ʹʹచావుతో సెల్ఫీ దిగినంత పనైందిʹʹ

ఎదురుగా ఖడ్గమృగం... అందులోనూ అది ఉగ్రరూపంలో ఉంది.... ఇక ఆ రేంజర్ కు పై ప్రాణాలు పైనే పోయాయి.
అది అసోంలోని కజిరంగా జాతీయపార్కు. అరుదైన ఖడ్గమృగాలు, పక్షిజాతులకు నివాసస్థావరం. గడిచిన కొద్దికాలంగా పేట్రేగిపోతోన్న స్మగ్లర్ల బారి నుంచి జంతువులను కాపాడేందుకు సుశిక్షితులైన రేంజర్లను నియమించారు పార్కు అధికారులు. అలా నియమితుడైన ఓ రేంజర్ కు శుక్రవారం ఎదురైన సంఘటన ఇది.
వాహనాలు వినియోగిస్తే స్మగ్లర్లు పారిపోయే అవకాశం ఉంటుందికాబట్టి కాలినడకన పార్కులో కలియదిరగడం రేంజర్ల విధి. అలా తన విధులు నిర్వహిస్తోన్న రేంజర్.. ఓ భారీ ఖడ్గమృగం కంటబడ్డాడు. పైగా అది పిల్ల తల్లి కూడా. సహజంగానే పిల్లతల్లులైన జంతువులు మిగతా సమయాల్లోకంటే ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. రేంజర్ ను చూసిన ఖడ్గమృగం, అతను ఎక్కడ తన పిల్లకు, తనకు హాని చేస్తాడేమోనని కంగారుపడింది. ఆ కంగారు కాస్తా కోపంగామారి రేంజర్ వైపు గుర్రుగా దూసుకొచ్చింది. దిక్కుతోచని రేంజర్ పక్కనే ఉన్న చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు.

నిజానికి ఆ చెట్టును కూల్చేసి, అతణ్ని చంపడం ఖడ్గమృగానికి పెద్ద పనేంకాదు. కానీ దాని లక్ష్యం పిల్లల్ని కాపాడుకోవటమేకాబట్టి దారి దొరకగానే పిల్లతోసహా తన దారినతాను వెళ్లిపోయింది. అదే పార్కులో తిరుగాడుతోన్న కౌషల్ బొరువా అనే జంతుశాస్త్రవేత్త ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. ప్రాణాలతో బయటపడ్డతర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉందని ఆ రేంజర్ ను అడిగితే..ʹచావుతో సెల్ఫీ దిగినంత పనైందిʹ అని బదులిచ్చాడు.

Keywords : Rhinoceros, park ranger, Kaziranga National Park, Assam
(2024-02-11 22:18:14)



No. of visitors : 1003

Suggested Posts


చివరి రక్తం బొట్టు వరకు పోరాటం....

ఒళ్ళు గగుర్పొడిచే పోరాటం.... నెత్తుర్లు పారుతున్నా లెక్క చేయక ప్రాణం కొరకు పోరాటం... తన ప్రాణమే కాదు తోటి వారి ప్రాణంకోసం కూడా ఆ దున్న తెగించి చివరి రక్తం బొట్టు వరకు సింహాలతో పోరాడింది....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹʹచావుతో