అమ్మాయిలూ... అబ్బాయిలతో మాట్లాడొద్దు?!

అమ్మాయిలూ...

స్టూడెంట్స్‌కు బ్రేక్ ఇచ్చినప్పుడు అమ్మాయిలు వేరే క్లాస్‌లకు చెందిన అబ్బాయిలను కలవకూడదట. మంగళూరులో ఒక కాలేజ్ విద్యార్థులకు విధిస్తున్న రూల్స్‌ సోషల్ మీడియాలో పెద్ద టాపిక్‌ అయ్యింది. దీనికి సంబంధించి కాలేజ్ పూర్వ విద్యార్థి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు. అయితే పేరెంట్స్ కోరడంతోనే తాము కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నామని సెయింట్ అలోసియిస్ ప్రి యూనివర్శిటీ కాలేజ్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫ్రెడిరిక్ మెల్విన్ మెన్‌డోన్కా తెలిపారు. కాలేజ్‌ని అప్రతిష్ట పాల్జేసే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక మంగళూరులో మిగిలిన కాలేజీలతో పోలిస్తే తమ కాలేజ్‌లో రూల్స్ చాలా లిబరల్‌గా ఉంటాయని ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు.

విద్యార్థుల మంచి కోసమే రూల్స్ విధిస్తున్నామని, వీటికి పేరెంట్స్ నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని తెలిపారు. అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. పూర్వ విద్యార్థి సోషల్ మీడియాలో ఉంచిన పోస్ట్‌ ప్రకారం ʹపబ్‌లకు పార్టీలకు వెళ్లకూడదు. విద్యార్థినులెవరూ లంచ్‌కని క్యాంపస్ నుంచి బైటకు వెళ్లకూడదు. క్లాసులకు బ్రేక్ ఇచ్చినప్పుడు అమ్మాయిలెవరూ అబ్బాయిలను కలవకూడదు. గోరింటాకును అరచేతికి మాత్రమే పెట్టుకోవాలి. అది కూడా క్లాస్ గైడ్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే. ఒక అమ్మాయి అబ్బాయిల గ్రూప్‌తో లేదా ఒక అబ్బాయి అమ్మాయిల గ్రూప్‌తో మాట్లాడ్డం చేయరాదుʹ అని కాలేజ్ రూల్స్‌లో ఉంది.

Keywords : Karnataka, collage, girls, boys, restrictions, manguluru, saint aloysius
(2024-04-24 10:57:45)



No. of visitors : 1258

Suggested Posts


అక్లాక్ ఇంట్లో ఉన్నది బీఫ్ కాదు మటన్ - ఫోరెన్సిక్ నిపుణులు

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఆవు మాంసం తిన్నాడనే ఆరోపణలపై అక్లాక్ అనె వ్యక్తిని ఓ మతోన్మాద గుంపు కొట్టి చంపి ఘటనకు సంభంధించి అక్లాక్ నివాసంలో ఉన్నది బీఫ్ కాదని మటన్ అని ఫోరెన్సిక్ నివేదిక....

ఆవును చంపడాన్ని నిషేధిస్తూ దేశవ్యాప్త చట్టం ?

ఆవు మాంసాన్ని తినడం పై దేశ వ్యాప్తంగా నిషేధం విధించనున్నారా ? దీనిపై హిందుత్వ సంస్థల నుండి, బాబాలు, స్వాములనుండి పెరుగుతున్న డిమాండ్లు చూస్తుంటే నిషేధం విధించే దిశగా అడుగులు పడుతున్నాయనిపిస్తోంది

Violence erupts in Varanasi over Ganesh idol immersion

Violence erupted when what was initially a peaceful march of some religious organisations against police action during a recent sit-in protest in the issue turned violent when some people began pelting stones at policemen accompanying the group.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అమ్మాయిలూ...