చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ


చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

చలసాని

ఔను సారూ
మీరింకా మా భుజంపై గట్టిగా చరుస్తూ
నవ్వుతూ హత్తుకున్నట్టే వుందింకా
అరిగిపోయిన బాటా చెప్పులతో
దేరువాడ ఏరియాలో 1/70 ఏక్టు అమలుకోసం
గిరిజనులతో ర్యాలీ చేస్తున్నట్టుంది
బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను
స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది
సారూ జోరువానలో కాలు జారిపోతున్నా
తెగిపోయిన చెప్పులతోనే కోపర్ డంగ్ కొండ
ఒక్క ఉదుటున ఎలా ఎక్కేసారు?
మా నాలుక తిరగని రష్యా రచయితల
పేర్లన్నీ పేపరయినా చూడకుండా
ఆ సాహిత్యాన్నంతా అర్థమయ్యేటట్లు ఆలవోకగా
చెప్పే మీ జ్ఞాపకశక్తికి జోహార్లు సారూ
ఇంకా మీరెత్తినాం విరసం జెండా
అలలలుగా పోరు పోరు జెండా
అని మీకే సాధ్యమయిన లయలో
గొంతెత్తి పాడుతున్నట్టే వుంది సారూ
చెరగని మీ నవ్వు
ఎప్పుడూ నవ్వే ఆ కళ్లు
ఆత్మీయంగా దగ్గరకు తీసుకునే మీ చేతులు
నాలుగు వాక్యాలకే నిండిపోయే పోస్టుకార్డు
మరపురాకున్నాయి సారూ
విశాఖ సముద్రమంత మీ
హృదయం
మాకింకా బువ్వపెడుతున్నట్టే వుంది
ఒక్క మాటయినా చెప్పకుండా
వెళ్ళిపోయారన్న దిగులు
గూడుకట్టుకునే వుంది సారూ...

- కే.కుమార్ వర్మ

Keywords : virasam, chalasani prasad, srikakulam, visakhapatnam, martyr
(2018-12-10 20:21:30)



No. of visitors : 1499

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ప్రజల కోసం సముద్రం వలె గర్జించిన తారకం - విరసం

తండ్రి దళిత ఉద్యమ వారసత్వాన్ని చిన్న వయసు నుండే స్వీకరించిన తారకం గారు సాంస్కృతిక కార్యకర్తగా, విద్యార్థి ఉద్యమకారుడిగా తన సొంతవూరిలో దళిత యువకుల్ని సంఘటితం చేశారు. వర్గపోరాట రాజకీయాలతో ప్రభావితమై విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనారు....

తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దొరల పాలన నడుస్తోందని విరసం నేత వరవరరావు ధ్వజ మెత్తారు. నల్లగొండలో జరుగుతున్న డీటీఎఫ్‌ విద్యా వైజ్ఞానిక నాలుగో రాష్ట్ర సభలు సోమవారం ముగిశాయి. చివరిరోజు ముఖ్యఅతి«థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌సహా ఆ నాలుగు కుటుంబాలు మాత్రమే ప్రయోజనం పొందాయన్నారు.....

Search Engine

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
more..


చలసాని