కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ

కాక‌లు

విప్ల‌వ‌మే జీవితంగా బ‌తికిన ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తికి మావోయిస్టు పార్టీ విప్ల‌వ జోహార్ల‌ర్పించింది. మూర్తి స్మృతిలో మావోయిస్టు పార్టీ మధ్య రీజినల్ బ్యూరో విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠకుల కోసం...

కామ్రేడ్ ఎస్ ఎల్ ఎన్ మూర్తి 21వ తేదీ బుధవారం సాయంకాలం 7.15కు నిమ్స్ లో గొంతు క్యాన్సర్ వ్యాధికి నెల రోజులుగా చికిత్స పొందుతూ తన 73వ యేట‌ తుది శ్వాస విడిచాడు. ఆయన కాకలు తీరిన విప్లవ యోధుడు. 1971 నుండి 2009లో అరెస్టు అయ్యేంతవరకు విప్లవోద్యమంలో అలుపెరుగని సేవలందించిన గొప్ప యోధుడు. ఆ తరువాతి కాలంలో విప్లవోద్యమంపై అపార విశ్వాసంతో సహ ప్రయాణికుడిగా వుంటూ తుదివరకూ ఎంతో విలువైన విప్లవసేవలందిస్తూ వచ్చాడు. ఆ అమరవీరుడికి భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మధ్య రీజినల్ బ్యూరో వినమ్రంగా విప్లవ జోహార్లర్పిస్తున్నది. ఆయన ఆశయ‌ సాధనకై తుదివరకూ పోరాడుతామని ప్రతినబూనుతోంది.

కామ్రేడ్ ఎల్.ఎస్.ఎన్. మూర్తి పార్టీ శ్రేణులకు శరత్ గా, శీనన్నగా అత్యంత ఆదరనీయమైన కామ్రేడ్. ఆయన తెనాలి సమీపంలోని కఠెవరంలో జన్మించారు. వాళ్లది ముగ్గురు అన్నయ్యలు, నలుగురు అక్కయ్యలతో కూడిన పెద్ద కుటుంబం. వాళ్ల తాత బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వైస్రాయి ప్రయాణించే రైలు కింద బాంబుపెట్టి సాయుధంగా పోరాడిన వీరయోధుడు. వాళ్ల తండ్రి గాంధీ రాజకీయాలతో కాంగ్రెస్ దేశ స్వాతంత్య్రం కోసం నిస్వార్థంగా పోరాడాడు. తొలుత వారిది చాలా సంపన్న కుటుంబమే కానీ, దేశభక్తి కుటుంబం కావడంతో తమ సంపదంతా దేశ సేవలోనే హరించుకుపోవడంతో దిగువ మధ్య తరగతి కుటుంబంగా మారి పేదరికంతోనే జీవనం సాగింది. 1959లో తండ్రి మరణంతో ఆయన థర్డ్ ఫాం (8వ తరగతి) తరువాత తెనాలి నుండి గుంటూరుకు చేరి తన సోదరుడి వద్ద 11వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు. అక్కడే కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి సంఘం స్టుడెంట్ ఫెడరేషన్ లో చేరి చురుగ్గా పని చేయడం ప్రారంభించాడు. పిదప ఆంధ్ర క్రిష్టియన్ కాలేజీలో డిగ్రీ చదువు పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాదు చేరాడు. అక్కడే ఆయన తొలిసారి వియత్నాంపై అమెరికా సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నాడు.

డిఫెన్స్ అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం రావడంతో హైదరాబాదు నుండి కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి పుణే (మహారాష్ట్ర) చేరాడు. అక్కడ సోదర వుద్యోగులతో కలసి కమ్యూనిస్టు పార్టీతో పరిచయాలు ఏర్పడి రెండు రూపాయల రెండణాలు చెల్లించి అందులో సభ్యత్వం తీసుకున్నాడు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిజాం ఊచకోతతో అక్కడికి చేరి చేనేత కార్మికులుగా, బీడీ కార్మికులుగా భవానీ పేట, గంజిపేట బస్తీలలో వుంటూ జీవితాలు వెళ్లదీస్తున్న తెలుగు కుటుంబాల మధ్య పని చేయాల్సిందిగా పార్టీ బాధ్యతలు ఇచ్చింది. అక్కడే ఆయన కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన రాజకీయ తరగతులకు హజరై భావజాల, సైద్ధాంతిక విషయాలపై పట్టు సంపాదించాడు. సరిగ్గా అదే సమయంలో నక్సల్బరీ రైతాంగ పోరాటం బద్దలవడంతో కామ్రేడ్ మూర్తి అక్కడి సోదర వుద్యోగుల ప్రభావంతో తన ఆదర్శవాద స్వభావంతో రైతులపై పోలీసు కాల్పులను ఖండిస్తూ నక్సల్బరీ రాజకీయాలను నిర్ధ్వంద్వంగా సమర్థించి కమ్యూనిస్టు పార్టీతో తెగతెంపులు చేసుకున్నాడు. అప్పుడే, తనకు సోదర వుద్యోగులతో హైదరాబాదులో నక్సల్బరీ రాజకీయాల ప్రభావంతో వున్నకామ్రేడ్ కోటేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వార కామ్రేడ్ కొల్లిపర నర్సింహరావుతో పరిచయాలు ఏర్పడడం, కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్యతో పరిచయాలు ఆ క్రమంలో పార్టీ కోరడంతో పుణే నుండి హైదరాబాదుకు ఉద్యోగాన్ని బదిలీ చేసుకున్నాడు.

కామ్రేడ్ మూర్తి హైదరాబాదు చేరి సుభాష్ నగర్ లోని ఆఫీస్ లో పని చేస్తుండగా ఏర్పడిన విస్తృతమైన సంబంధాలలో భాగంగా కళాకారులు నర్సింగరావు, విఠల్ బాబు తదితరులతో పరిచయాలు ఏర్పడి పార్టీ మార్గదర్శకత్వంలో వారిని విప్లవోద్యమంవైపు మళ్లించి జననాట్యమండలికి పునాదులు వేశాడు. మరోవైపు కార్మిక రంగంలో ముఖ్యంగా కేంద్ర కార్మికుల మధ్య పని చేస్తూ వారిని సంఘటిత పరచసాగాడు.
అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తరువాత జరిగిన ప్రజాసంఘాల మహాసభల నిర్వహణలో రాష్ట్ర కమిటీ నుండి బాధ్యత తీసుకొని వాటిని సఫలం చేయడంలో ఎంతో కృషి చేశాడు. పార్టీ ప్రారంభించిన రాష్ట్ర అధికార పత్రిక క్రాంతి నిర్వహణ బాధ్యతలు స్వీకరించాడు. దానితో పాటు ప్రచురణల విభాగం కూడ చూడసాగాడు. పార్టీలో తలెత్తిన అంతర్గత పోరాటాలలో ఆయన సదా నిజమైన రాజకీయాల పక్షమే నిలిచాడు. ముఠా రాజకీయాలతో ముందుకు తెచ్చిన చీలికలను నిర్ధ్వంద్వంగా వ్యతిరేకించాడు.

కామ్రేడ్ మూర్తి పార్టీ అవసరాల రీత్యా 1998లో దండకారణ్యం వెళ్లాడు. అక్కడ ఆయన ప్రభాత్ పత్రిక నిర్వహణ బాధ్యతలలో నాలుగేళ్లు పాలు పంచుకున్నాడు. అక్కడ వుంటూనే ఆయన తన అనువాద పనులు కొనసాగించాడు. 2002-03లో దండకారణ్యం నుండి తిరిగి కేంద్ర కమిటీ అప్పగించిన పనులలోకి మారాడు. గతంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు)(పార్టీ యూనిటీ)తో పాటు యం.సీ.సీ.లతో పార్టీ కొనసాగించిన ఐక్యతా చర్చలలో కేంద్ర నాయకత్వం వెంట వుంటూ అనుభవం గడించిన రీత్యా తిరిగి 2002లో యం.సీ.సీ.ఐతో మొదలైన ఐక్యతా చర్చలలో పాలు పంచుకొని అవి పూర్తయి, ఐక్య పార్టీ ఏర్పడేవరకు తాను అనువాదకుడిగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2001లో సీపీఐ(యం.యల్)(పీపుల్స్ వార్), సీపీఐ (యం.యల్)(పార్టీ యూనిటీ) రెండు పార్టీల విలీనంతో జరిగిన కాంగ్రెస్ కు ప్రతినిధిగా హజరవడమే కాకుండా అవసరం మేరకు వేదికపైకి వెళ్లి ప్రతినిధుల అభిప్రాయాలను అనువాదాలు కూడ చేశాడు.

రెండు పార్టీల విలీనంతో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ నిర్వహించిన ఇంగ్లిష్ పత్రికకు సంపాదక మండలిలో సభ్యుడిగా వుంటూ తన వంతు పాత్ర తాను పోషించాడు. ఆ క్రమంలో పోలీసుల వలలో చిక్కి జైలు పాలయ్యాడు. అనేక తప్పుడు కేసులలో ఇరికించబడి రాజమండ్రి జైలులో నాలుగేళ్లకు పైగా గడపకతప్పలేదు. ఆ తరువాత ఆయన విడుదలై బహిరంగ జీవితంలో వుంటూ, అనివార్య పరిస్థితులలో సీ.ఆర్. ఫౌండేషన్ వారి వృద్ధాశ్రమంలో చేరినప్పటికీ ఆయన విప్లవ ప్రజాసంఘాలకు పెద్ద అండగా వుంటూ వచ్చాడు. పార్టీ కోరినపుడు వివిధ అంశాలపై సమాచారాన్ని అందిస్తూ తోడ్పడుతూ వచ్చాడు. పార్టీ ఎదుర్కొంటున్న నష్టాలు చూసి ఆయన ఎన్నడూ చలించలేదు. పార్టీలో అత్యున్నత స్థాయిలో వున్నవాళ్లు తమ బలహీనతలతో లొంగిపోయి సిద్ధాంత విభేదాలంటూ చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండించాడు. వారి లోపాలను నిర్ధ్వంద్వంగా బయటపెట్టాడు. ఏ దేశ విప్లవోద్యమంలోనైనా ఆటు-పోట్లు సర్వసాధారణమంటూ 1971 నాటి విప్లవోద్యమంతో పోలిస్తే 2020ల నాటికి పార్టీ సాధించిన అనేక విజయాలను ఎంతగానో ప్రశంసిస్తూ విప్లవ రాజకీయాల పట్ల, పార్టీ పంథా పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించేవాడు.

కామ్రేడ్ మూర్తి కాలేజీ రోజులలో నుండే అధ్యయనం పట్ల ఎంతో మక్కువ వున్నవాడు. ఇంట్లో వున్న సాహిత్యంతో పాటు ఏ కాస్తా సమయం చిక్కినా ఆయన కేరాఫ్ అడ్రస్ గ్రంథాలయంగానే వుండేది. ఆయనకు నాటకరంగం పట్ల ఎంతో ఆసక్తి వుండేది. ఆయన పార్టీ అవసరాల రీత్యా అనువాద బాధ్యతలు చేపట్టి మావో సంకలిత రచనలు మూడు నుండి ఐదు వరకున్న వాటిలో కొన్ని వ్యాసాలు అనువదించి ఆరు నుండి తొమ్మిది వరకు మావో సంకలిత రచనలు ఎంతో శ్రద్ధాసక్తులతో పూర్తి చేశాడు. వాటితో పాటు పార్టీ దస్తావేజులను కేడర్లకు సరళంగా అర్థం కావడానికి ఒక గ్లాసరీని తయారు చేసి అనువాదాలు చేసిన చేయితిరిగిన అనువాదకుడు ఆయన. ఆయన కామ్రేడ్ సునీతీ కుమార్ ఘోష్ వ్యవసాయంపై రాసిన పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాడు. పార్టీలో కేంద్ర కమిటీ స్టాఫ్ లో భాగంగా వుంటూ చాలా ముఖ్యమైన బాధ్యతలు ఎంతో నిజాయితీగా కొనసాగించిన రాష్ట్ర స్థాయి నాయకుడు కామ్రేడ్ ఎల్.ఎస్.ఎన్. మూర్తి.

నక్సల్బరీ తరానికి చెందిన ఒక కాకలుతీరిన యోధుడు ఈరోజు మన మధ్య భౌతికంగా లేడు. కానీ, ఆయన ఆశయాలు, ఆదర్శాలు, పనిశైలి, క్రమశిక్షణ ఒక మంచి కమ్యూనిస్టు లక్షణాలు మనకందించి వెళ్లిన గొప్ప విప్లవకారుడు మూర్తి. విప్లవ జీవితంలో మడిమ తిప్పకుండా ఎంతటి గడ్డు పరిస్థితులలోనైనా దృఢంగా విప్లవ రాజకీయాలతో వుంటూ తుదిశ్వాస విడిచిన వీరయోధుడికి వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు చెపుతూ ఆయన ఆశయాలను పరిపూర్తి చేద్దామనీ మధ్య రీజినల్ బ్యూరో ప్రతిన బూనుతోంది.

ప్ర‌తాప్‌


విప్లవాభివందనాలతో
అధికార ప్రతినిధి, మధ్య రిజినల్ బ్యూరో

Keywords : maoist party, sln murthy, statment
(2024-09-04 19:56:42)



No. of visitors : 1979

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కాక‌లు