లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా

లైసెన్స్,

హైదరాబాద్ లో హెల్మెట్‌, లైసెన్స్‌ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జరినామా విధించనున్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు, హెల్మెట్‌ లేకపోతే రూ. 100 కట్టాల్సిందే. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రవాణా, పోలీసు శాఖలు నిర్ణయించాయి. మార్చి 1వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలు నగరంలో తనిఖీలు ముమ్మరం చేయనున్నాయి. తనిఖీల్లో తరచూ పట్టుబడే వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. రోడ్డు భద్రత నేపథ్యంలో రెండు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళుతున్నారు. రోడ్డు భద్రతపై సుప్రీం కమిటీ సూచనలను కచ్చితంగా అమలు చేయడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వారికి చట్టప్రకారం శిక్ష పడేలా రంగం సిద్ధం చేస్తున్నారు. లైసెన్స్‌లు లేనివారు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. లైసెన్స్‌ లేని వారు, ఉండి సస్పెండ్‌ అయిన వారు వాహనాలను నడిపితే శిక్ష పడేలా చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో మూడుసార్లకు మించి పట్టుబడిన వారు గ్రేటర్‌ పరిధిలో 142 మంది ఉన్నారు. ఇలాంటి వారు మళ్లీ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. హెల్మెట్‌ తప్పనిసరి అని గత కొన్ని నెలలుగా నగరంలో విస్తృత్తంగా ప్రచారం చేసి అవగాహన కల్పించామని... అయినా చాలామంది వాడడం లేదని హైదరాబాద్‌ జిల్లా జేటీసీ టి.రఘునాథ్‌ అన్నారు. మార్చి 1వ తేదీ నుంచి చేపట్టే తనిఖీల్లో హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే జరిమానా విధిస్తామని తెలిపారు. పట్టుబడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. హెల్మెట్‌, లైసెన్స్‌తోపాటు ఫోన్‌ మాట్లాడుతూ, సిగ్నల్‌ జంపింగ్‌, మితిమీరిన వేగంతో డ్రైవింగ్‌ చేయడం, ఓవర్‌ లోడింగ్‌ వంటి ఉల్లంఘనలపై రెండు శాఖల అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు.

Keywords : license, helmet, police, bike, vehicle, hyderabad
(2024-04-11 19:27:29)



No. of visitors : 1071

Suggested Posts


రాక్షస పోలీసులు.... దళిత మహిళను నడి రోడ్డు మీద బట్టలూడదీసి కొట్టారు

తమ ఇంట్లో దొంగతనం జరిగింది చర్య తీసుకోండంటూ వచ్చిన ఓ దళిత కుటుంభంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో సునీల్ గౌతమ్

డేరింగ్ కానిస్టేబుల్ !

ఆ కానిస్టేబుల్ సాహసానికి సెల్యూట్ చేయాల్సిందే ! అతను 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. అందుకోసం ఆయన తన ప్రాణాలగురించి కూడా ఆలోచించలేదు.

వాట్సప్ అడ్మిన్ లూ... జర జాగ్రత్త !

వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేయడం, దానికి అడ్మిన్ గా ఉండటం, అందులో ఫ్రెండ్స్ అందరినీ చేర్చడం చాలా మందికి ఇష్టం. అయితే అడ్మిన్ గా ఉండటం అంత ఈజీ కాదు....

వాళ్ళు పోలీసులు....!

కొందరు తాగితే మనుషులు కాదు.... కొందరికి కోపమొస్తే మనుషులు కాదు.... కానీ వీళ్ళు యూనిఫామ్ తొడిగితే మనుషులు కాదు. వాళ్ళ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.....

యజమానురాలి అక్కసు... పోలీసుల కర్కషత్వం... ఓ యువతిపై థర్డ్ డిగ్రీ

తన ఇంట్లో పని మానేసినందుకు ఓ యజమానురాలికి పని మనిషిపై కోపమొచ్చింది. అమెను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేసింది. పోలీసులేమో తమ చేయి దురద తీర్చుకునేందుకు ఓ మనిషి దొరికిందనే పైశాచికానందంలో ఆ పని మనిషిని చితకబాదారు.....

HCU విద్యార్థినులను అత్యాచారం చేస్తామని బెధిరించిన పోలీసులు - నిజ నిర్దారణ కమిటి రిపోర్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వర్శిటీలో నిరసనలు జరుగుతున్న వేళ, వాటిని అణచి వేయడమే లక్ష్యంగా విరుచుకుపడ్డ పోలీసులు విద్యార్థినులపై అత్యాచారం చేస్తామని బెదిరించారని, యువతులను ఇష్టానుసారం....

మానవ మృగాలు !

కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కీచకులు ఓ దళిత యువతి (20)ని చెరబట్టారు.. అన్నా... దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నన్ను వదిలిపెట్టండి.. లేకుంటే నేను చచ్చిపోతా.. అని దీనంగా వేడుకున్నా....

మృత దేహం మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్ళిన పోలీసులు !

సీసీ ఫుటేజ్ ద్వారా బయట పడ్డ బీహార్ పోలీసుల అమానుషత్వం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బీహార్ వైశాలి జిల్లాలో గల గంగానదిలో తేలిన ఓ వ్యక్తి శవాన్ని గుర్తించిన గ్రామస్థులు బాడీని బయటకు....

రామోజీ హోటల్ పేకాట స్థావరం !

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కు చెందిన హోటల్ జూదగాళ్ళకు అడ్డాగా మారిందా ? కొంత కాలంగా ఆ హోటల్లో పేకాట జోరుగా సాగుతోందా ? పోలీసు వర్గాలు అవుననడమే కాదు మంగళవారం నాడు ఆహోటల్ పై దాడి చేసి...

హింసా రాజ్యం !

నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఒక ముసలి అతన్ని గూండాలు కర్రలతో కొట్టి చంపారు. అహమ్మదాబాద్ లో ఓ ఎనిమిదిమంది యువ గూండాలు ఓ పాన్ షాప్ దగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావల్సిన....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


లైసెన్స్,