మా చావులపై ఎందుకింత వివక్ష?

మా

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని శాంతి ఖని బొగ్గు బాయిలో ఏప్రిల్13న ఉదయం11 గంటలకు బండ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఏప్రిల్15 మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా బండ కింది నుంచి మృత దేహాలను వెలికి తీయలేదు. కార్మికులు, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు గని పై మూడు రోజులుగా రోదిస్తున్నారు.

బోరు బావుల్లో పిల్లలు పడిపోయినప్పుడు మీడియా ప్రైమ్ టైంలో వార్తలు ఇస్తుంది. కంటిన్యుయస్ గా స్క్రోలింగులు ఇస్తుంది. ప్రభుత్వాలు, మంత్రులు అదే పనిగా స్టేట్‍మెంట్లు ఇస్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళి సహాయ పనులను పర్యవేక్షిస్తారు.

శవాలు కుళ్ళి పోయి బొగ్గు బాయి అంతా దుర్గంధం వ్యాపిస్తున్నా ఒక్క మంత్రికీ, ప్రభుత్వాధిపతులకు పట్టదు. ఏ ఒక్కరూ తొంగి చూసిన పాపాన పోలేదు. మీడియా, ప్రధాన పత్రికలన్నీ మొదటి రోజు బలవంతంగా స్టేట్ పేజీలో వార్త పెట్టారు. ఆ తరువాత జిల్లా పేజిలకు పరిమితం చేసారు. స్క్రోలింగులనుంచి గని ప్రమాద వార్త మాయం అయింది.

మండు టెండల్లో చల్లని నీళ్లు కావాలన్నా, చల్లని ఏసీ కావాలన్నా సింగరేణి కార్మికుడే బొగ్గు తీయాలి. ఆ కార్మికునికిచ్చే ప్రాధాన్యత ఈ పాటిది.
సింగరేణి కార్మికుడు నెత్తురు చెమటగా మార్చుకుని బొగ్గు తవ్వి తీస్తే సంస్థకు వచ్చిన ఆదాయం లోనుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాలీనా చెరి 4000ల కోట్ల రూపాయలు రాయల్టీ రూపేణా తీసుకుంటున్నాయి. కనీసం 10 లక్షల ఎక్స్ గ్రేశియా ప్రకటించ లేదు. సంస్థ సీఎండి 25 లక్షల ఎక్స్ గ్రేశియా ఇస్తామని, ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. వాస్తవానికి అవేవి ఆయన జాలిపడి ఇస్తున్నవి కాదు. గని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని జాతీయ స్థాయిలో ఒప్పందం సుమారు 40 సంవత్సరాలుగా అమలవుతోంది. అదేవిధంగా 5లక్షల ఎక్స్ గ్రేశియా ఇవ్వాలని కూడా వుంది.

రెండు సంవత్సరాల క్రితం సింగరేణిలో విధులు నిర్వహిస్తూ ప్రమాద వశాత్తు కార్మికులు చనిపోతే కార్మికుల నుంచి 10లక్షల రూపాయలు విరాళంగా జమ చేస్తే యజమాన్యం మ్యాచింగు గ్రాంట్ గా మరో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒప్పందం అయింది. అయితే సింగరేణి సీఎండి మాచింగ్ గ్రాంటును ఎక్స్ గ్రేశియాగా ప్రకటించి తప్పుదారి పట్టిస్తున్నారు.
2003లో గోదావరిఖనిలో జరిగిన ప్రమాదంలో కార్మికులు చనిపోతే తెలంగాణ రాష్ట్ర సమితి, దాని అనుబంధ కార్మిక సంఘం నేతలు అప్పటి ముఖ్యమంత్రి కాన్వాయిని అడ్డుకుని డిమాండు చేస్తే జాతీయ స్థాయి ఒప్పందం ప్రకారం ఇచ్చే ఎక్స్ గ్రేశియా, మాచింగ్ గ్రాంట్ తో పాటు తలా కుటుంబానికి 6లక్షల ఎక్స్ గ్రేశియా ప్రకటించారు.

సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ కోసం ఉద్యమించారు. సకల జనుల సమ్మెలో ముందుపీఠిన నిలబడ్డారు.
మరి ఈ కార్మికుల పట్ల, ఈ కార్మికుల చావుల పై చూపే సానుభూతిలో ఈ వివక్ష ఎందుకు. ఏలిన వారు ఇకనైనా ఆలోచిస్తారా?
-హెచ్.రవీందర్, మందమర్రి.

Keywords : singareni, coal mines, telangana, workers, death, accident, media, latest news, TRS
(2024-04-11 19:42:58)



No. of visitors : 2939

Suggested Posts


యాగాల తెలంగాణనా? పోరాటాల, త్యాగాల తెలంగాణనా? - ఎన్.వేణు గోపాల్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అయుత మహా చండీ యాగం జరపడం, ఆ యాగం ప్రభుత్వ కార్యక్రమం లాగ, తెలంగాణ కార్యక్రమం లాగ జరగడం చాల ప్రశ్నలకు చర్చకు ఆస్కారం ఇస్తుంది.....

కేసీఆరే కాదు చంద్రబాబు కూడా సిగిరెట్ తాగారు -ఫ్యాన్స్ ఫోటో షాప్ యుద్దం

కేసీఆర్ , చంద్రబాబులు బహిరంగంగా సిగిరెట్లు తాగారా ? సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరు నాయకులు సిగిరెట్ తాగే ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి......

రోహిత్, కన్హయ్య ల గురించి కేసీఆర్ ఏమన్నాడంటే....

రోహిత్ వేముల ఆత్మహత్య అనంతర పరిణామాలు, జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్...

ఈ సారికి చీప్ లిక్కర్ లేనట్టే !

ఈ సంవత్సరం చీప్ లిక్కర్ ప్రవేశపెట్టడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. చీప్ లిక్కర్ కు సంభంధించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయని కాబట్టి దానిపై ఇంకా చర్చజరగాల్సి ఉందని భావిస్తున్నామని....

మెంటల్ హాస్పెటల్ కు అసెంబ్లీ

రాష్ట్ర సచివాలయాన్ని చెస్ట్ ఆస్పత్రి లోకి శాసనసభ, శాసనమండలి ని ఎర్రగడ్డ మానసిక వికలాంగుల ఆస్పత్రి ( మెంటల్ హాస్పటల్) స్థలం లోకే మార్చాలని ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది....

మంత్రిగారి హోలీ డ్యాన్సులకు 30 టాంకుల నీళ్ళు వృథా !

ఎండాకాలం ప్రారంభంలోనే హైదరాబాద్ ప్రజలు నీటికోసం కోటి తిప్పలు పడుతూంటే మంత్రిగారికి మాత్రం అదేమీ పట్టలేదు. తన హోలీ సంబురాలకోసం 30 టాంకుల నీళ్ళను....

ప్రభుత్వ చర్యలకు నిరసనగా కోఠి మార్కెట్ బంద్

మెట్రో అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన స్థానిక వ్యాపారస్తులకు టీఆర్‌ఎస్ పార్టీ మద్ధతుగా నిలిచింది. అంతేకాదు స్థానికులు చేపట్టిన ఆందోళనలో ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె ఎంపీ కవిత కూడా పాల్గొని వారికి బాసటగా నిలిచారు. ఇప్పుడు సీన్ మారింది అదే అలైన్ మెంట్ కు టీఆరెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.....

రోహిత్, కన్హయ్య ల గురించి కేసీఆర్ ఏమన్నాడంటే....

రోహిత్ వేముల ఆత్మహత్య అనంతర పరిణామాలు, జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్...

CM KCR రైతు ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి - కేసీఆర్ డిమాండ్

రైతు ఉద్యమం సందర్భంగా వేలాది మంది రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. ఇవ్వాళ్ళ (శనివారం) హైదరాబాద్ లోని టీఆరెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మా