కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా కనిపించే జమ్మూ కాశ్మీర్‌ను తూట్లు తూట్లు చేశాయి పెల్లెట్లు. నెలల తరబడి కర్ఫ్యూలో మగ్గిపోతున్న కాశ్మీర్‌లో పెల్లెట్లు సృష్టించిన విషాదాన్ని మరచిపోలేనంటోంది సగటు కాశ్మీరీ మస్తిష్కం. పెల్లెట్లకు చిన్నా పెద్దా తేడా లేదు. ఎదురుపడిన మానవ దేహాన్ని జల్లెడలా మార్చడమే వాటి లక్ష్యం. తొమ్మిదేళ్ల హజీలా కంటిని పొట్టన పెట్టుకున్నవి పెల్లెట్లే. హజీలా పిల్లల పార్కులో ఆడుకుంటూ ఉండగా భద్రతా బలగాల పెల్లెట్లు పేల్చారు. ఆమె ఎడమ కన్ను దెబ్బ తింది. పాక్షికంగా చూపు పోయింది. తోడబుట్టినవాడి పెళ్లి రేపనగా ఒంటి నిండా గాయాలతో రియాజ్ మరణించాడు. అతడి దేహంలో 300 పెల్లెట్లు కనిపించాయి. ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కాశ్మీర్ లోయలో సాయుధ బలగాల పైశాచికత్వాన్ని నజీర్ ఎండగట్టింది. విచ్చలవిడిగా చోటు చేసుకుంటున్న మానవహక్కుల ఉల్లంఘనలను చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న ఇండియన్ మీడియా ఉదాసీన వైఖరిని తప్పుపట్టింది. పాతికేళ్ల క్రితం సాయుధ బలగాలు పదుల సంఖ్యలో కాశ్మీరీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టుగా అభియోగాలున్న కునాన్ పోష్‌పోరా కేసును ప్రస్తావించింది. ʹదామిని ఇండియాʹస్ డాటర్ కావచ్చు కానీ అసియా మాత్రం ఎప్పటికీ కాదుʹ అంటూ ఢిల్లీలో నిర్భయ రేప్ కేసుకు కునాన్ పోష్‌పోరా కేసుకు భారతీయ సమాజం ప్రదర్శించిన రెండు నాల్కల ధోరణిని వేలెత్తి చూపింది. ʹకాశ్మీర్ నీది కాని కాశ్మీరీలు నీవాళ్లు కారా?నా ప్రియమైన ఇండియా... ఏదైతే ʹఅవిభాజ్య భాగాన్నిʹ కాపాడుకోవడానికి ఏడు లక్షల మంది భద్రతా బలగాలను మోహరింపచేశావో... అదే కాశ్మీరీల పెదవి దాటని రిఫరెండం అని తెలుసుకోʹ అని హిష్మా నజీర్ హిత బోధ చేసింది.

జులై ఎనిమిదిన దక్షిణ కాశ్మీర్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ మరణించిన అనంతరం కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రాన్ని రాజకీయ అనిశ్చితి పూర్తిగా ఆవహించింది. కాశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి రెండు నెలలు కావొస్తోంది. ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో 72 మంది మరణించారు. వేలాదిగా కాశ్మీరీలు గాయపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ʹ72 మంది మరణించారు. ఆరు వేల మంది గాయపడ్డారు. 100 మందికి కంటిచూపు పోయింది. ఇంత జరుగుతున్నా కానీ మా మాట నీ నోట వినిపించేదెప్పుడు?ʹʹ అని ఇండియాను ఆమె నిలదీసింది. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులకు అద్దం పడుతున్న ఆ వీడియోను ఇప్పటిదాకా 34 వేల 909 మంది వీక్షించారు.

Keywords : kashmir, pellets, armed forces, Kunan Poshpora, unspoken referendum, hindutva
(2024-04-14 06:46:58)



No. of visitors : 1970

Suggested Posts


పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కాశ్మీరీ