ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ

ఆదివాసీల‌

06-08-2022

మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల పేరుతో బస్తర్‌లోని ఆదివాసీల రోజూ జరుగుతున్న తీవ్ర అన్యాయాలకు ప్రతీక బుర్కాపాల్ కేసు. అణచివేతకు ఒక ఉపాయం. 2017, 24 ఏప్రిల్ న జరిగిన బుర్కాపాల్ ఘటనలో మావోయిస్టులతో ఎన్‌కౌంటర్‌లో 25 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు మరణించారు, ఏడుగురు గాయపడ్డారు. నెల రోజుల తరువాత 120 మంది ఆదివాసీలను - వీరిలో ముగ్గురు మైనర్‌లు, మిగతావారంతా 20 లేదా 30 ఏళ్లలోపు యువకులు - అరెస్టు చేసారు. ఒక మహిళ ʹనక్సలైట్ʹ తో కలిపి మొత్తం అరెస్టయిన నిందితుల సంఖ్య 121కి చేరుకుంది. ఛార్జ్ షీట్‌లో 119 మంది పేర్లు, ఇతర నిందితులు 100-150 మంది ʹగుర్తు తెలియని మావోయిస్టులుʹ పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, 2021 ప్రారంభంలో జగదల్‌పూర్‌లోని కొత్తగా నియమించబడిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ)కోర్టులో కేసును విన్నాక 2021 ఆగస్టులో విచారణ ప్రారంభమైంది. అప్పటి నుండి 2022 జూన్ 28 వరకు ఇరవై ఆరు మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించాక, నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ 2022 జూలై 15న తీర్పు వెలువడింది.

అప్పటికి వారు కటకటాల వెనుక ఐదేళ్లు గడిపారు. ప్రతి విచారణలోనూ నిందితుడిని వ్యక్తిగతంగా హాజరుపరచడం తప్పనిసరి అయినప్పటికీ, వారిని రెండుసార్లు మాత్రమే, ఆరోపణలను రూపొందించేటప్పుడు, నిర్ధారణ కోసం కోర్టుకు తీసుకువెళ్లారు. దేశంలోనే, జమ్మూ- కాశ్మీర్ తర్వాత, బస్తర్ అత్యంత మిలటరీ జోన్ అయినప్పటికీ, నిందితులను కోర్టుకు తీసుకు వెళ్లడానికి తగినంత పోలీసు సిబ్బంది లేకపోవడాన్ని కారణంగా చూపారు.

2019 నవంబరు వరకు అభియోగాలు మోపే కోర్టు ప్రక్రియ ప్రారంభమైన వారిని బ్యాచ్‌ల వారీగా కోర్టుకు తీసుకురావడానికి జగదల్‌పూర్‌లోని NIA కోర్టు న్యాయమూర్తి అంగీకరించలేదు. 2020లో చాలా వరకు కోర్టుల్లో పని ఆగిపోయింది, కోవిడ్-19 పరిమితుల కారణంగా జైలులో ఉన్నవారిని కుటుంబాలు కలవలేకపోయాయి. నిందితుల్లో ఒకరైన 46 ఏళ్ల డోడి మంగ్లూ 2021అక్టోబర్ లో జైలులో మరణించారు. జిల్లా స్థాయిలో NIA కోర్టులో, హైకోర్టులో కూడా బెయిల్ నిరాకరణ వల్ల వారికి ఐదేళ్లపాటు ఎలాంటి ఉపశమనం లేకుండా పోయింది.

ఈ కేసులో పోలీసుల విచారణ చాలా నాసిరకంగా జరిగింది. ఉదాహరణకు, గాయపడిన ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లను సాక్షులుగా చేయలేదు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, సుక్మా జిల్లాలోని బుర్కపాల్, ఆ చుట్టుపక్కల గ్రామాలతో పాటు బీజాపూర్ జిల్లాలోని కొన్ని గ్రామాల నుండి, చాలా మందిని ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఈ 120 మంది ఆదివాసీలను అరెస్టు చేసి తీసుకెళ్ళారు. మావోయిస్టుల ఆకస్మిక దాడి, పేలుడు లేదా ఇతర ఘటనల తర్వాత స్థానిక నివాసితులను ఇలా చుట్టుముట్టడం బస్తర్‌లో ఒక సాధారణ వ్యవహారం.

మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల పేరుతో బస్తర్ ఆదివాసీలమీద అనుదినం జరుగుతున్న తీవ్ర అన్యాయాలకు బుర్కపాల్ కేసు ఒక ప్రతీక. నాకు తెలిసినంతవరకు, ఈ కేసులో ఇప్పటివరకు దేశంలోని ఇతర కేసుల కంటే క్రూరమైన UAPA కింద ఎక్కువ సంఖ్యలో నిందితులు ఉన్నారు.

UAPA కింద అభియోగాలు మోపబడిన ఒకే NIA కేసులో 121 మంది నిందితులనేది నాటకీయంగా ఉన్నప్పటికీ, తక్కువ సంఖ్యలో నిందితులు వున్న అలాంటి కేసులు 200-275 పరిష్కృతమయ్యాయి. 154 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ప్రస్తుతం, 3,000 మంది విచారణా ఖైదీలు, అందులో చాలా మంది UAPA, CSPSA, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం, IPC ల కఠినమైన సెక్షన్‌ల కింద, జగదల్‌పూర్‌లోని సెంట్రల్ జైలు, బస్తర్ డివిజన్‌లోని జిల్లా జైళ్లలో (దంతెవాడ, కాంకేర్‌), సబ్ జైళ్లలో (బీజాపూర్, సుక్మా, నారాయణపూర్) ఉన్నారు. సాధారణంగా కేసులు ఏ సరియైన కారణం లేకుండా సంవత్సరాల పాటు సాగుతాయి; ఉదాహరణకు, తరచుగా ఫిర్యాదుదారులు, దర్యాప్తు అధికారులు, సాక్షులుగా ఉన్న పోలీసులు, భద్రతా దళాలు కోర్టుకు హాజరు కావు.

దీంతో నిందితుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వారు తరచూ న్యాయస్థానాలకు, జైళ్లకు సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు రానూ పోనూ ప్రయాణానికి చాలా రోజులు పడుతుంది, దారిలో ఉండడానికి స్థలం దొరకదు, ఆహారం కోసం డబ్బులు ఉండవు. చాలా మంది గోండులు హిందీ మాట్లాడలేరు లేదా అర్థం చేసుకోలేరు. గోండియేతర భాష మాట్లాడే న్యాయవాదులతో విషయం తెలియచేయడానికి నగరంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. న్యాయవాదులు కోర్టు విధానాలను వివరించడానికి సమయం తీసుకోకపోవచ్చు కాబట్టి కోర్టులో ఏమి జరుగుతుందో, ఆలస్యం అవడానికి కారణాలు ఏమిటో వారికి తెలియదు. కోర్టుకు సంబంధించిన అన్ని ఖర్చులను భరించడానికి తరచుగా వారు తమ పశువులను లేదా ఇతర కొద్దిపాటి వస్తువులను అమ్ముకోవాల్సి ఉంటుంది.

పెద్ద సంఖ్యలో నిందితులు ఉన్న బుర్కపాల్ వంటి కేసు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి ఆకర్షణీయమైన ప్రతిపాదన. ప్రత్యేకించి బెయిల్ దరఖాస్తు వంటి సాధారణ సేవల కోసం న్యాయవాదులు విపరీతంగా ఫీజు వసూలు చేస్తారు. బుర్కపాల్ కేసులో, వివిధ న్యాయవాదులు-ఆదివాసీయేతర, ఆదివాసీ న్యాయవాదులు- వేర్వేరు సమయాల్లో కేసును చేసినప్పుడు, వారికి చాలా కుటుంబాలు అనేకసార్లు డబ్బు చెల్లించాల్సి వచ్చింది.

న్యాయ వ్యవస్థలో అలవాటుగా మారిన పనితీరు జవాబుదారీతనంతో కాకుండా యధేచ్ఛగా జరుగుతుంది. ఒక న్యాయవాది, అతను లేదా ఆమె ఎలాంటి నియమాలు, పారదర్శకత, మనోభావాలలాంటి వాటిని పట్టించుకోకుండా తాను అనుకున్నట్లు చేయవచ్చు. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే బస్తర్‌లోని కోర్టులు బాధ్యతారాహిత్యం, అవినీతిలకు నిలయంగా ఉన్నాయి. నిజాయితీగల న్యాయవాది లేదా కోర్టు కార్యకర్తలకు, ఈ వాతావరణం దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహలను కలిగిస్తుంది.

బుర్కపాల్ కేసు అనేక సంబంధిత ప్రశ్నలను లేవనెత్తుతుంది: మావోయిస్టులపై పోరాటంలో సాధారణ గ్రామస్తులను బలిపశువుగా చేయడానికి రాష్ట్ర పోలీసులు కూడా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపించాలా? అటువంటి అన్యాయమైన శిక్ష వారిని పోలీసులు, రాజ్యానికి వ్యతిరేకంగా మావోయిస్టులతో కలిసి యుద్ధం చేసేలా చేస్తుందా లేక కలగబోయే మావోయిస్టుల ప్రభావం నుండి దూరం చేస్తుందా?

నిర్దోషులుగా విడుదలైన తర్వాత, తమ ఇళ్లకు తిరిగి వెళ్లి, ఛిద్రమైన తమ జీవితాలను కూడగట్టుకొని ʹసాధారణంగాʹ జీవించడానికి ప్రయత్నిస్తారు. జైలులో గడిపిన సమయం, కోల్పోయిన సంపాదన లేదా కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రులు, యువతులైన భార్యలు పిల్లలపై జరిగే ఇతర పరిణామాలకు పరిహారం చెల్లించే ప్యాకేజీ ప్రభుత్వం దగ్గర లేదు. కొన్ని సందర్భాల్లో, తాము లేని సమయంలో కుటుంబంలో లేదా సముదాయంలో సంభవించిన అనారోగ్యం, మరణాల్ని కూడా భరించాల్సి వస్తుంది. వారి స్వీయ మానసిక స్థితి కూడా ప్రభావితమై ఉండవచ్చు.

ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ʹనిర్దోషులైన ఆదివాసీలʹ (అమాయక ఆదివాసీల) విడుదలకు హామీ ఇచ్చింది. అయితే ఇందు కోసం ఏర్పాటైన జస్టిస్ పట్నాయక్ కమిటీ చేసిన ప్రయత్నాల్లో, ఇటువంటి ʹనక్సలైట్ʹ కేసుల్లో చిక్కుకున్న ఆదివాసీలను చేర్చలేదు. బస్తర్‌లో ఈనాడు కటకటాల వెనుక ఉన్న చాలా మంది ఆదివాసీలు కూడా ఇలాంటి పరిస్థితులలో అరెస్టయినవారే కాబట్టి తక్షణం అలా చేయవలసిన అవసరాన్ని బుర్కపాల్ కేసు నొక్కి చెబుతోంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల నివాసితులపై ఈ అన్యాయమైన దాడులు అంతం కావాలి. వ్యక్తులను ఏకపక్షంగా అరెస్టు చేయడం, వారిపై తప్పుడు కేసులు, కొన్నిసార్లు పూర్తిగా కల్పిత కేసులు పెట్టడం నేరం.

‍ -బేలా భాటియా -ఆదివాసీల తరఫున వాదించిన న్యాయవాది

(తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)

Keywords : chattis garh, bastar, bijapur, adivasi, belabhatia, maoists
(2024-07-14 10:59:11)No. of visitors : 1541

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆదివాసీల‌