మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ


మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ

మేడే

మేడేను పురస్కరించుకొని సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ లేఖను విడుదల చేసింది. సామ్రాజ్యవాదాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మిద్దామని మావోయిస్టు పార్టీ తెలంగాణ‌ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.

తెలంగాణలో విప్లవ కార్మిక వర్గం నాయకత్వంలో రైతాంగం, సంఘటిత, అసంఘటిత కార్మికులు, నిరుద్యోగులు ఐక్యమై మిలిటెంట్‌ ఉద్యమాలు చేపట్టాలని, సోషలిస్టు విప్లవ స్ఫూర్తితో మే డేను జరుపుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.

కేంద్రంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల అనుకూల విధానాలతో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని జగన్‌ పేర్కొన్నారు. మధ్య, చిన్నతరహా రైతాంగానికి వ్యవసాయం భారంగా మారి, వలస కూలీలుగా మారుతున్నారన్నారు.

ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలకు పెరిగిందని, రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా 70 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగిందని పేర్కొన్నారు. హరితహారం, యురేనియం, గ్రైనేట్స్‌, ఓపెన్‌ కాస్టులు, టైగర్‌ జోన్స్‌, భారీ తరహా ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, రైతాంగం ఐక్యమై సామ్రాజ్యవాదాన్ని, దళారీ నిరంకుశ పెట్టుబడిదారులకు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేపట్టకుండా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావని జగన్‌ పేర్కొన్నారు.

Keywords : Telanagana, jagan, maoist party, brs, bjp,
(2023-06-01 11:41:08)



No. of visitors : 1923

Suggested Posts


సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

సెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ విముక్తి దినంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం , జాతీయ సమైక్యతా దినంగా టీఆరెస్ ప్రభుత్వం జరుపుతున్న‌ నేపథ్యంలో ఆ రోజును చీకటి రోజుగా ప్రకటించింది మావోయిస్టు పార్టీ.

Search Engine

RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
more..


మేడే