ʹరోహిత్‌ను వాళ్లు వేటాడారు..నేనూ అందులో భాగమయినందుకు సిగ్గు పడుతున్నానుʹ


ʹరోహిత్‌ను వాళ్లు వేటాడారు..నేనూ అందులో భాగమయినందుకు సిగ్గు పడుతున్నానుʹ

ʹరోహిత్‌ను

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య పై దేశ వ్యాప్తంగా ఉద్యమం వెల్లువెత్తిన నేపథ్యంలో.... ఆ ఆత్మహత్యకు కారణమైన సంఘ పరివార్ విద్యార్థి సంఘం ఏబీవీపీ చేసిన దారుణాలు అనేకం వెలుగు చూశాయి. అయితే ఇప్పుడు ఆ సంఘంలో గతంలో పని చేసిన శివసాయిరాం అనే విద్యార్థి రోహిత్‌ మరణానికి దారి తీసిన పరిస్థితులపై పలు సంచలన వివరాలు వెల్లడి చేశారు. సంఘ్ పరివార్ రోహిత్ ను వేధించి, వేంటాడిన తీరును వివరించాడు. అందులో తానూ భాగస్వామినైనందుకు పశ్చాతాపం ప్రకటించాడు. సోమవారం ఆయన తన ఫేస్‌బుక్‌ వాల్‌పై చేసిన ఆరోపణలు రోహిత్‌ హత్యలో ఏబీవీపీ హస్తం ఉందనే వాదనలను మరింత బలపరుస్తున్నాయి. ఈ కుట్రను రుజువు చేసేందుకు ఆయన పలు ఫేస్‌బుక్‌ పోస్ట్‌ల స్క్రీన్‌షాట్‌లను సాక్ష్యంగా జతచేశారు. ఇప్పుడు శివసాయిరాం ఆరోపణలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇది

ʹʹగతంలో జరిగిన ఓ సంఘటన నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. గణేష్‌ చవితి దాన్ని గుర్తు చేస్తోంది. 2013లో , నేను, రోహిత్‌, రోహిత్‌ సంస్థాగత హత్యకు బాధ్యుడైన మరో వ్యక్తి (సుశీల్‌కుమార్‌) భాగమైనఈ సంఘటన జరిగింది. యూఓహెచ్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌)లో గణేష్‌ పండుగ నిర్వహణ విషయంలో ఫేస్‌బుక్‌ గ్రూపుల మధ్య పెద్ద చర్చ జరిగింది. పండుగ పేరుతో మితవాద పక్షం ముందుకు తెస్తున్న నకిలీ సైన్సు పట్ల చాలా వేడిగా సాగిందా చర్చ. అప్పుడు నాలో ఆధ్యాత్మికత, మతతత్వం ఎక్కువ వుండేవి కాబట్టి నేను పండుగ జరుపుకోవాల్సిందేనని వాదించాను. దీనికి వ్యతిరేకంగా చాలా మంది వాదించారు. వారిలో ఒకరు రోహిత్‌. ఒక గ్రూపుగా ఏర్పడిన మాకు (ఏబీవీపీ పలు రూపాల్లో పని చేస్తుంది కాబట్టి గణేష్‌ ఉత్సవ్‌ కమిటీ అనేది దానికి చెందినదే అని గుర్తుంచుకోవాలి) రోహిత్‌, తదితరులు నాస్తికులని తెలుసు. సంఖ్యలో వాళ్లు మాకన్నా చాలా ఎక్కువ కాబట్టి వాదనలో మేం నెగ్గలేకపోతున్నామని గ్రహించాం. సరిగ్గా అప్పుడే ఏబీవీపీ ఒక ఎత్తుగడను చేపట్టింది - అదే విచ్‌హంటింగ్‌ (తప్పుడు నిందారోపణలతో మనుషుల్ని వేటాడడం).
అప్పటికి నేను ఆ సంస్థలో కొత్త (చేరి 2 నెలలే అయ్యింది). అది తెరవెనుక నడిపించే కార్యకలాపాల గురించి నాకు పెద్దగా తెలియదు. ఆ చర్చలో పాల్గొన్న వారిపై ʹదైవనిందʹ కేసు పెట్టడం ద్వారా వారిని విచ్‌హంట్‌ చేయాలనే నిర్ణయం జరిగింది. వారి పోస్ట్‌లనూ, కామెంట్లనూ స్క్రీన్‌షాట్లు తీసి వాటిని కొందరి మెయిల్స్‌కు పంపించాలని నాకు చెప్పారు. (వారిలో ఒక మెయిల్‌ సుశీల్‌కుమార్‌ సోదరుడిది). నేను వారు చెప్పినట్టే స్క్రీన్‌షాట్లు వారికి మెయిల్‌ చేశాను. వారు ఒక రహస్య సమావేశం జరిపి రోహిత్‌ను తమ ఏకైక టార్గెట్‌ అని నిర్ణయం తీసుకున్నారు. విప్లవ కవి శ్రీశ్రీ.. గణపతి భగవానుడిపై రాసిన కవితను రోహిత్‌ తన టైమ్‌లైన్‌పై పోస్ట్‌ చేశాడన్న ఆరోపణతో ఫిర్యాదు చేయాలనేది ఆ నిర్ణయం. అట్లాగే వినాయక చవితి లాగా సూపర్‌మేన్లకూ/స్పైడర్‌మేన్లకూ పుట్టినరోజులు ఎందుకు జరుపుకోరంటూ రోహిత్‌ వ్యంగ్యంగా చేసిన పోస్టింగ్‌ మరో ఆధారం.
ఈ కేసు ఫలితంగా రోహిత్‌ అరెస్టయ్యాడు. ఆయనను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రెండు రోజులు (నాకు గుర్తున్నంత వరకు) ఉంచారు. రోహిత్‌కు ʹతగిన బుద్ధిʹ చెప్పామంటూ ఏబీవీపీ శ్రేణులు పండుగ చేసుకున్నాయి. తర్వాత రోహిత్‌ విడుదలయ్యాడు. (కేసు పూర్తి వివరాలు నాకు తెలియదు). విడుదలయ్యాక రోహిత్‌ తన గొంతును నొక్కెయ్యడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఒక పోస్ట్‌ పెట్టాడు.
ఏబీవీపీ సభ్యులుగా మేం లెక్కలేనన్ని తప్పుడు పనులకు పాల్పడ్డాం. వాటి పట్ల నేనిప్పుడు సిగ్గు పడుతున్నాను. అయితే వాటన్నింటిలో రోహిత్‌ను విచ్‌హంట్‌ చేయడంలో నేను కూడా ప్రత్యక్ష భాగస్వామినైన కారణంగా ఈ సంఘటన నన్ను బాగా వెంటాడుతోంది. ఈ ఒక్క సంఘటనలోనే కాదు, అనేక సందర్భాల్లో రోహిత్‌ను ప్రత్యేకించి టార్గెట్‌ చేశారు. రోహిత్‌ తన రాజకీయ అభిప్రాయాలను దృఢంగా, సుస్పష్టంగా మాట్లాడేవాడు. అందుకే ఏబీవీపీలో సీనియర్లు ఆయనను బాగా ద్వేషించేవారు. అందుకే ఆయనను ఆన్‌లైన్‌లోనూ, బయటా బాగా వేధించారు. ఇప్పుడు రోహిత్‌ భౌతికంగా లేడు కాబట్టి ఆయనకు నేను క్షమాపణలు చెప్పుకోలేను. కానీ మితవాద గ్రూపులో సభ్యుడిగా వారి కార్యకలాపాల్లో భాగమైన నేను, ఈ సంఘటనకు సంబంధించి పశ్చాత్తాపాన్ని ప్రకటించడం ద్వారా నాలోని అపరాధభావన తగ్గిపోతుందని నేను ఆశిస్తున్నాను. నేను చేస్తున్న ఆరోపణలను నిజమని నిరూపించే స్క్రీన్‌షాట్లను ఇక్కడ జత చేస్తున్నాను.

హిందూత్వ శక్తులు రోహిత్‌ను ఆత్మహత్య వైపు ఎలా నెట్టేశాయో చాలా మందికి తెలియకపోవచ్చు. సంఘ్ పరివారపు కులతత్వ-మతతత్వ-ఫాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడ్డందుకు ఆయన ఎదుర్కొన్న నిరంతర దూషణలు, హింసల గురించి తెలియకపోవచ్చు. ఇదీ ఒక సంస్థాగత హత్య జరిగే తీరు. ఇదే దళితులు, ఆదివాసులు, మత మైనారిటీలు వంటి పీడిత సమూహాలను రాజ్యం, పోలీసులు, హిందూత్వ శక్తులు విచ్‌హంటింగ్‌ చేసే పద్ధతి. ఈ గ్రూపుల మూర్ఖత్వాన్ని అర్థం చేసుకొని వారి విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన తరుణమిదే.ʹʹ

Keywords : rohit vemula, abvp. asu, students, Hyderabad central university, suicide, hindutva
(2019-03-18 01:13:39)No. of visitors : 12700

Suggested Posts


RSS was inspired by Adolf Hitler, says writer Arundhati Roy

Writer Arundhati Roy has spoken out against the RSS accusing it of waging an ideological war on India.

ʹహిందువుగా బతకడం అంటే సహనంతో బతకడం - నేను నీ హిందుత్వను తిరస్కరిస్తున్నానుʹ

మా పూర్వీకులు, తాతగారు ఆలయంలో అర్చకులు. మా నాన్నగారు నేటికీ వేదాలను నోటితో వల్లిస్తారు. ఎప్పుడూ చదవకపోయినా నా సోదరి వేదాలను నోటితో చెప్పగలదు. కారణం అది మా వంశంలో, మా రక్తంలో, మా వారసత్వంలో ఉంది. కాబట్టి ఓ భాజాపా నా మతం గూర్చి నువ్వు నాకు నేర్పవద్దు. నేను ఎలా ఆలోచించాలో, ఎవరిని పూజించాలో, ఏం తినాలో, ఎలా దుస్తులు ధరించాలో నువ్వు నాకు నేర్పాలని.....

ముస్లింలపై చివరి యుద్దానికి సిద్దంకండి - సంఘ్ పరివార్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు

ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం కండి....ఒక తలకు పది తలలు నరకండి.... తుపాకులు పట్టండి.... కత్తులు చేబూనండి..... వేలాదిగా వీధుల్లోకి రండి....

HCU rusticated dalith student Rohit Vemula last words

I would not be around when you read this letter. Donʹt get angry on me. I know some of you truly cared for me, loved me and treated me very well. I have no complaints on anyone.....

ఆరెస్సెస్ ను నియంత్రించండి - అమెరికా చట్టసభ సభ్యుల లేఖ

భారత్‌లో ముఖ్యంగా క్రిస్టియన్, ముస్లిం, సిక్కులపై ఉద్దేశపూర్వక దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన 34 మంది చట్టసభ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ.....

వాళ్ళు ఆవులను ప్రేమిస్తారో లేదో కానీ మనుషులను మాత్రం ద్వేషిస్తారు !

ఆవులను రక్షించే పేరుతో మనుషులపై దుర్మార్గమైన దాడులు పెరిగి పోయాయి. వాళ్ళే ఆరోపణలు చేస్తూ వాళ్ళే శిక్షలు విధిస్తూ అటు పోలీసులపని ఇటు కోర్టుల పనిని కూడా ఆవురక్షకులే భుజాన వేసుకున్నారు....

మహిళ భూమిని ఆక్రమించి, ఆపై దాడి చేసిన బీజేపీ సర్పంచ్

ఓ మహిళ భూమిని ఆక్రమించుకోవడమే కాక అదేమని అడిగినందుకు ఆ మహిళపై దాడి చేసిన ఘటన పంజాబ్ లో జరిగింది. జల్ంధర్ జిల్లా హోషియార్ పూర్ గ్రామంలో బీనా అనే మహిళకు చెందిన ఐదు ఎకరాల భూమిని బీజేపీకి చెందిన....

శాఖాహారమే పర్యావరణానికి హాని - తేల్చిన పరిశోధన

మాంసాహారం కన్నా శాఖాహారం వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని కార్నెజ్ మెలాన్ యూనివర్సిటీకి పరిశోధకులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో....

వాళ్ళ దృష్టిలో దళితులు మనుషులు కారు !

ఆబడిలో మధ్యాహ్న భోజనం దళిత మహిళ వండుతున్నదన్న కారణంతో దాదాపు వందమంది విద్యార్థులు ఆ ప్రభుత్వ బడి నుంచి వేరే పాఠశాలకు మారారు. కేవలం 18 మంది విద్యార్థులు ఇప్పుడు ....

ఆ గుర్రం కూడా దేశద్రోహేనా ?

అది గుర్రం....పాపం అది ఓ మూగ జీవి.... అది దేశ ద్రోహి కాదు... అది జేఎన్యూ నుంచో హెచ్ సీయూ నుంచో కూడా రాలేదు ... హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడటానికి దానికి నోరు కూడా లేదు. కానీ ఓ బీజేపీ ఎమ్మెల్యేకు.....

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


ʹరోహిత్‌ను