ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ఆ

12-06-2022

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది. ఆమె సూటిగా నా కళ్లలోకి చూసి అడిగింది కానీ నిజానికా చూపులు నన్ను దాటి ఎక్కడో ఆవలి లోకాల్లో తన కడుపుపంటను వెతుక్కుంటున్నట్లుగా ఉన్నాయి.

వర్గసమాజం, వర్గపోరాటాలు ఆరంభమైనకాలం నుంచి ఎంతమంది తల్లులు ఇటువంటి ప్రశ్నలు వేసారో. రాజవంశపు తల్లి కనుక ఒక్క సుభద్ర ప్రశ్న మాత్రం మహాభారతంలో మనకు కావ్యస్థమయింది.

ఆ తండ్రినీ అప్పుడే చూసాను మొదటిసారి జూన్‌ 13న. ఆ ఇద్దరినీ తీసుకవచ్చిన మిత్రుడు నిర్ధారణగా చెప్పినట్లులేదు. అది సాధ్యమయ్యేపని కూడ కాదు. ʹఎన్‌కౌంటర్‌ʹ అయిందంటే తమ వాళ్లేనేమో అని ఆందోళన చెందే తలిదండ్రులకు, సహచరులకు, రక్తబంధువులకు తమవాళ్లు ఉన్నారని ఊహించే ప్రాంతాల్లో జరిగినపుడు అది ఉత్కంఠతోకూడిన ఆందోళన అవుతుంది. వార్తల్లోనూ, ఫోటోల్లోనూ కీడెంచి మేలెంచమన్నట్లు తమ వాళ్ల పోలికలు వెతుక్కుంటుంటారు. అయితే ఈ తలిదండ్రులు తమ కొడుకువిషయంలో ఇంత త్వరగా ఈ పిడుగుపాటు వార్త వినాల్సివస్తుందని ఊహించి ఉండరు. తమ కొడుకు ఎక్కడో ఉద్యమానికి సంబంధించిన సాంకేతిక జ్ఞాన సంబంధమైన పనిలో ఉండి ఉంటాడని ఊహించుకుంటూ ఉంటారనుకుంటాను. అతని సహచరులు అట్లాగే ఊహించి చెప్పి ఉంటారు. అయినా ఎక్కడున్నా విప్లవోద్యమాన్ని అంత కంఠదగ్నంగా ఎంచుకున్న మనిషి అసమ సమాజంలో అసహజ మరణం పొందడం ` వార్త తెలియగానే కలిగే షాక్‌ నుంచి తేరుకుని ఆలోచిస్తే ఇవ్వాళ కాకపోతే రేపు జరిగేదే అనిపిస్తుంది. మనకు తెలిసిన మనిషయినపుడు, మరింత సన్నిహితంగా తెలిసిన మనిషయినపుడు తేరుకోవడం కష్టమనిపిస్తుంది కానీ ఈ యుద్ధవాతావరణంలో, సరిగ్గా యుద్ధరంగంలో సరిహద్దుల్లో సాయుధంగా నిలిచిన మనిషికి విజయమో, అమరత్వమో.
ఆ తల్లి కూడ తెలిసిన వెంటనే కలిగిన షాక్‌ నుంచి అట్లా అడిగిందిగానీ ఆ తర్వాత ʹనా కళ్లముందు తిరుగుతూ ప్రజా ఉద్యమాల్లో పనిచేయాలని ఆశపడ్డానుʹ అన్నది. అంతకన్నా ఆయన ఆశయ ఔన్నత్యాన్ని గుర్తించింది. ʹపోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపితేనే అతని ఆత్మకు శాంతిʹ అన్నది. ఆత్మవంటి ఆధ్యాత్మికమాట వాడి ఉండవచ్చుగానీ ఆమె ఆయన ఎందుకు విప్లవోద్యమంలోకి వెళ్లాడో సరిగానే గుర్తించింది. ఆ తలిదండ్రులు ఇద్దరూ కాలం గడుస్తుంటే అతనంత చైతన్యస్థాయికి ఎదగలేకపోయాం అనే ఒక గ్రహింపుతో కూడిన ఆవేదనలోకి వెళ్లిపోతున్నారు. బాధ ఉండదా, నేనే ఇవ్వాటికీ ఇంకా మామూలు మనిషిని కాలేకపోతున్నానే
`
1986 మే 20న హనుమకొండ హంటర్‌రోడ్‌ మీద ఇద్దరు విద్యార్థులను పోలీసులు కాల్చిచంపారు. ఎవరో ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఆ ఇద్దరినీ వారి స్థావరం నుంచి ఎత్తుకొచ్చి చిత్రహింసలు పెట్టి చంపి ʹఎన్‌కౌంటర్‌ʹ ప్రకటించారు. ఉద్యమంలోని విద్యార్థులను, ప్రజలను భయభీతావహులను చేయడానికి వాళ్ల శవాలను ఆ రోడ్డుపై పడేసారు. అది జిల్లా న్యాయస్థానం ముందర, జిల్లాపరిషత్‌కు, పోస్టాఫీసుకు పక్కన పోతన విగ్రహం నుంచి వరంగల్‌కు కాజీపేట నుంచి వెళ్లే దగ్గరి రహదారి. ఆ ఇద్దరూ విద్యార్థిరంగం నుంచి వచ్చి జిల్లాకమిటీ ప్రత్యామ్నాయ సభ్యుడైన రామకృష్ణ, ఆర్‌ఎస్‌యు ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు. రామకృష్ణ పాలిటెక్నిక్‌ చదువుతూ రాడికల్‌విద్యార్థి ఉద్యమంనుంచి విప్లవంలోకి వచ్చాడు. వరంగల్‌జిల్లా నెల్లికుదురు మండలం గుర్తూరు. నాగేశ్వరరావు సికెఎం కాలెజిలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిగా ఆర్‌ఎస్‌యులోకి వచ్చి బిఎస్సీ పూర్తయ్యేనాటికి కళాశాల విద్యార్థిసంఘం కార్యదర్శి ఆయ్యాడు. ఆర్‌ఎస్‌యు రాష్ట్ర నాయకుడయ్యాడు. అతని తలిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతే అదే కాలెజిలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అన్నదగ్గర ఉండి చదువుకుంటున్నాడు. నర్సంపేట దగ్గర ఖానాపురం, శాఖమూరి అప్పారావు ఊరు. శాఖమూరి అప్పారావు ఇతని ప్రభావంతోనే హనుమకొండ ఐటిఐలో చదివేప్పుడు ఆర్‌ఎస్‌యులోకి వచ్చి తర్వాత క్రమంగా విప్లవోద్యమ నాయకత్వంలోకి వచ్చాడు.
వరంగల్‌ ఎంజిఎంలో పోస్ట్‌మార్టమ్‌ అయ్యాక నాగేశ్వరరావు మృతదేహాన్ని అన్న తీసుకవెళ్లి అంత్యక్రియలు చేసాడు. రామకృష్ణ తండ్రి ఆర్‌టిసిలో ఉద్యోగి. కొడుకు గురించి అప్పటికే చాలసార్లు నిర్బంధాలకు, చిత్రహింసలకు గురయ్యాడు. పైగా ఆట, మాట, పాట బందయి టాడా అమలవుతూ ఉన్న గడ్డుకాలం. అందులోనూ డాక్టర్‌ రామనాథం హత్య తర్వాత వరంగల్‌ ఒక లాటిన్‌ అమెరికన్‌ నగరం వలె భీభత్స నిశ్శబ్దంలో ఉన్నది. కనుక వాళ్లు రామకృష్ణ మృతదేహాన్ని ఇంటికి కూడ తీసుకపోలేకపోయారు. నేనప్పటికే ఐదునెలలుగా జైలులో ఉన్నాను. నాగేశ్వరరావు ఐదేళ్లు ప్రత్యక్షంగా నా విద్యార్థి. రామకృష్ణ వరంగల్‌ విద్యార్థి ఉద్యమంలో తలలో నాలుక.
ఆ ఎన్‌కౌంటర్‌ వార్త విని, పత్రికల్లో చదివి జైల్లో ʹఆ తల్లిముందు దోసిళ్లతో....ʹ అని రాసుకున్నాను.
ఆ తల్లిని నేను చూడలేదు
కాని ఆ చూపుడువేలు నన్ను వేలెత్తి చూపుతున్నది
కొన్నిచోట్ల ఆ పిల్లల్నీ నేను చూడలేదు
ఆ తల్లి కన్నీళ్లు మాత్రం నన్ను వెన్నాడుతున్నాయి
ఆమె ఒడిలోంచి రాలిపోయిన పువ్వుల్ని
వికసించీ వికసించని రేకుల చూపుల్ని
చెరగని చిరునవ్వుల పరాగాన్ని
ఏ మట్టిలో ఏరుకొమ్మనను ఆ తల్లిని
ఆ గుండ్లకు ఎదురొడ్డిన గుండెలు
ఆమె కడుపుపంట అనీ
ఆ మట్టిలో చిందిన నెత్తురు
ఆ తల్లి పాలేనని
వాస్తవాన్ని ఏ పంటికింద నొక్కి చెప్పనూ
దు:ఖాన్ని ఏ కంటిలో దాచి చెప్పనూ
ఇంకా ఆకృతి పొందకముందే
ఆ పిండం ఆకలి ఆమె తీర్చింది
ఊపిరి ఆమె పోసింది
తన కలల రూపాన్ని ఇచ్చింది
ఆ శిశువు తొలికేకను
లోకంలో ఆమె మొదలు విన్నది
ఇవ్వాళ ఏ అజ్ఞాతంలో ఆ శిశువు
ఆఖరి ఆక్రందన చేసిందో
ఆ తల్లి పురిటినొప్పుల బాధ
అర్థమయితే తప్ప
ఇవ్వాళ
ఆ తల్లి ఆక్రోశమూ అర్థంకాదు
ఆ అమాయకమైన తల్లికి
తల్లికోసమే పిల్లలు అసువులు విడిచారనీ
ప్రాణంపోసిన తల్లికోసమే
ప్రాణాలిచ్చారనీ చెప్పనా
ఇంకా పిల్లల్ని ఇవ్వమని
దోసిలి చాచానని చెప్పనా
ఆ తల్లి చూపుడువేలు ముందు
అవనతవదనంతో నిలబడి
అడగనా ఎడతెగని త్యాగాలను!

- వి వి
24.06.2015

Keywords : vivek, varavararao, maoists, telangana, police, fake encounter
(2024-04-24 10:52:43)



No. of visitors : 2202

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆ