మహాత్ముడైన రేప్ నిందితుడు - పాఠం భోధిస్తున్న టీచర్లు


మహాత్ముడైన రేప్ నిందితుడు - పాఠం భోధిస్తున్న టీచర్లు

మహాత్ముడైన

అక్కడ పిల్లలకు స్కూళ్ళలో మహాత్ముల గురించి భోధిస్తారు.... అందులో తప్పేం ఉంది ? రామకృష్ణపరమహంస, వివేకానంద, మహాత్మా గాంధీ, మదర్ తెరిసాల గురించి భోధిస్తారు... వీళ్ళగురించి చెప్పకూడదా ? వీళ్ళతో పాటు ఆసారాం బాపు , రామ్ దేవ్ బాబా ల గురించి భోధిస్తారు.... !!!!!!!
అవును ఇది నిజం రాజస్తాన్ లో మూడవతరగతి జీకే పుస్తకంలో ఈ మహానుభావుల పాఠాలున్నాయి. ఓ చిన్నారిని రేప్ చేసాడన్న కేసులో ప్రస్తుతం ఊసలు లెక్కపెడుతున్న ఆసారాం బాపు వాళ్ళకు మహాత్ముడు. మాహాత్ముడు అసారాం బాపు చిత్రపటాన్ని గుర్తింపుము అనే ప్రశ్నకు చిన్నారులు ఆయనను గుర్తిస్తారు కానీ వాళ్ళకేం తెలుసు ఆయన తమ అక్కలాంటి ఓ అమ్మాయిని రేప్ చేసిన కేసులో జైళ్ళో ఉన్నాడని ! పాపం వాళ్ళు పుస్తకంలో ఉన్నది, టీచర్లు చెప్పిందే నిజమని నమ్ముతారు కదా ! కానీ పుస్తకాలు ప్రింట్ చేసిన వారికి కానీ బోదిస్తున్న వారికి కానీ వాళ్ళు మహాత్ములెట్లవుతారని ఎన్నడూ అనుమానం రాకపోవడం ఆశ్చర్యం. ఈ విషయం బహిర్గతమైన తర్వాత ఇప్పుడు తీరిగ్గా... మెల్లెగా నాలిక కర్చుకున్నట్టు నటిస్తున్నారు. పాఠం ఏదుంటే అదే చెబుతామని టీచర్లు... అసలలాంటి పాఠం ఉన్నట్టే తెలియదని విద్యాశాఖ అధికారులు.... పుస్తకాలు ముద్రించే సమయానికి ఆసారాం పై కేసులేదని, ఆయన అరెస్టు కాలేదని పబ్లిషర్లు తప్పించుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తవి ముద్రించే పనిలో ఉన్నామని, పాతవన్నీ వెనక్కి తెప్పిస్తామని పబ్లిషర్లు చెబుతున్నారు.

Keywords : Rajastan, Asarambapu, Accused of rape, Ramdev, Class Books
(2019-12-06 06:58:00)No. of visitors : 9175

Suggested Posts


ఆ అక్కాచెల్లెళ్ల‌ను రేప్ చేయండి...అగ్ర‌కుల పంచాయ‌తీ తీర్పు !

బుస‌లు కొడుతున్న ఉగ్ర‌కుల ఉన్మాదం ద‌ళితులపై, స్త్రీలపై చేస్తున్న అమానుషాలు స‌భ్య‌స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకునేలా ఉన్నాయి. అగ్ర‌కుల అమ్మాయిని ద‌ళిత యువ‌కుడు ప్రేమించాడ‌న్న అక్రోశంతో ఆ యువ‌కుడి చెల్లెళ్ల‌ను రేప్ చేయాల‌ని తీర్పు ఇచ్చిన దుర్మార్గ‌పు పంచాయ‌తీ క‌థ ఇది........

సంస్కృతి రక్షకులమనే ఫోజు - అమ్మాయి పై రేప్ ప్రయత్నం

తాము నీతి మంతులమని, సంస్కృతి రక్షకులమని ఫోజులు కొడుతూ ఓ అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించిన ఓగుంపు దుర్మార్గమిది.....

100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ

100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. ఉదయం నుంచి వాట్సప్ లో సోషల్ మీడియాలో వినివిని చికాకొస్తోంది. చివరికి డీజీపీ, పోలీసు కమిషనర్లు, హోం మంత్రి కూడా ఇదే పాట. ఆమె 100 కి డయల్ చెయ్యలేదు కనుక అమెకిలా జరిగింది. ఆమె అలాంటి బట్టలు వేసుకుంది కనుక అలా జరిగింది. ఆమె ఆ టైమ్ లో బయటికి వెళ్ళింది కనుక అలా జరిగింది అనటానికి దీనికి తేడా ఏమిటి?

Search Engine

నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
more..


మహాత్ముడైన