సంస్కృతి రక్షకులమనే ఫోజు - అమ్మాయి పై రేప్ ప్రయత్నం

తాము నీతి మంతులమని, సంస్కృతి రక్షకులమని ఫోజులు కొడుతూ ఓ అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించిన ఓగుంపు దుర్మార్గమిది. ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ కు చెందిన ఓ బావామరదళ్ళ జంట గురువారం నాడు నైనిటాల్ దగ్గర్లో గల రామ్‌నగర్‌లోని గిరిజా మందిరాన్ని దర్శించుకోడానికి వెళ్లారు. అక్కడ దర్శనం పూర్తి అయ్యాక దగ్గరలో ఉన్న సరస్సువద్ద కాలక్షేపం చేయడానికి వెళ్లారు. అక్కడే మద్యం మత్తులో ఉన్న ఓ ఆరుగురి గుంపు వీరిని గమనించింది. వీళ్ళ దగ్గరికి వచ్చి గద్దించారు. ఇలా తిరగడం తప్పని బెదిరించారు. ఇదేనా భారత సంస్కృతి అంటూ ఆవేశంతో ఊగిపోయారు. వారిద్దరితో గొడవకు దిగారు. వారి మీద దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. అబ్బాయిని నీటిలో ముంచి చంపే ప్రయత్నం చేశారు. అమ్మాయిని పక్కనే ఉన్న అడవిలోకి లాక్కెళ్ళి అత్యాచార ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సకాలంలో చేరుకున్న పోలీసులు దుండగుల బారి నుంచి ఆ జంటను కాపాడారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దుండగుల వేధింపులు ఎవరో కెమెరాలో చిత్రీకరించడంతో పోలీసుల పని సులువయింది.

Keywords : Rape, Uttarakhand, Nainital, Couple, Arest
(2024-03-09 10:15:03)



No. of visitors : 2461

Suggested Posts


మహాత్ముడైన రేప్ నిందితుడు - పాఠం భోధిస్తున్న టీచర్లు

అక్కడ పిల్లలకు స్కూళ్ళలో మహాత్ముల గురించి భోధిస్తారు.... అందులో తప్పేం ఉంది ? రామకృష్ణపరమహంస, వివేకానంద, మహాత్మా గాంధీ, మదర్ తెరిసాల గురించి భోధిస్తారు... వీళ్ళగురించి చెప్పకూడదా ? వీళ్ళతో పాటు.....

ఆ అక్కాచెల్లెళ్ల‌ను రేప్ చేయండి...అగ్ర‌కుల పంచాయ‌తీ తీర్పు !

బుస‌లు కొడుతున్న ఉగ్ర‌కుల ఉన్మాదం ద‌ళితులపై, స్త్రీలపై చేస్తున్న అమానుషాలు స‌భ్య‌స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకునేలా ఉన్నాయి. అగ్ర‌కుల అమ్మాయిని ద‌ళిత యువ‌కుడు ప్రేమించాడ‌న్న అక్రోశంతో ఆ యువ‌కుడి చెల్లెళ్ల‌ను రేప్ చేయాల‌ని తీర్పు ఇచ్చిన దుర్మార్గ‌పు పంచాయ‌తీ క‌థ ఇది........

100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ

100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. ఉదయం నుంచి వాట్సప్ లో సోషల్ మీడియాలో వినివిని చికాకొస్తోంది. చివరికి డీజీపీ, పోలీసు కమిషనర్లు, హోం మంత్రి కూడా ఇదే పాట. ఆమె 100 కి డయల్ చెయ్యలేదు కనుక అమెకిలా జరిగింది. ఆమె అలాంటి బట్టలు వేసుకుంది కనుక అలా జరిగింది. ఆమె ఆ టైమ్ లో బయటికి వెళ్ళింది కనుక అలా జరిగింది అనటానికి దీనికి తేడా ఏమిటి?

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సంస్కృతి