సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌


సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

సెప్టెంబర్

16-09-2022

సెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ విముక్తి దినంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం , జాతీయ సమైక్యతా దినంగా టీఆరెస్ ప్రభుత్వం జరుపుతున్న‌ నేపథ్యంలో ఆ రోజును చీకటి రోజుగా ప్రకటించింది మావోయిస్టు పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

ʹవిముక్తిʹ కాదు, ʹసమైక్యతʹ కాదు

సెప్టెంబర్ 17వ తేదీని ʹచీకటి రోజుʹగా పాటిద్దాం

పాలక వర్గాలు చెప్పిందే చరిత్ర. టీఆర్ఎస్, భాజపా, ఇతర పాలక వర్గాలు తెలంగాణా సాయుధ పోరాట చరిత్రను, సారాన్ని దుర్వినియోగం చేయడంలో, వక్రీకరించడంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఫాసిస్టు భాజపా సెప్టెంబర్ 17వ తేదీన ʹవిముక్తి దినంʹ పాటించాలని నిర్ణయించింది. పాలక టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ʹజాతీయ సమైక్యతా దినంʹగా పాటించాలని ప్రకటించింది. ఈ ఎత్తుగడలు చరిత్రను వక్రీకరించడమే. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ దోపిడీ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం ఉద్దేశించినవే. ఇవి నైజాం పాలనకు అద్దం పడతాయి. శతాబ్ద కాలపు దోపిడీకి వ్యతిరేకంగా రైతాంగం, ఇతర పీడిత ప్రజలూ చేసిన తిరుగుబాటు చరిత్రాత్మక తెలంగాణా సాయుధ పోరాటం. భూస్వామ్యానికి, రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇది.

నైజాం పాలనలో రైతాంగం బలవంతపు శ్రమ చేయవలసి వచ్చేది. పశువుల్లా, నైజాంకు, దేశ్ ముఖ్ లు,
జాగీర్దారులు, మత్తేదారులు, షావుకార్లకు బానిసల్లా జీవించేవారు. రైతాంగ మహిళల జీవితాలకు ఏ రకమైన గౌరవం ఉండేది కాదు. భూస్వాముల చేతుల్లో చావుకు కూడా గురి అయ్యేవారు. రైతాంగం వెన్ను విరిచే వెట్టి వంటి భూస్వామ్య పన్నులు ఉండేవి. ఎక్కడైతే అన్యాయం రాజ్యం ఏలుతుందో న్యాయం ఒక్క గొంతు నుంచి కాదు, వేలాది, లక్షలాది గొంతుల నుంచి ఎగుస్తుంది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగిన తెలంగాణా సాయుధ పోరాటం ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఎగిసిన గొంతు. మూడు వేల గ్రామాలు విముక్తమయ్యాయి, లక్షలాది ఎకరాల భూమిని భూమి లేని రైతులకు పంపిణీ చేసారు. భారత రాజ్యాంగం లాంఛనప్రాయంగా నిషేధించక ముందే వెట్టిని నిర్మూలించారు, అంటరానితనాన్ని నిర్మూలించారు.
మనిషి మనిషి పై చేసే దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన ఈ రైతాంగ ఉద్యమం భవిష్యత్తు నూతన మానవుని, సాధారణ ప్రజల పట్ల దోపిడీ, అన్యాయాలకు తావు లేని నూతన సమాజ నిర్మాణానికి హామీనిచ్చింది. ఇది భారతదేశపు ఒక వెలుగు రేఖ. ప్రజలు ఎన్నుకున్నది కాక బ్రిటిషు సామ్రాజ్యవాద నిర్దేశంతో ఏర్పడిన రాజ్యాంగ సభలో భారతదేశానికి ఉండవలసిన మౌలిక హక్కులు, విధుల గురించిన వాదోపవాదాలు, చర్చలలో పాలక వర్గాలు మునిగిపోయి ఉన్నాయి. ఆ సమయంలో నెహ్రు, సర్దార్ పటేలు ఉద్యమాన్ని అణచివేయడానికి నైజాంకు ఆయుధాలు, సైనిక సహాయం అందించారు. భారత సైన్యం, రజాకార్లు వేలాది మంది రైతులను హత్య గావించారు. వారి మౌలిక హక్కులన్నీ గాలిలో కలిసిపోయాయి. పాలక వర్గాల భారత సైన్యం వేలాది మంది మహిళలను అత్యాచారం చేసింది, హింసించింది. భారతదేశం గణతంత్ర రాజ్యం అయ్యింది.

విప్లవ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేసేందుకు ʹఆపరేషన్ పోలోʹ పేరుతో నెహ్రు-పటేల్ ప్రభుత్వం ఈ ఫాసిస్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1948 సెప్టెంబర్ లో భారత సైన్యం తెలంగాణకు వచ్చింది. మూడేళ్ల పాటు తెలంగాణా రైతాంగాన్ని, సాధారణ ప్రజలనూ ఊచకోత కోసింది. ఇవాళ ఫాసిస్టు భాజపా ఈ ఊచకోతను తెలంగాణా ʹవిముక్తిʹగా పేర్కొనడం చరిత్రను మతోన్మాదీకరించడమే. దీన్నే టీఆర్ఎస్ ʹజాతీయ సమైక్యతʹ అంటున్నది. సీపీఐ, సీపీఎంలు కూడా టీఆర్ఎస్ తో కుమ్మక్కై భాజపాను ఎదుర్కోవడం పేరుతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరపాలంటున్నాయి. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం అవకాశవాదానికి పాల్పడడం తప్ప మరొకటి కాదు.

చరిత్రను ఈ రకంగా వక్రీకరించడాన్ని ప్రతిఘటించవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణా రాష్ట్ర కమిటీ యావత్తు ప్రజాస్వామిక, విప్లవ, ప్రగతిశీల, యువ శక్తులకు పిలుపునిస్తున్నది. ఈ రకంగా మాత్రమే మనం మన చరిత్రను, మన పోరాటాన్ని, మన త్యాగాలను, మన ఉనికినీ తిరిగి పొందగలుగుతాం. దోపిడీ శృంఖలాలను బద్దలు కొట్టేందుకు తమ ప్రాణాలను బట్టిన సాహబ్ ఉల్లాహ్ ఖాన్, మౌల్వీ అల్లా వుద్దీన్, తుర్రే బాజ్ ఖాన్, జర్నలిస్టు షోయబుల్లాఖాన్, కొమురం భీం, దొడ్డి కొమురయ్య, బందగీ, ఐలమ్మలను చరిత్ర ఎన్నడూ మరిచిపోదు. చరిత్ర పునరావృతం అవుతుంది. కాబట్టే ఫాసిస్టులు చరిత్రకు భయపడతారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణా చరిత్రలో ʹచీకటి రోజుʹగా పాటించవలసిందిగా తెలంగాణా రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.

జగన్,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : CPI Maoist, Jagan, abhay, telangana, September17, Nizam, Telangana armed struggle,
(2023-11-28 08:16:25)No. of visitors : 2263

Suggested Posts


మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ

తెలంగాణలో విప్లవ కార్మిక వర్గం నాయకత్వంలో రైతాంగం, సంఘటిత, అసంఘటిత కార్మికులు, నిరుద్యోగులు ఐక్యమై మిలిటెంట్‌ ఉద్యమాలు చేపట్టాలని, సోషలిస్టు విప్లవ స్ఫూర్తితో మే డేను జరుపుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.

Search Engine

ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
more..


సెప్టెంబర్