జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డవాడు దేశ‌ద్రోహి అయ్యాడా : ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ


జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డవాడు దేశ‌ద్రోహి అయ్యాడా : ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ

ఉమ‌ర్ ఖలీద్ ఎక్క‌డున్నాడో పోలీసుల‌కే తెలియాలి. టైమ్స్ నౌతో ఇంటర్వూ నుంచి వెళ్లేట‌ప్పుడు చివ‌రి సారి నేను ఉమ‌ర్‌తో మాట్లాడాను. ఇంటికి ర‌మ్మ‌ని అడిగాను. కానీ తాను జేఎన్‌యూ వెళ్తాన‌ని చెప్పాడు. అప్ప‌టి నుంచి ఉమ‌ర్‌తో మాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు. ప్ర‌స్థుతం దేశంలో నెల‌కొన్న వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ఉమ‌ర్ భ‌ద్ర‌త ప‌ట్ల మాకు చాలా ఆందోళ‌నగా ఉంది. ఇలాంటి స్థితిలో ఏ త‌ల్లిదండ్రుల‌కైనా ఖ‌చ్చితంగా ఆందోళ‌న ఉంటుంది. ప్ర‌స్థుతం నేన‌లాంటి ఆందోళ‌న‌లో ఉన్నాను.

నిజానికి ఉమ‌ర్ విష‌యంలో మీడియా తీసుకున్న వైఖ‌రి చూసి నేను ఆందోళ‌న చెందుతున్నాను. ఎలా త‌న వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నారో? ఎలా త‌న‌ని దేశ ద్రోహిగా చిత్రిస్తున్నారో? చూస్తే ఆందోళ‌న క‌లుగుతోంది. ఏ మ‌నిషి త‌న జీవిత‌మంతా దేశం కోసం ఆలోచించాడో... ఏ మ‌నిషి ద‌ళితుల కోసం, ఆదివాసీల కోసం నిల‌బ‌డ‌డ్డాడో... ఏమ‌నిషి దేశం కోసం ప‌నిచేయాల‌ని విదేశీ స్కాల‌ర్‌షిప్ ని సైతం వ‌దులు కున్నాడో... ఏమ‌నిషైతే పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఇప్పుడా మ‌నిషి పాకిస్తాన్‌కి వెళ్లాడ‌ని నింద‌లు వేస్తున్నారు. ఏ మ‌నిషి ద‌ళితుల ప‌క్షాన పోరాడుతున్నాడో... ఏ మ‌నిషి రైతుల కోసం పోరాడుతున్నాడో... ఆదివాసీల జీవితాన్నే త‌న ప‌రిశోధ‌నాంశంగా ఎంచుకొని పీహెచ్‌డీ చేస్తున్నాడో... వాళ్ల స‌మ‌స్య‌ల్ని... వాళ్ల క‌ష్టాల్ని ప్ర‌పంచంముందుంచాల‌నుకున్నాడో.. అలాంటి మ‌నిషిని దేశ ద్రోహి అంటున్నారు? అలాంటి మ‌నిషి దేశం నుంచి పారిపోయాడంటున్నారు? అలాంటి మ‌నిషి దేశద్రోహుల‌తో క‌లిసిపోయాడంటున్నారు? ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది. ఏ ప‌నినైతే.. చ‌ట్టాలు.. న్యాయ‌స్థానాలు చేయాలో ఆ ప‌నిని మీడియా చేస్తోంది. మీడియానే విచార‌ణ జ‌రుపుతోంది. తీర్పులు చెబుతోంది.. ఉమ‌ర్‌ని దోషిగా చిత్రించేందుకు య‌త్నిస్తోంది. ఉమ‌ర్ పారిపోయేవాడైతే... త‌ను దేశ‌ద్రోహే అయితే.. టీవీ ఛాన‌ల్‌కి వచ్చి త‌న అభిప్రాయాల్ని వ్య‌క్తం చేసేవాడా? చ‌ర్చించేవాడా?

అది... ఉమ‌ర్ ఖాలీద్ భాష కాదు.. అలాంటి మాట‌లు ఉమ‌ర్ మాట్లాడ‌డు... అక్క‌డ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఏబీవీపీ వాళ్లు ఉద్దేశ్య పూర్వ‌కంగా అలాంటి నినాదాలిచ్చార‌ని వీడియోలు రుజువు చేస్తున్నాయి. అయినా... ఉమ‌ర్‌ని టార్గెట్ చేయ‌డం విషాదం. దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారు. భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నారు. ఉమ‌ర్‌కి కాశ్మీర్ ప్రాంతంపై కాదు.. అక్క‌డి ప్ర‌జ‌ల‌పై ప్రేమ‌. ఆ ప్ర‌జ‌ల క‌ష్ట న‌ష్టాల ప‌ట్ల‌ అత‌ని ఆందోళ‌న‌. వాళ్ల‌ను మ‌న‌తో నిలుపుకోవాల‌ని అత‌ని త‌ప‌న‌.

అఫ్జ‌ల్ గురు కేసు విష‌యంలో న్యాయ నిపుణులు, రాజ‌కీయ ప్ర‌ముఖులెంద‌రో తీర్పు ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అలా మాట్లాడ‌డం దేశానికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌డ‌మే అయితే.. వాళ్ల‌పై ఎందుకు విచార‌ణ జ‌ర‌ప‌లేదు. కానీ ఎందుకు ఇప్పుడు ఉమ‌ర్‌ని మాత్ర‌మే చూపిస్తున్నారు? నినాదాలివ్వ‌డం దేశ ద్రోహం కాద‌ని న్యాయ‌నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. వాటినేవీ ప‌ట్టించుకోకుండా... స్వ‌యంగా తీర్పులు చెబుతున్నారు. ఉమ‌ర్ ఇక్క‌డి న్యాయ వ్య‌వ‌స్థ నుంచి చ‌ట్టం నుంచి త‌ప్పించుకు తిర‌గ‌డం లేదు. ఎలాంటి వాతార‌ణాన్ని సృష్టిస్తున్నారు. కొడ‌తామంటున్నారు.. చంపుతామంటున్నారు. ఈ వాతార‌ణం ఎవ‌రినైనా ఆందోళ‌న‌కు గురిచేస్తుంది.
నాకు ఈ దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంది. ఉమ‌ర్ ఎక్క‌డ ఉన్నా బ‌య‌ట‌కు రావాలి. ఎవ‌రు త‌ప్పు చేశారో తేలాలి? ఎవ‌రు దేశానికి వ్య‌తిరేకంగా ప‌నిచేశారో వాళ్ల‌ని శిక్షించాలి. న్యాయ‌వ్య‌వ‌స్థను తేల్చ‌నీయండి.

(న్యూస్ 24 ఇంట‌ర్వ్యూలో జేఎన్‌యూ విద్యార్థి ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ అభిప్రాయాలు సంక్షిప్తంగా)
అనువాదం: క్రాంతి

Keywords : JNU, Umar Khalid, SQR Ilayasi, Hindutva, Avaninews,
(2018-03-20 19:20:23)No. of visitors : 1621

Suggested Posts


మనిషిని వెతుక్కుంటూ అతను వెళ్ళి పోయాడు...

విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోప‌ల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది....

Solidarity with the women complainants of SRFTI,JNU in their fight against sexual harassment

On behalf of JNUSU and undersigned organizations we extend our solidarity and revolutionary greetings to the women complainants of SRFTI Kolkata, who have been fighting against cases

Proud of Kanhaiya, Khalid, Anirban, says Prof Saibaba

ʹI am proud of my students Kanhaiya Kumar, Umar Khalid and Anirban Bhattacharya, who are striving for the people of the countryʹ beamed alleged naxal think-tank Prof G N Saibaba...

మీడియా దుర్నార్గం: జేఎన్యూ విద్యార్థి ఐసిస్ సింపతైజర్ అని మొదటిపేజీలో.. అది ఫేక్ న్యూస్ అని లోపలి పేజీల్లో..

మీడియా ద్వారా సంఘ్ పరివారం మరో నీచమైన కుట్రకు తెరలేపింది. నజీబ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. జీ టీవీ , టైమ్స్ ఆఫ్ ఇండియా మరికొన్ని మీడియా సంస్థలు నజీబ్ గురించి అబద్దపు కథనాలు ప్రచురించి బురదచల్లే ప్రయత్నం చేశాయి. లేని పోలీసు రిపోర్ట్ ను ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాయి....

COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA

The CBI today submitted a status report on its probe into the mysterious disappearance of Najeeb Ahmed in the Delhi High Court, and is believed to have said that the auto-rickshaw driver who the Delhi Police claimed to have dropped the JNU student at Jamia Millia Islamia has retracted his statement....

Search Engine

నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !
Atrocities against Dalits at 17-year high in Gujarat
Baiga Adivasis March Against Displacement Due to Tiger Corridor, Demand Forest Rights
సోవియట్ రష్యాలో ఏం జరిగింది ?
Hindu Mahasabhaʹs calendar refers to Mecca as Macceshwar Mahadev temple
కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం
Why it is important to support the Spring Thunder Tour?- International Committee to Support the Peopleʹs War in India
చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ
సారూ.... అమ్మాయిలంటే ఎందుకంత వివ‌క్ష? ‍ ప్రిన్సిప‌ల్ కు ఓయూ విద్యార్థినిల లేఖ
నిర్బంధాల నడుమ మావోయిస్టుల భారీ భహిరంగ సభ‌
న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?
మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?
జన హృదయాల్లో విప్లవ ప్రభాకరుడు - వరవరరావు
శ్రీ చైత‌న్య, నారాయ‌ణ కాలేజీల‌ను బ‌హిష్క‌రించండి : టీవీవీ
పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...
Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket
Bhima-Koregaon violence: Hindutva leader Milind Ekbote held
UP: Two Dalit youths brutally thrashed, one lost his thumb
ప్ర‌జ‌ల‌పై యుద్ధం : పాఠ‌శాలలను ధ్వంసం చేస్తున్న పోలీసులు !
ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..
రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !
మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు
మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
రైతులపై బీజేపీ నేత‌ దాడి !
లెనిన్‌ ఎవరూ..!?
more..


జ‌నం