ్రహ్మదేవ్