మావోయిస్టు పార్టీకి ప‌న్నెండేళ్లు


మావోయిస్టు పార్టీకి ప‌న్నెండేళ్లు

మావోయిస్టు

సెప్టెంబ‌ర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గ‌ల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా, సీపీఐ ఎంఎల్‌ (పీపుల్స్‌వార్‌) విలీనమై ʹసీపీఐ మావోయిస్టుʹ పార్టీ ఏర్పడిన రోజు. 2004లో ఏర్ప‌డిన మావోయిస్టు పార్టీ ఈ ప‌న్నెండేళ్ల లో ఎంతో పురోగ‌తి సాధించింది. మావో చెప్పిన పార్టీ, ప్ర‌జా సైన్యం, ఐక్య సంఘ‌ట‌న అనే మూడు ఆయుధాల‌ను చేప‌ట్టిన మావోయిస్టు పార్టీ తెలంగాణ వంటి ప్రాంతాల్లో నిర్భందం వ‌ల్ల వెన‌క్కి త‌గ్గినా, కొత్త స్థావ‌రాల‌కు విస్త‌రించింది. గెరిల్లా బేస్ ఏరియాల‌ను ఏర్ప‌ర్చుకొని మ‌రీ ప‌నిచేస్తోంది. దండ‌కార‌ణ్యంలో ప్ర‌త్యామ్నాయ అభివృద్ధిని అమ‌లు చేస్తూ, ప్ర‌జాపాల‌న‌ను నిర్వ‌హిస్తోంది. క్రాంతికారి జ‌న‌త‌న స‌ర్కార్ పేరుతో స‌మాంత‌ర పాల‌న సాగిస్తోంది. మ‌రో వైపు బుద్ధిజీవులు, అన్ని వ‌ర్గాలను ఐక్యం చేస్తూ ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌లపై ప్ర‌జ‌ల‌ను క‌దిలిస్తోంది.

న‌క్స‌ల్బ‌రీకి యాబైయేండ్లు పూర్త‌వుతున్న‌ సంద‌ర్భం ఇది. ప‌శ్చిమ బెంగాళ్‌లోని డార్జిలింగ్ జిల్లా న‌క్స‌ల్బ‌రీలో పెల్లుబికిన భూస్వామ్య వ్య‌తిరేక రైతాంగ పోరాటం దేశానికి కొత్త చూపినిచ్చింది. అలా 1969 ఏప్రిల్‌ 22న ఏర్పడ్డ సీపీఐ (ఎంఎల్‌) శ్రీకాకుళ‌, జ‌గిత్యాల పోరాటాల స్పూర్తితో దేశమంతా విస్త‌రించింది. 1980 ఏప్రిల్‌ 22న సీపీఐ ఎంఎల్‌ పీపుల్స్‌వార్‌గా ఏర్ప‌డింది. 1998లో సీపీఐ ఎంఎల్‌ (పార్టీ యూనిటీ) పీడబ్ల్యూలో విలీనమైంది. మ‌రోవైపు బెంగాళ్‌, బీహార్ కేంద్రంగా భూస్వామ్య సాయుధ పోరాటాలు నిర్వహించిన మావోయిస్టు క‌మ్యూనిస్ట్, 2003లో రెవెల్యూష‌న‌రీ క‌మ్యూనిస్ట్ సెంట‌ర్ ఆఫ్ ఇండియాతో క‌లిసి ఎంసీసీఐగా ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో దేశంలో విప్ల‌వం విజ‌యం చేయ‌డానికి ఒకే ఒక ఐక్య పార్టీ అవ‌స‌ర‌మ‌ని భావించిన పీపుల్స్ ఎంసీసీఐతో జ‌రిపిన చ‌ర్చ‌ల ఫ‌లితంగా 2004 సెప్టెంబర్ 21న సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్ప‌డింది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావాన్ని 2004 శాంతి చ‌ర్చ‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆ పార్టీ నాయ‌కులు రామ‌కృష్ణ‌, సుధాక‌ర్‌, గ‌ణేష్ తొలిసారి బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ఈ ఐక్య‌తా కృషి మ‌రో అడుగు ముందుకేసి 2014 లో సీపీఐ ఎంఎల్‌ (నక్సల్బరీ) కూడా మావోయిస్టు పార్టీలో విలీనమైంది.

విప్ల‌వోద్య‌మాన్ని అణ‌చివేయ‌డానికి ప్ర‌భుత్వం సాల్వజుడుం వంటి ప్రైవేటు సాయుధ ముఠాల‌ను ప్ర‌యోగించ‌డంతో పాటు ల‌క్ష‌లాది బ‌ల‌గాల‌ను దండ‌కాణ్యంలో మోహ‌రించింది. ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్ మూడ ద‌శ ముమ్మ‌రం చేసిన ప్ర‌భుత్వం మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు ఆదివాసీల‌పై తీవ్ర అణ‌చివేత‌ను ప్ర‌యోగిస్తుంది. ఇన్ని ఆటు పోట్ల మ‌ధ్య కూడా మావోయిస్టు పార్టీ నాయ‌క‌త్వంలో దండ‌కార‌ణ్యంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగిస్తుండ‌డంతో పాటు దేశంలోని వేరు వేరు ప్రాంతాల‌కు విస్త‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మావోయిస్టు పార్టీ ఏర్ప‌డి ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఐక్య విప్ల‌వోద్య‌మం సాధించిన విజ‌యాల‌ను ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేసేందుకు, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టేందుకు 2014లో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెట్టిన బ‌హిరంగ‌స‌భ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అడ్డుకుంది. వేలాది మందిని అరెస్టు చేసింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని విప్ల‌వాభిమానులు జ‌రుపుకోవ‌డం గ‌మ‌నార్హం.

Keywords : maoist, india, revolution,
(2019-09-14 22:45:49)



No. of visitors : 2742

Suggested Posts


A Powerful Reply from Maoist Leaderʹs Daughter to Home Minister

When I was 10, my four-year-old sister Savera and our mother were unreasonably taken into police custody. Due to the unending harassment from your force....

జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ

మొన్నటిదాకా మావోయిస్టు పార్టీలో పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని సీపీఐ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఆయనను ఏడాది క్రితమే పార్టీ సస్పెండ్ చేసిందని ఆ తర్వాత కూడా ఆయన తప్పులను సరిదిద్దుకోకపోగా ఇప్పుడు శత్రువుకు లొంగిపోయాడని

జగదల్ పూర్ జైలు నుండి మావోయిస్టు పద్మక్క లేఖ

ఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు.

మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !

ఏఓబీ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన మున్నా స్మార‌కార్థం కుటుంబ స‌భ్యులు ప్ర‌కాశం జిల్లా ఆల‌కూర‌పాడులో నిర్మించిన స్తూపాన్ని తొల‌గించాలంటూ కొంది మందిని డ‌బ్బులు తీసుకొచ్చిన జ‌నాల‌తో పోలీసులు ర్యాలీ తీయించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, టంగుటూరు త‌హ‌సీల్దార్‌కు విన‌తిప‌త్రం ఇచ్చారు. మావోయిస్టులు హింస‌కు పాల్ప‌డుతున్నార‌ని, పోలీసులు చ‌ట్ట‌బ‌ద్ద పోరాటంలో ప్రాణాలు కోల్

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

విప్లవోద్యమం మొదటి నుండి దళితుల పక్షాన నిలిచి దళితులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తూ, వారి మౌళిక హక్కుల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 25న నిరసన దినాన్ని పాటించాలని అన్ని సెక్షన్ల ప్రజలను కోరుతున్నాము.

ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

దోపిడీ పాలకులైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుపార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా, కొత్త భూ సేకరణ చట్టానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా,ఇసుక మాఫియా హత్యలకు, దళితులు ఆదివాసులపై దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక అత్యాచారాలు, విద్యార్థుల పై దాడులు, అరెస్టులకు...

రాజుకుంటున్న మన్యం

విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకుంది. ʹదేశ ఖనిజ సంపదను విదేశాలకు దోచి పెట్టే ఏ చర్యలను మేం ఒప్పుకోబోంʹ అంటూ ప్రకటించిన మావోయిస్టు పార్టీ బాక్సైట్ పోరాటాన్ని ఉదృతం చేసింది. మన్యం ప్రాంతంలో సభలు, సమావేశాలు....

37 మంది మావోయిస్టులను విషంపెట్టి చంపారా ?

ఈ ఎన్ కౌంటర్ ను తీవ్రంగా ఖండించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. చత్తీస్ గడ్, మహారాష్ట్ర విప్లవోధ్యమంపై కక్షగట్టిన కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరమేధానికి ఒడిగట్టాయని

Govt lost mercy petition of 4 Maoist convicts on death row

Four death row convicts in Bihar have been waiting for a decision on their mercy petition for more than a decade because their plea to be spared.....

Search Engine

కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!
ఎంత తీవ్ర ఖండనైనా సరిపోదనిపించే దుర్మార్గం -ఎన్.వేణు గోపాల్
War and Peace in the Western Ghats
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.
కుల రహిత - మత రహిత అస్తిత్వం కోసం
more..


మావోయిస్టు