మల్లన్నసాగర్‌లో మునిగేదెవరు?

మల్లన్నసాగర్‌లో

(బి. రామకృష్ణ రాసిన ఈ వ్యాసం వీక్షణం జూలై 2016 సంచికలో ముద్రించబడినది)


మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కోసం ముంపునకు గురికాబోతున్న గ్రామాలను 2016, జూన్‌ 11న ʹవీక్షణంʹ మాసపత్రిక సంపాదకవర్గం సందర్శించింది. ప్రజలతో మాట్లాడి అక్కడి వాగు, చెరువులను పరిశీలించడం జరిగింది. ఏడాదికి రెండు పంటలు పండించే భూములను చూశాం. ఏటిగడ్డ కిష్టాపూర్‌ వాగులో, కోమటి చెరువులో ఇంత కరువు కాలంలో కూడా నీళ్లు ఉండడం విశేషం. వాగు పక్కన నాలుగైదు గజాల లోతులో తవ్విన బావుల్లో నీళ్లుండడం గమనించాం. ఆ గ్రామాల భూముల్లో వంద ఫీట్ల లోతుల్లోనే నీళ్లుండడం మూలంగా ఏడాదికి రెండుపంటలు, వీలున్నవారు మూడు పంటలు తీస్తున్నారు. ఇక్కడ పొలాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పండిస్తుంటారు. ఇంత చక్కటి పంట పొలాలు, నీరున్న గ్రామాలను ముంచడానికి చేతులెట్లా వస్తారుు అనిపించింది. శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ముంపుకు లోనయ్యే కుటుంబాలతో పాటు మరెందరికో మేలు చేస్తుందని నిరూపించబడి అత్యధిక సామాజిక ప్రయోజనాలను నెరవేర్చగలిగితే అది వేరే విషయం.

అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన ప్లాన్‌కు భిన్నంగా ప్రాణహిత-చేవెళ్ల నీటి పారుదల ప్రాజెక్టులో మార్పులు చేయడం మూలంగా మెదక్‌ జిల్లా తొగుట మండలంలో 11, కొండపాక మండలంలో 10 చిన్న, పెద్ద గ్రామాలు మొత్తం 21 గ్రామాలు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కోసం బలికాబోతున్నారుు. బ్రాహ్మణ బజరపల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్‌, తిరుమలగిరి, మొగుళ్లచెరువు తండా, వేములగట్టు, తురక బజరపల్లి, పల్లెపహాడ్‌, దస్తగిరినగరం, తిప్పారం, సిగరం, ఎర్రవల్లి, మంగోల్‌, కాశెగుడిసెలు, కోనాయపల్లి, వడ్డెరకాలనీ గ్రామాలు ఇండ్లతో సహ మొత్తం మునిగి పోనున్నారుు. తుక్కపూర్‌, తొగుట, ఎల్లారెడ్డిపేట, మాతపల్లె, మేద్నిపూర్‌, ముద్దారం గ్రామాల భూములు మునిగిపోనున్నారుు. మొత్తంగా 3,112 ఇండ్లు, 20,079.16 ఎకరాల వ్యవసాయ భూములు కనుమరుగు కానున్నారుు. బతుకులు చిధ్రమవుతూ, ఉపాధి ఎలా, జీవనాధారం ఏమిటి అనే అభద్రత, అయోమయం, గందరగోళంలో ముంపుగ్రామాల కుటుంబాలు బంగారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే షాక్‌లతో సతమతమవుతున్నారుు.

ʹబంగారు తెలంగాణ అని మురిపించి మా నోట్లో చక్కెర పోసిండ్రు. దమ్ము తీయకుండా పోసిండ్రు. మా ఊర్లను, పంట భూములను ముంచి మమ్మల్ని వెళ్లగొట్టే పని చేస్తుండ్రు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా?ʹ, ʹʹనాకు భూమి లేదు, కూలి నాలి చేసుకుని ఊరి వారి సహాయ సహకారా లతో బతుకుతున్నా. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు వస్తే ఈ గ్రామం మొత్తం మునిగిపోతుంది. అప్పుడు మాలాంటి వాళ్ల బతుకులేం కావాలి?ʹʹ అని ప్రశ్నిస్తున్న ఎర్రవల్లి గ్రామ రైతుకూలి ఆవేదనకు సమాధానమేది?

ʹʹపట్టా భూమి ఎకరాకు మీరిచ్చే 5.8 లక్షలు, సమీపంలో ఉన్న ప్రజ్ఞాపూర్‌ వద్ద కనీసం వందగజాల ఇల్లు స్థలం కొనడానికి కూడా సరిపోవు. మరి ఇల్లు కట్టుకొనేదెలా? బతుక్కోసం వ్యవసాయ భూమి సంగతేమిటి?ʹʹ అని ప్రశ్నిస్తున్న ఎర్రవల్లి గ్రామ రైతు ఆవేదనకు బదులేది?

ʹʹతీవ్రమైన కరువున్న నేటి పరిస్థితుల్లో సహితం మా ఊళ్లో నీటికి కరువులేదు. ఏటా రెండు పంటలు పండించుకుంటున్నాం. ఎవరి కండ్లు మా ఊళ్లపై పడ్డాయో. తడకపల్లి నుండి రూటు మారి ఈ ప్రాజెక్టును మా ఊళ్ల దిక్కు మళ్లిస్తున్నారు. పచ్చని పొలాలతో, వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలను పండించుకుంటూ మా బతుకేదో మేం బతుకుతుంటే, మల్లన్నసాగర్‌ మా జీవితాలను నిలువునా ముంచేయడం ఎలా సరైనది అని ప్రశ్నిస్తున్న ఏటిగడ్డ కిష్టాపూర్‌, వేముల గట్టు గ్రామాల ప్రజల ఆవేదనలకు, రోదనలకు సమాధానం ఏది?ʹʹ

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు వద్దని వేములగట్టు గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసి వందలాది గ్రామస్థుల సంతకాలతో ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దానిపై స్పందనేది?

ʹʹఅధునాతన పద్ధతులతో ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీతో, ఇజ్రారుుల్‌ తరహా పద్ధతులని, పాలిహౌజ్‌లలో లాభదాయకంగా వందెకరాల్లో పంటలు, కూరగాయలు పండించడం, పనిలో పనిగా ఆ వ్యవసాయక్షేత్రం విడిది కేంద్రంగా, రిసార్ట్‌గానూ, పచ్చటి పొలాలతో ఆహ్లదంగానూ, ఆనందం గానూ ఉండడం అందులో గడుపుతూ తరించడం ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. దీనికోసం పెట్టిపుట్టాలి. ఆ భాగ్యం మాకులేదు. అంతేసి డబ్బులూ మా దగ్గరలేవు, అన్నేసి ఎకరాలూ మావద్ద లేవు. బ్యాంకులు అంతేసి డబ్బులు మాకు ఇవ్వవు. ఇచ్చినా మేం చెల్లించలేం. భూతల్లి కరుణతో, భూగర్భ గంగమ్మ చలువతో ఉన్నంతలో బతుకుతున్నం. ఈ మాత్రం బతుకులనూ లాగేసుకోవడానికి యమధర్మరాజులు మల్లన్నసాగర్‌ యమపాశాన్ని మాపైకి విసురుతుండడాన్ని ఎలా జీర్ణించుకోవాలిʹʹ అని ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలేవి?

3,112 ఇండ్లను, అందులో నివసిస్తున్న 10 నుండి 15 వేల మందిని బజారున వేసే ఈ రిజర్వాయర్‌ ఎవరి కోసం? దీనిలో 50 టీఎంసీల నీరును నిలువచేస్తామంటున్నారు కదా! ఈ నీటిలో మాకేమైనా వాటా ఉంటుందా? ఈ నీటితో మేం వ్యవసాయం చేసుకోవచ్చా? ఈ నీటి కోసం మేం కోల్పోయే భూములకు బదులుగా ఈ నీటి ద్వారా పండించుకునే భూములను ఎక్కడైనా ఇప్పిస్తారా? అది మీ బంగారు తెలంగాణ ఎజెండాలో ఉన్నదా? మేం కోల్పోయే ఇళ్లు పెంకుటిల్లో, మట్టిగోడలో ఏవైనా కావచ్చు. అవి మా జీవనంలో భాగం వాటిని మళ్లీ ఎక్కడ కట్టుకోవాలి? అని ప్రజలు వేసే ప్రశ్నలకు జవాబులేవి?

ʹసరే మేం మా గ్రామాలకు గ్రామాలనే త్యాగం చేస్తాం. ఈ త్యాగాలు ఎవరి వెలుగుల కోసం? ఆ వెలుగుల్లో మేమెందుకు కనిపించకూడదు? మా కాలికి ముళ్లు గుచ్చుకుంటే నీ పంటితో తీస్తానని ఆత్మీయంగా మా కడుపునిండేటంత మాట చెప్పావు కదా! ఇప్పుడు మేమేం పాపం చేసుకున్నాం?ʹ అని అడిగే రైతుకు ఏం సమాధానం చెబుతారు?

ʹʹమీరిచ్చే పరిహారం వంద, వందాయాభై గజాల ఇంటి జాగానిస్తారుు కావచ్చు... అదీకూడా కష్టమే. ఇంకా మహా అరుుతే ఆ జాగాలో ఇళ్లు కట్టుకుంటాం కాబోలు, ఆ సొమ్ము ఒకటి, రెండేళ్లు మురిపిస్తుంది కావచ్చు. ఆ తరువాత మా బతుకుల సంగతేంటి? చేతిలో పైసా లేక.... చేసుకునేందుకు కన్నతల్లి లాంటి వ్యవసాయ భూమి లేకా... పంటలు లేకా... ఉపాధి లేకా.... కరువంటే తెలియని మాకు తిండికి కరువు అవ్వడం మీకు మంచిగనిపిస్తున్నదా?ʹʹ అని బతిమాలుతున్నట్లుగానో, ఆవేదనతోనో, ఆవేశంతోనో, ధీనంగానో వేడుకుంటున్న ముంపుకు గురయ్యే 14 గ్రామాల ప్రజలకు ఎలా సర్ది చెబుతారో దళపతులు, అధిపతులు, రాష్ట్రాధిపతులు.

భూసేకరణ చట్టం - 2013 ప్రకారం

ప్రాజెక్టు నిర్మించేటప్పుడు దానివల్ల ఏర్పడే ప్రభావాన్ని తెలుసుకోవ డానికి సామాజిక ప్రభావ అంచనా (సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ - ఎస్‌ఐఎ)ను చేపట్టాలి. ఈ అధ్యయనంలో భాగంగా ప్రభావితమయ్యే గ్రామాల గ్రామపంచారుుతీ / గ్రామసభల్లో చర్చ జరగాలి. పర్యావరణ నష్టం, ప్రజలకు జరిగే లాభనష్టాలు మొదలగునవి ఎన్నింటినో అంచనా వేయాలి. తరువాత సామాజిక, ప్రభావ అంచనాను ఎక్స్‌పర్ట్‌ కమిటి మూల్యాంకనం చేసి భూసేకరణ చేపట్టడం సమంజసమా కాదా అని తెలపాలి. దీన్నంతా పారదర్శకంగానే నిర్వహించాలి. వీటి వివరాలు అందరికి అందుబాటులో ఉంచాలి.

నీటి వసతులున్న బహుళ పంట భూములను సేకరించరాదు. విధిలేని పరిస్థితుల్లో తప్పనిసరైతే తప్ప చిట్టచివరి అవకాశంగా మాత్రమే సేకరించవచ్చు. అది కూడా జిల్లా, రాష్ట్ర మొత్తంలో నిర్ధారిత వ్యవసాయ భూపరిమితికి లోబడి ఉండేలా చూడాలి. ఒకవేళ ఇటువంటి భూములను సేకరిస్తే దానికి సమానమైన బీడు భూములను వ్యవసాయ భూములుగా చేయాలి. లేదా ఆ భూమికి సమానమైన విలువ మొత్తాన్ని ప్రభుత్వం జమచేసి దాన్ని ఆహార భద్రతను పెంచడం కోసం వ్యవసాయంలో పెట్టుబడిగా పెట్టాలి.

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో వ్యవసాయ భూములు కోల్పోరుున భూ స్వంతదారులకు ప్రాజెక్టు కమాండ్‌ ప్రాంతంలో కనీసం ఒక ఎకర భూమిని కేటారుుంచాలి. ఎస్సీ, ఎస్టీలకైతే వారు కోల్పోరుున భూమితో సమానమైన లేదా గరిష్టంగా 2.5 ఎకరాలు కేటారుుస్తారు.

భూసేకరణకు పరిహారంగా పున:స్థాపితం గావించబడే కుటుంబాలకు మౌలిక వసతులు కల్పించాలి. రోడ్లు, డ్రైనేజీ, సురక్షిత మంచి నీరు, పశువులకు తాగే నీరు, పశువులను మేపుకునేటందుకు భూములు, రేషన్‌ షాపులు, పోస్టాఫీస్‌లు, రవాణా వసతులు, స్మశానవాటికలు, విద్యుత్‌ సరఫరా, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రం, పిల్లలకు ఆటస్థలం, కమ్యూనిటీహాల్‌, పశుసేవాసంస్థ, సరైన భద్రతా యంత్రాంగం మొదలగునవి భూసేకరణదారు కల్పించాలి. ఇవేవి నీటిపారుదల మంత్రి గాని, తెలంగాణ ప్రభుత్వాధినేత గాని మాట్లాడడంలేదు. వీటి గురించి ప్రస్తావనలు లేకుండా జిఒ123ను తెచ్చి బాధితుల నుండి రాతపూర్వకంగా వారు స్వచ్ఛందంగానే భూములు వదులుకుంటున్నామని ఒప్పంద పత్రాలు తయారు చేశారు. ఈ ఒప్పందంపై సంతకం పెడితే భవిష్యత్‌లో ఈ భూముల కోసం కోర్టులకు పోను వీలు లేకుండా జిఒ123 ను తయారు చేశారు. జిఒ123లో మరిన్ని ప్రజా వ్యతిరేక మార్పులు చేస్తూ జిఒ190, జిఒ214 లను తెచ్చారు. పునరావాసం అంటే ఏమిటి? ప్రాజెక్టుల వల్ల నష్టపోతున్న బతుకులకు బరోసాగా, నమ్మకమైన, భద్రమైన ప్రత్యామ్నాయ జీవికను అందివ్వడమే కదా. అధికారికంగా అలాంటి వివరాలు లేవు. అటువైపు ప్రభుత్వ ప్రయత్నాలు లేవు.

ముంపును వ్యతిరేకిస్తున్న క్రమంలో ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఇద్దరు యువకులను తొగుట పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకున్నారు. మల్లన్నసాగర్‌ ను వ్యతిరేకిస్తూ ʹగిరారుుపల్లి దళంʹ పేరుతో రెండు పోస్టర్లు వేయబడ్డాయని వాటిని వీరే వేశారని తీవ్ర చిత్రహింసలపాలు చేశారు. చేయని దానికి బాధ్యులను చేసి లాఠీలతో, రబ్బర్‌లతో కొట్టడం జరిగింది. పోస్టర్లలోని రాతలు మీ రాతలు ఒకటేనా తెల్సుకుంటామని వీరితో అవే పోస్టర్లను రారుుంచి, తిరిగి వాటిని గ్రామంలో అంటించారని తెల్సింది. ఆ తరువాత వీరిద్దరిపై 124-ఎ సెక్షన్‌ ప్రకారం రాజద్రోహనేరం మోపి జైలుకు పంపించారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తే రాజద్రోహనేరం అవుతుందా? పోలీసులు ఇలా చట్టాలకకు తమకు నచ్చిన రీతిలో వక్రభాష్యం చెబుతున్నారు. అసలు పోస్టర్లను ఆ ఇద్దరు యువకులు వేయనేలేదు. వాటిని కుట్రపూరితంగా, కావాలనే ఎవరు వేరుుంచారో, ఎందుకు వేరుుంచారో అర్థం చేసుకోవడం కష్టమైన పనేం కాదు. ఈ యువకుల నిర్బంధం, వారిపై టార్చర్‌, రాజద్రోహం కేసుపెట్టి జైలుకు పంపడంపై స్థానిక ఎమ్మెల్యే గాని నీటి పారుదలశాఖామంత్రి గాని స్పందించలేదని తెలిసింది. ఈ ఘటన దేనికి సంకేతం? భవిష్యత్‌లో ముంపు బాధితుల నిరసనలకు ప్రభుత్వం ఇచ్చే జవాబును ఇది సూచిస్తుందా?

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ఎవరెవరికి మేలు చేస్తుంది? దాని వల్ల భూములు, ఇళ్లు కోల్పోతున్న ప్రజలకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చుతారు? దాని నిర్మాణఖర్చు, పర్యావరణ నష్టం ఎంత? నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌లోకి ఆదిలాబాద్‌లోని ప్రాణహిత నుండి వచ్చే నీరెంత? నిజంగా 50టీఎంసీల నీరు వస్తుందా? ఈ రిజర్వాయర్‌ వల్ల పరిసర ప్రాంతాలకు ఒనగూరే ప్రయోజనమెంత? మొదలగునవన్నీ అధ్యయనం చేస్తే తప్ప నికర మేలు తేలదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలతో కూడిన నివేదిక (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ - డిపిఆర్‌) లేనేలేదు. ఈ రిపోర్టు లేకుండా ముందుకెళ్లడం అంటే అర్థం ఏమిటి? ఎంతసేపటికీ ఎకరాకు 5.8 లక్షలు పరిహారం ఇస్తామని, 14 గ్రామాల ప్రజలను భూములు వదులుకోమని వత్తిడి తెస్తున్నారు. అసలు మల్లన్నసాగర్‌ నిర్మాణం న్యాయబద్దత ఎంత అనేది తేలవల్సి ఉన్నది.

(బి. రామకృష్ణ రాసిన ఈ వ్యాసం వీక్షణం జూలై 2016 సంచికలో ముద్రించబడినది)


(రచయిత ఉపాధ్యాయులు)

Keywords : mallanna sagar, protests, telangana, kcr, trs, project
(2024-03-10 14:18:07)



No. of visitors : 3042

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మల్లన్నసాగర్‌లో