దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి


దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

దుఃఖమూ

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే. మాట్లాడుకోడానికి సందర్భాన్నిచ్చిన బుర్హాన్ గురించే మొదట మాట్లాడుకోవాలి. ఈలోగా 42 మంది నిరాయుధులను కాల్చి చంపుతుంది సైన్యం. నిరసనకారుల మీద పెల్లెట్ల వర్షం కురుస్తుంది. చంపకుండానే శరీరాన్ని జల్లెడ చేసే ఆయుధాలు ప్రయోగిస్తున్నారక్కడ. వంద మంది చూపు కోల్పోయి, వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయాలపాలై ఆసుపత్రులు నిండుతుంటాయి. ఆంబులెన్స్ ల మీద, ఆసుపత్రుల మీదా సైన్యం దాడులు చేస్తుంది. ఇరాక్, పాలస్తీనా కోసం కవిత్వం రాసిన వాళ్ళు ఏమైపోయారు? అది సరే.. ఇదంతా రిపోర్టు చేస్తున్న దిన పత్రికల మీద, ప్రింటింగ్ ప్రెస్సుల మీద అర్ధరాత్రి దాడి జరుగుతుంది. పాత్రికేయులను అరెస్టులు చేస్తారు. అంతకు ముందుగానే ఇంటర్నెట్ బందై ఉంటుంది. ఫోన్లు పనిచేయకుండా చేస్తారు. భావప్రకటనా స్వేచ్ఛ గురించి ఎవరు మాట్లాడతారు?

స్వయంగా కశ్మీరీ అయిన జె.ఎన్.యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ ను తమకు బుర్హాన్ అంటే ఏమిటో చెప్పినందుకు వెంటనే అరెస్టు చేయాలని సంఘపరివార్ హుంకరిస్తుంది. అసలు కశ్మీరీలకు బుర్హాన్ ఏమిటో మనకు ఎప్పటికైనా అర్థమవుతుందా? అతని ఆజాదీ, అది కూడా పాకిస్తాన్ అనుకూల ఆజాదీ భావనతో సహా మన దేశభక్తి అహం అడ్డం పడకుండా మనకు బుర్హాన్ అర్థం అవుతాడా?

పదహారేళ్ళ ప్రాయంలో తుపాకిని ముద్దాడి, ఇరవై రెండో ఏడు చావును కౌగిలించుకున్నాడతడు. అతన్ని ఇండియా తీవ్రవాది అని కాక ఇంకేమంటుంది గాని, కశ్మీర్ లోయ మాత్రం అతన్ని పోరాటయోధుడంటుంది. షహీద్ అంటుంది. అతనే కాదు, భారత ప్రభుత్వం చంపిన ప్రతి ఒక్క కశ్మీరీ ʹతీవ్రవాదిʹ అక్కడి ప్రజలకు హీరోయే. బుర్హాన్ వాని కశ్మీరీలకు హీరో ఎందుకయ్యాడని భారతదేశ మీడియా విచిత్రమైన ప్రశ్న వేస్తుంది. అతని తండ్రి అంటాడు, ʹనిష్కారణంగా దావనపోయే వాడ్ని పట్టుకొని మిలిటరీ వాళ్ళు కొట్టారు, ఆత్మగౌరవంగలవాడు, ఆవేశపరుడుʹ అని. మిలిటరీ చేతిలో కశ్మీర్ కు చెందిన ప్రతి ఒక్కరికీ ఇటువంటి అనుభవాలున్నాయి. నిజానికి ఇది చాలా చిన్న విషయం. అసలు విషయం భారత పాలకవర్గం చేతిలో బందీ అయిన కశ్మీర్, దాని ఆజాదీ. దురాక్రమణకు, వంచనకు, హింసకు లొంగని ఆజాదీ ఆకాంక్ష. వేలాది ప్రాణాలు తీసినా, సామూహిక అత్యాచారాలు చేసినా, మనిషి మనిషికో తుపాకి గురిపెట్టినా అణచిపెట్టలేని ఆజాదీ భావన. ఒట్టి రాళ్ళతోనే తుపాకులను ఎదిరించే తెగింపు. ఆరేళ్ళ క్రితం నిరసన ప్రదర్శనల్లో సైన్యం మీదికి రాళ్ళు విసురుతూ తూటాలకు ఒరిగిన రెండు వందల మంది యువకులు గుర్తొస్తారు. కొద్ది నెలల క్రితం సైన్యం లైంగికంగా వేధించిన బాలిక కోసం వీధుల్లోకొచ్చి చచ్చిపోయిన వాళ్ళు, ఊరికే దారిన పోతే గుళ్ళకు ఒరిగిపోయిన వారు గుర్తొస్తారు.

కశ్మీర్ భూభాగమే కావాలి, అక్కడి మనుషులు కాదు- అని ప్రవర్తించే భారతదేశం యావత్తూ, కశ్మీరీల పోరాటాన్ని పొరుగు దేశపు కుట్రగా కొట్టిపడేస్తుంది. ఇండియా దేశభక్తి కశ్మీర్ ప్రజల అణచివేతతో ముడిపడి ఉంటుంది. ఏ ప్రజాస్వామిక చర్చకూ ఆస్కారం లేదు. నిరసనల పట్లనే కాదు, శవయాత్రల పట్ల కూడా కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఉదాహరణలు కోకొల్లలు. భారతదేశంలో ఒక ముస్లిం దేశభక్తి మీద అనుమానం ఉంటుంది. ఒక కశ్మీరీ అయితే సందేహం అక్కర్లేని దేశద్రోహి, శత్రువు. అవమానాలు, అనుమానాలు, ఊల్లన్నీ జైల్లు, హింస, అణచివేత మధ్య కనీస సంఘీభావం కరువవుతుంది.

ఇటువంటి స్థితిలో బుర్హాన్ వంటి వాళ్ళు కశ్మీర్ ఆజాదీకి, ఆత్మగౌరవానికి వ్యక్తీకరణ అవుతారు. బుర్హాన్ అయితే అజ్ఞాత జీవితంలోనూ ముసుగు లేకుండా మీడియాలో కనపడేవాడు. సోషల్ మీడియాలో అతను ఆజాదీకి, ఆత్మగౌరవానికి ప్రతీక. చచ్చిపోయినా ఫరవాలేదు, తలెత్తుకుని నిలబడాలంటాడు. ఇటువంటి చావు స్వర్గానికి దారి వేస్తుందంటాడు. వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు అనే వాళ్ళు, ఇస్లాం ఛాందసత్వంలో పడిపోతున్నారని జాలిపడేవాళ్లు కశ్మీరీల విషయంలో ప్రజాస్వామ్యం ఎంత ఘోరంగా విఫలమైందో చూడగలరా?

ఎవరి ప్రజాస్వామ్యం ఎంతో కశ్మీర్ విషయంలో తేలిపోతుందనుకుంటాను.
తాజాగా హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు కశ్మీర్ పై మీటింగ్ పెట్టారు. షరా మామూలుగా ఎబివిపి క్యాంపస్ అంతా వీరంగం ఆడింది. అది కూడా రోహిత్ మృతికి కారణమైన సుశీల్ కుమార్, బిజెపి నాయకుడైన అతని సోదరుడి నాయకత్వంలో. అమోల్ సింగ్ అనే విద్యార్థిని దొరకబుచ్చుకుని ఆసుపత్రి పాలయ్యేలా తీవ్రంగా కొట్టారు. మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ దగ్గరి నుండి కశ్మీర్ వరకు దేశభక్తి వర్సెస్ ప్రజాస్వామ్యం చర్చ జె.ఎన్.యూ విషయంలో ఎట్లా జరిగిందో చూశాం. ప్రతిపక్షాలు మొదలుకొని వామపక్షాల వరకూ ఏం మాట్లాడారో చూశాం

- పి.వరలక్ష్మి, విప్లవ రచయితల సంఘం

Keywords : kashmir, burhan vani, virasam, miletery, modi, hindutva, police
(2020-07-01 00:56:21)No. of visitors : 2141

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

Search Engine

పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
మహారాష్ట్ర సీఎంకు 14మంది ఎంపీల లేఖ‌ - వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన
14 MPs sought better treatment for varavara rao...wrote a letter to Maha CM
CRPF దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసులు
more..


దుఃఖమూ