సల్మాన్ నిర్దోషి సరే
మరి రవీంద్రపాటిల్ చావుకు కారణమెవరు ?

సల్మాన్ మరి రవీంద్రపాటిల్ చావుకు కారణమెవరు ? Salmana Khan, Bollywood, Court, Police>

 సల్మాన్ ఖాన్ నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. పెద్దలు చాలా మంది ఆనందం ప్రకటిస్తున్నారు. న్యాయం గెలిచిందని తీర్పులిచ్చేస్తున్నారు. మరి ఈ కేసులో దోషులెవరు ? ప్రత్యక్ష సాక్షి మరణానికి కారణమెవరు ?అసలు ప్రత్యక్ష సాక్షి ఎవరు ? అతనేమయ్యాడు ? ఎందుకు మీడియాలో సల్మాన్ గురించే మాత్రమే వార్తలొస్తున్నాయి . బాలీవుడ్ ప్రముఖులంతా సల్మాన్ పైనే ఎందుకు జాలి చూపిస్తున్నారు . సల్మాన్ నిర్దోషి అని తేలగానే బాలీవుడ్ ఆనందంతో తన్మయత్వం చెందిందెందుకు ? ఈ కేసులో న్యాయం కోసం తన యవ్వనాన్ని, జీవితాన్ని ఫణంగా పెట్టిన ఈ కేసు ముఖ్య సాక్షి గురించి ఎవ్వరూ ఎందుకు పట్టించుకోవడం లేదు ? ఎందుకంటే అతను సినిమా స్టారో , పారిశ్రామిక వేత్తనో కాదు కాబట్టి .న్యాయం కోసం చనిపోయాడు కాబట్టి . ఎందుకంటే ఈ కేసులో సాక్షి కావడమే అతని చావుకు కారణం కాబట్టి.

ఆయన పేరు రవీంద్ర పాటిల్ . నిజాయితీ గల పోలీసు ఉధ్యోగి. కండలు తిరిగిన శరీరం . పైగా అందగాడు. సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు చివరకు ఆయన చావుకు కారణమయ్యింది. ఆయన నిజాయితీనే ఆయనను కాటికి పంపింది.

ముంబైలోని సతారాకు చెందిన పాటిల్‌కు 25 ఏళ్లు. కష్టపడి కానిస్టేబుల్ అయ్యాడు. ముంబై పోలీసు విభాగంలో ఉద్యోగం. ఆ వెంటనే స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్(ఎస్‌వోఎస్)లో కమాండోగా చేరేం దుకు శిక్షణ. సరిగ్గా ఇదే సమయంలో సల్మాన్‌కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపులు రావడంతో ముంబై పోలీసు విభాగం.. పాటిల్‌ను సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పంపింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు ప్రమాదం రోజున పాటిల్ అదే వాహనంలో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు నడపొద్దని సల్మాన్‌ను పాటిల్ వారించినా వినలేదు.కారు బయల్దేరిన కాసేపటికే అమెరికా ఎక్స్‌ప్రెస్ బేకరీ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బాడీగార్డ్‌లా కాకుండా ఓ పోలీసులా వ్యవహరించిన పాటిల్ వెంటనే బాంద్రా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌లో జరిగింది జరిగినట్టు చెప్పాడు. దీంతోసల్మాన్‌పై కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు కోర్టులో కూడా పాటిల్ సాక్ష్యమిచ్చాడు.

ఆ సాక్షంతో అతని జీవితమే మారిపోయింది. పోలీసు డిపార్ట్ మెంట్ ఎస్ ఓఎస్ ఉద్యోగం నుంచి తప్పించింది. అన్ని వైపుల నుండి పాటిల్ పై తీవ్రమైన వత్తిడులొచ్చాయి. చివరకు స్వంత డిపార్ట్ మెంట్ నుండి కూడా తీవ్రమైన వత్తిళ్ళు వచ్చాయి . పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం ఆయనను ఒంటరిని చేసింది.ఆ వత్తిళ్ళు తట్టుకోవడం ఆయన వల్ల కాలేదు . దాంతో ఉద్యోగానికి కూడా దూరమయ్యాడు. చివరకు ముంబయ్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అదే సమయంలో సల్మాన్ కేసు విచారణకు వచ్చింది . ఇతను కోర్టుకు రాలేదు.దాంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది .పోలీసులు పాటిల్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. డిపార్ట్ మెంట్ డిస్మిస్ చేసింది. అక్కడే ఆయనకు టీబీ సోకింది.ఆయన జైలు నుండి విడుదలయ్యే సరికి జుట్టు రాలిపోయి ,చిక్కిశల్యమై ఎవ్వరూ గుర్తుపట్టకుండా తయారయ్యాడు.భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. కొద్దిరోజులు రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ తిరిగాడు. ఆతర్వాత సెవ్రీ లోని టీబీ ఆస్పత్రిలో చేరి 2007, అక్టోబర్ 4న కన్నుమూశాడు. చివరి రోజుల్లో ఆయన అన్నమాట ʹఆ ప్రమాదం నాజీవితాన్ని నాశనం చేసిందిʹ అని .
ఇప్పుడు సల్మాన్ మాత్రం నిర్దోషి. పోలీసులు ఆయనను దోషిగా ఎందుకు నిరూపించలేకపోయారు ? ఈ దేశంలో ఉన్నోడికో న్యాయం లేనోడికో న్యాయం అనే వాదనను కొట్టిపారేయగలమా ?

Keywords : Salmana Khan, Bollywood, Court, Police
(2024-04-22 00:30:20)



No. of visitors : 1940

Suggested Posts


దేశద్రోహుల గొప్పతనాన్ని పొగిడే దేశʹభక్తులʹ సినిమా - అరుణాంక్ లత‌

ʹప్రేమʹ ఈ పదానికి ఆర్.ఎస్.ఎస్ దీక్షనరిలో చోటు లేదు. కానీ ఇక్కడ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త అయిన హీరో మాత్రం అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళ కులమే అని దర్శకుడు తల్లి పాత్రతో చూపిస్తాడు లెండి. లేకపోతే కుల సంకరం జరిగిపోదు. అమ్మాయిని ఏకాంత ప్రదేశానికి ఈ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త తీసుకుపోయి అక్కడ కౌగిలింతలు. ముద్దులు అబ్బో అన్ని పాశ్చ్యాత సంస్కృతి పనులు చేస్తుంటాడు. ....

దిల్ వాలేః ఒక వైపు నిరసనలు, మరో వైపు కలక్షన్లు

షారూఖ్ ఖాన్ నటించిన దిల్ వాలే సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు 21 కోట్ల రూపాయల కలక్షన్లు వసూలు చేసి బాజీరావు మస్తానీ ని మించి పోయింది. దేశంలో అసహనం ఉందన్న షారూఖ్ ఖాన్ మాటలకు....

కేసు కోసం 25 కోట్లు ఖర్చు పెట్టాం - సల్మాన్ తండ్రి చెప్పిన నిజాలు

హిట్ అండ్ రన్ కేసులోంచి నిర్దోషిగా బయటపడ్డాడు నిజమే కానీ అది అంత సులభంగా జరగలేదట, ఈ కేసుకోసం సల్మాన్ ఖాన్ 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట. ఈ విషయం వేరెవరో చెబితే నమ్మలేమేమో కానీ .....

చిన్నారి పెళ్లికూతురు ఆత్మహత్య

టీవీ సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. హిందీలో బాలికావధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ తో ఆనందిగా ఫేమస్ అయిన....

పైరసీ సినిమాలు చూడటం తప్పుకాదు - హైకోర్టు

ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడటం శిక్షార్హం కాదని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. పైరసీ ప్రింట్లను ఆన్ లైన్ లో వీక్షించిన వారు శిక్షార్హులని గత నెలలో ఐఎస్పీలు ప్రకటించిన నేపథ్యంలో....

Dear Mr. Bhansali, I am Stunned after Watching Glorification of Sati in Your Movie: Swara Bhaskarʹs Open Letter

At the outset Sir, congratulations on finally being able to release your magnum opus ʹPadmaavatʹ – minus the ʹiʹ, minus the gorgeous Deepika Padukoneʹs uncovered slender waist, minus 70 shots you apparently had to cut out.....

ʹసల్మాన్ కారు మద్యం తాగిందిʹ

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్దోషి అని కోర్టు తీర్పు వెలువడినప్పటినుండి సోషల్ మీడియాలో విమర్షలు, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిడెంట్ సమయంలో సల్మాన్....

అమెరికాలో వివక్ష గురించి మాట్లాడేవారు భారత్ లో వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు ?

అమెరికాలో తెల్ల జాతి పోలీసు నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ను హత్య చేసిన తర్వాత ʹబ్లాక్ లైవ్స్ మేటర్ʹ అంటు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై భారతీయులు అనేక మంది తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

కంగనా అమ్మగారికి ఒక లేఖ

కులాన్ని తిరస్కరించటం అంటే ఏమిటో మీకు అర్థం కావాలంటే ముందు మీకున్న రాజపుత్రుల గర్వాన్ని వదులుకోవాలి. మీ అస్తిత్వం గురించి గర్వపడే మీలాంటి వాళ్లు, ఇతర కులాల పేర్లను కూడా అవమానిస్తారు. ʹపాకీ దాని లాగా కనబడటంʹగురించి సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి, సోనాక్షి సిన్హా, యువరాజ్ సింగ్ లాంటి ʹఆధునిక మానవులుʹ ఏమన్నారో మీకు గుర్తుందా? కొంతమంది పాకీల పేరుతోనే ఇక్కడ ఉని

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సల్మాన్ మరి రవీంద్రపాటిల్ చావుకు కారణమెవరు ? Salmana Khan, Bollywood, Court, Police />