వెలివాడ‌ - వ‌ర‌వ‌ర‌రావు క‌విత


వెలివాడ‌ - వ‌ర‌వ‌ర‌రావు క‌విత

వెలివాడ‌

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది
వాడ అంటే వెలివాడ‌నే
అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌
అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది
ఇప్పుడ‌ది ఇంతింతై వ‌టుడింత‌యై అన్న‌ట్లుగా
అమ‌రావ‌తికి సైబ‌రాబాద్‌కూ ఢిల్లీకి ఎగ‌బాగి
పార్ల‌మెంటును న్యాయ‌స్థానాల‌ను ఉన్న‌త విద్యాల‌యాల‌ను
ఆవ‌రించింది
ఇప్పుడు దానికి ప్ర‌పంచ బ్యాంకు అప్పు గొడుగు ప‌ట్టింది

వాడ‌లో మాల మాదిగ‌ల‌కు
కోలాటాలు బాగోతులు చిర్ర‌న చిట‌కేసే డ‌ప్పులూ
తెల్ల‌వార్లూ దుఃఖాల‌ను గాయాల‌ను మ‌రిపించే
పాట‌లు ఆట‌లుండే స్థ‌లాలుండేవి
కీలవేణ్మణి వ‌లే గుడిసెల‌ను మ‌నుషుల్ని కాల్చేస్తే
ఆ వెలివాడ‌లైనా మిగిలేవి

యూనివ‌ర్శిటీల్లో వెలివేత‌లున్న‌ప్పుడు
వెలివాడ‌లుంటాయిగ‌దా
బ్రాహ్మ‌ణ ప్రొఫెస‌ర్ల‌కు వాళ్లుగా త‌వ్వించుకున్న
మంచినీళ్ల బావులున్న‌ట్లుగా
వీసీ లాడ్జిలు రాజ‌భ‌వ‌న్‌లు ఉన్న‌ట్లుగా
వాళ్ల‌కూ రోహిత్ వేముల వేదిక‌లుంటాయి గ‌దా

ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మ‌రుగుజ్జుగా మ‌రిపించే
సంఘ్ ప‌రివార్‌ ముద్దుబిడ్డ అప్పారావు
రోహిత్ వేముల వేదిక‌ను కూల్చేస్తాడ‌ట‌
వెలివాడ‌ను ధ్వంసం చేస్తాడ‌ట‌
అంట‌రాని ప్ర‌తిభాశాలుర‌ను ఆత్మ‌హ‌త్య‌లు చేసి
అంటుకున్న మంట‌ల వేదిక‌ను ఆర్పేస్తాడ‌ట‌
క‌ద‌లండి ఎదిరించండి

Keywords : varavararao, hindutva, hcu, jnu, delhi, revolution, rohit vemula
(2018-12-09 00:52:48)



No. of visitors : 1029

Suggested Posts


0 results

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
more..


వెలివాడ‌