వాళ్ళ దృష్టిలో దళితులు మనుషులు కారు !


వాళ్ళ దృష్టిలో దళితులు మనుషులు కారు !

వాళ్ళ

ఆబడిలో మధ్యాహ్న భోజనం దళిత మహిళ వండుతున్నదన్న కారణంతో దాదాపు వందమంది విద్యార్థులు ఆ ప్రభుత్వ బడి నుంచి వేరే పాఠశాలకు మారారు. కేవలం 18 మంది విద్యార్థులు ఇప్పుడు ఆ బడిలో చదువుతున్నా.. అందులో ఐదుగురే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. కుల విషం నిండిన తల్లి తండ్రులు ఆ విషాన్నిపిల్లల మెదళ్ళలోకి ఎక్కిస్తున్నారు. ఇది కర్ణాటక కొలార్ జిల్లాలోని కగ్గనహళ్లి గ్రామంలో మాధ్యమిక ప్రభుత్వ పాఠశాలలోని పరిస్థితి.
ఆపాఠశాలలో రాధమ్మ అనే దళిత మహిళ మధ్యాహ్న భోజనాన్ని వండుతోంది. ʹ2014 ఫిబ్రవరిలో నేను పాఠశాలలో చేరిననాటినుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నేను ఇచ్చిన పాలు కూడా విద్యార్థులు తాగరు. నేను వండిన వంటను తినరు. వాళ్ల తల్లిదండ్రులే నా వంట తినొద్దని విద్యార్థులకు నూరిపోస్తున్నారు. ఇంకా నేను వాళ్లకు ఏం చెప్పేదిʹ అంటూ రాధమ్మ బాధపడ్డారు.
నిజానికి ఈ పరిస్థితి మార్చడానికి గతంలో జిల్లా అధికారులు ప్రయత్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామవాసులతో సమావేశం నిర్వహించి.. ఇలా చేయకూడదని చెప్పిచూశారు. దీంతోపాటు గత నెలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి అధికారులు పాఠశాలలో సామూహిక భోజనాలు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. అయితే రాధమ్మ వండిన వంట తినకపోవడానికి కారణం కులవివక్ష కాదని, ఈ పాఠశాలలో చదివే చాలామంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలే అయినప్పటికీ.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న రాజకీయ కక్షలతోనే వాళ్లు పాఠశాల మారుతున్నారని స్కూల్ ఇన్‌చార్జి వైఎం వెంకటచలపతి చెప్తున్నారు. కానీ గ్రామస్థులు మాత్రం దళిత మహిళను కుక్ గా ఉంచితే తమ పిల్లలు ఆ స్కూల్ కు రారని ఖరాకండిగా చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగుపరిచాలని, తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలని, దాంతోపాటు దళిత మహిళా కూక్‌ను మార్చితేనే.. తమ పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చుతామని స్పష్టం చేస్తున్నారు.
ఇది ఒక్క రాధమ్మ పరిస్థితే కాదు. భారత దేశంలోని కోట్లాది దళితుల పరిస్థితి. దళితులు అగ్రకులాల పిల్లలని ప్రేమించినా అగ్రకుల పిల్లలు దళిత పిల్లలను ప్రేమించినా దళితులే హత్యచేయబడతారు. తెల్లబట్టలేసుకున్నందుకు వేటాడబడతారు. అగ్రకుల అహంకారం దళిత స్త్రీలను వివస్త్రలను చేసి ఊరేగిస్తుంది. భారత దేశంలో కుల,మత వివక్ష లేదని, అసలు అసహనమే లేదని పొద్దున లేస్తే ఉపన్యాసాలు దంచే నేతలు వీటిపై నిద్ర నటిస్తుంటారు.

Keywords : Karnataka, Dalith Women, School, Students
(2018-04-19 16:48:38)No. of visitors : 6105

Suggested Posts


RSS was inspired by Adolf Hitler, says writer Arundhati Roy

Writer Arundhati Roy has spoken out against the RSS accusing it of waging an ideological war on India.

ʹహిందువుగా బతకడం అంటే సహనంతో బతకడం - నేను నీ హిందుత్వను తిరస్కరిస్తున్నానుʹ

మా పూర్వీకులు, తాతగారు ఆలయంలో అర్చకులు. మా నాన్నగారు నేటికీ వేదాలను నోటితో వల్లిస్తారు. ఎప్పుడూ చదవకపోయినా నా సోదరి వేదాలను నోటితో చెప్పగలదు. కారణం అది మా వంశంలో, మా రక్తంలో, మా వారసత్వంలో ఉంది. కాబట్టి ఓ భాజాపా నా మతం గూర్చి నువ్వు నాకు నేర్పవద్దు. నేను ఎలా ఆలోచించాలో, ఎవరిని పూజించాలో, ఏం తినాలో, ఎలా దుస్తులు ధరించాలో నువ్వు నాకు నేర్పాలని.....

ముస్లింలపై చివరి యుద్దానికి సిద్దంకండి - సంఘ్ పరివార్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు

ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం కండి....ఒక తలకు పది తలలు నరకండి.... తుపాకులు పట్టండి.... కత్తులు చేబూనండి..... వేలాదిగా వీధుల్లోకి రండి....

HCU rusticated dalith student Rohit Vemula last words

I would not be around when you read this letter. Donʹt get angry on me. I know some of you truly cared for me, loved me and treated me very well. I have no complaints on anyone.....

ʹరోహిత్‌ను వాళ్లు వేటాడారు..నేనూ అందులో భాగమయినందుకు సిగ్గు పడుతున్నానుʹ

రోహిత్‌, తదితరులు నాస్తికులని తెలుసు. సంఖ్యలో వాళ్లు మాకన్నా చాలా ఎక్కువ కాబట్టి వాదనలో మేం నెగ్గలేకపోతున్నామని గ్రహించాం. సరిగ్గా అప్పుడే ఏబీవీపీ ఒక ఎత్తుగడను చేపట్టింది. అదే విచ్‌హంటింగ్‌....

ఆరెస్సెస్ ను నియంత్రించండి - అమెరికా చట్టసభ సభ్యుల లేఖ

భారత్‌లో ముఖ్యంగా క్రిస్టియన్, ముస్లిం, సిక్కులపై ఉద్దేశపూర్వక దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన 34 మంది చట్టసభ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ.....

వాళ్ళు ఆవులను ప్రేమిస్తారో లేదో కానీ మనుషులను మాత్రం ద్వేషిస్తారు !

ఆవులను రక్షించే పేరుతో మనుషులపై దుర్మార్గమైన దాడులు పెరిగి పోయాయి. వాళ్ళే ఆరోపణలు చేస్తూ వాళ్ళే శిక్షలు విధిస్తూ అటు పోలీసులపని ఇటు కోర్టుల పనిని కూడా ఆవురక్షకులే భుజాన వేసుకున్నారు....

మహిళ భూమిని ఆక్రమించి, ఆపై దాడి చేసిన బీజేపీ సర్పంచ్

ఓ మహిళ భూమిని ఆక్రమించుకోవడమే కాక అదేమని అడిగినందుకు ఆ మహిళపై దాడి చేసిన ఘటన పంజాబ్ లో జరిగింది. జల్ంధర్ జిల్లా హోషియార్ పూర్ గ్రామంలో బీనా అనే మహిళకు చెందిన ఐదు ఎకరాల భూమిని బీజేపీకి చెందిన....

శాఖాహారమే పర్యావరణానికి హాని - తేల్చిన పరిశోధన

మాంసాహారం కన్నా శాఖాహారం వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని కార్నెజ్ మెలాన్ యూనివర్సిటీకి పరిశోధకులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో....

ఆ గుర్రం కూడా దేశద్రోహేనా ?

అది గుర్రం....పాపం అది ఓ మూగ జీవి.... అది దేశ ద్రోహి కాదు... అది జేఎన్యూ నుంచో హెచ్ సీయూ నుంచో కూడా రాలేదు ... హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడటానికి దానికి నోరు కూడా లేదు. కానీ ఓ బీజేపీ ఎమ్మెల్యేకు.....

Search Engine

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు
మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - ‍పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన‌
క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
Statement of the First Meeting of European Marxist-Leninist-Maoist Parties and Organizations
ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌
ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు
“It’s The State That’s Violating the Constitution, Not Us”
Women in People’s War: Past, Present and Future
Expand The Peopleʹs War To Fight Brahmanical Hindu Fascism And Advance The New Democratic Revolution - Varavara Rao
చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !
బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక‌ !
ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !
యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్
ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?
ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి !
SC,STచట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా రేపు భారత్ బంద్
పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్న‌ఆరోపణలు ఓ కుట్ర‌ - వరవరరావు
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2)
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)
పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి !
దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ‌
ఇంట‌ర్మీడియెట్ బోర్డును ముట్ట‌డించిన తెలంగాణ విద్యార్థి వేదిక - 70 మంది విద్యార్థుల‌ అరెస్టు
Ban Sri Chaitanya & Narayana Corporate Colleges
more..


వాళ్ళ