పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌

పోలీసులు

12-01-2023

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు హిడ్మా పోలీసు ఎన్కౌంటర్ లో = చనిపోయినట్టు రెండు రోజులుగా సాగుతున్న ప్రచారం బూట‌కమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం...

పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దక్షిణ బస్తర్‌లో దిశానిర్దేశం చేసిన వైమానిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను!
బస్తర్ ప్రజలపై విధించిన యుద్ధానికి వ్యతిరేకంగా ఏకమై మీ గళం ఎత్తండి!

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసులు డ్రోన్‌లు, హెలికాప్టర్ల ద్వారా పమేడ్, కిస్టారం సరిహద్దు ప్రాంతాలైన మడ్కన్‌గూడ, మెట్టగూడ, బొట్టెటాంగ్, సకిలేర్, మడ్పాడులాడే, కన్నెమార్క, పొట్టేమంగం, బొత్తలంక, రాసపల్లి, ఎర్రపాడ్ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈరోజు ఉదయం 11 గంటలకు దక్షిణ బస్తర్‌లోని జంగిల్‌ కొండలపై వైమానిక బాంబు దాడి చేశారు. గత ఏడాది ఏప్రిల్ 15న కూడా ఈ ప్రాంతాల్లో బాంబు దాడి జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిందే.

ఈ ఏడాది మళ్లీ 2023లో జనవరి 11న ఉదయం ప్రారంభమైన వైమానిక బాంబు దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. మా పార్టీ నాయకత్వాన్ని, పీఎల్‌జీఏను దెబ్బతీయాలనే లక్ష్యంతో.. వందల సంఖ్యలో బాంబులు వేస్తున్నారు.నెలరోజుల పాటు పగలు, రాత్రి నిరంతర నిఘా, హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టేస్తామ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు. అదే ప్రణాళిక ప్రకారం, ʹఘేరా దలో-ఉన్ములన్ కరోʹ ప్రచారాన్ని నిర్వహిస్తూ, మా పార్టీ, పిఎల్‌జిఎ, విప్లవ ప్రజా కమిటీలు, ప్రజలను తుడిచిపెట్టే ప్రణాళికను, కేంద్రంలోని బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ఛత్తీస్‌గఢ్‌లోని ప్రజలలు వ్యతిరేకంగా, గిరిజన వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, పరిపాలనా అధికారులు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

ఈ భీకర బాంబు దాడుల కారణంగా ప్రజలు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి, వరికోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజల్లో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది.
భారతదేశంలోని దోపిడీ-పాలక వర్గాలు మా పార్టీ, PLGA ప్రజల రాష్ట్ర సంస్థలు మరియు ప్రజలపై ఈ భయంకరమైన వైమానిక దాడులకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమం ప్రారంభించాలని దేశంలోని మరియు ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య, విప్లవ శక్తులకు మా పార్టీ మరోసారి విజ్ఞప్తి చేస్తోంది.
గంగా కార్యదర్శి
సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)

ఈలేఖ తర్వాత మీడియాకు అందిన మరో లేఖలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎలియాస్ సంతోష్ క్షేమ‍ంగా ఉన్నట్టు మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి అజాద్ ప్ర‌కటించారు. హిడ్మా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయినట్టు జరుగుతున్న ప్రచారం ఓ కుట్ర అని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ నాయకుడు ఆజాద్ పేర్కొన్నారు.

ఆజాద్ లేఖ పూర్తి పాఠం...

సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా, గ్రేహౌండ్స్ మోహరించి ఆదివాసీలపై దాడులకు దిగుతున్నారు.
దేశ సంపద దోచుకుపోయేందుకు దారులు సుగమం చేస్తున్న పాలకులు

నిన్న ( బుధవారం )సరిహద్దుల్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో మావోయిస్టు నేత బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ ఇడ్మ మరణించినట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు దేశం అంతా ప్రచారం చేశారు. దాడులు చేసింది నిజమే కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దాడికి మా ప్రజా గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) గట్టి సమాధానం ఇచ్చింది. నిజంగా దేశ ప్రజలపై ఈ దేశంలో ఉన్న సైన్యం దాడి చేయడం తిరిగి ఆ దాడులను సమర్థించుకోవడం, సిగ్గులేకుండా దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. దేశ భద్రత కోసం దేశాల సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం ఛత్తీస్ఘడ్ అడవుల్లో ప్రతి నాలుగు ఊళ్ళకు ఒక క్యాంపు పెట్టి ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిత్యం ఇనుప బూట్ల పదఘట్టనలో ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఈ దేశంలో అత్యంత విలువైన సంపద ప్రస్తుతం ఛత్తీస్ఘడ్ దండకారణ్యంలో ఉంది. అనేక రకాల ఖనిజాలు, అటవీ సంపద కొల్లగొట్టేందుకు బ‌హుళ జాతి కంపెనీలు పన్నాగం పన్నాయి. మిగతా ప్రాంతాల్లో లాగా ఇక్కడ సంపద దోచుకుపోయేందుకు వీలు పడటంలేదు. ఆదివాసీలను నిత్యం చైతన్యం చేస్తూ వారి సంపద వారికే దక్కాలని మావోయిస్టు పార్టీ కోరుతుంది. ఇది పాలకులకు మింగుడు పడటంలేదు. అందుకు మావోయిస్టు పార్టీని ధ్వంసం చేసేందుకు శత విధాల కుట్రలకు పూనుకుంటుంది. మొత్తం ఛత్తీస్ఘడ్ రాష్ట్రాన్ని పోలీసు క్యాంపుగా మార్చింది. ఆకు పచ్చ అడవిలో నెత్తుటేరులు పారించేందుకు నిత్యం దాడులు చేస్తుంది. ఆఖరికి వైమానిక దాడులు చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే అనేక మార్లు వైమానిక దాడులకు పూనుకుంది. అనేక సార్లు గ్రామాలపై మోటార్ సెల్స్ వేసింది. వీటన్నిటిని ప్రజలు గమనించాలి. మావోయిస్టు పార్టీని ప్రజల నుంచి వేరు చేసేందుకు సామ ధాన బేధ దండోపాయాలను ఎంచుకుంది. ఇలాంటి దాడులను ఖండించాలని పిలుపునిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ, అమిత్ షా లు ఇద్దరూ సామ్రాజ్యవాద ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. దేశంలో రాజ్యంగ హక్కులను హరించివేస్తున్నారు. ప్రశ్నించే హక్కు, జీవించే హక్కులను కాలరాస్తున్నారు. దేశ సంపద కొందరి చేతుల్లో ఉండేందుకు వీలు కలిగేలా చట్టాలను చేస్తున్నారు.

సమాధాన్ ప్రహార్ దాడులను ఖండించండి.
దేశ ప్రజల పై వైమానిక దాడులు చేయండం హేయమైన చర్య.
ప్రజలారా మేల్కొనండి, దేశ సంపద కాపాడుకునేందుకు పోరాటాలు చేయండి. గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా పోరాడండి.
దండకారణ్యంలో ఏర్పాటు చేసిన సైన్యాన్ని తక్షణం ఉపసంహరించాలి. ప్రజా గెరిల్లా సైన్యం వర్తిలాలి.

ఇట్లు..
విప్లవ అభినంద‌నలతో
ఆజాద్
కార్యదర్శి
భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ,

సీపీఐ (మావోయిస్టు)

Keywords : CPI Maoist, chattis garh, hidma, santosh, police,
(2024-04-21 18:47:31)



No. of visitors : 1692

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పోలీసులు