ʹʹవాళ్లుʹʹ - తాయమ్మ కరుణ‌

ʹʹవాళ్లుʹʹ

తను మాట్లాడుతోంది, తిరుగుతోంది. కానీ తను తనలా లేదే.
ʹʹనీతోనే ఉండాలని ఉంది. కానీ వెళ్ళక తప్పదుగాʹʹ బ్యాగు భుజానికి వేసుకున్న.
ʹʹ13 న రారాదుʹʹ
ʹʹరావాల్నా.ʹʹ
ʹʹరారా...ʹʹ కళ్ళలోకి చూస్తూ
ఇలా వెళ్లాలని లేదు. కేవలం తనతో కేవలం తనతో మాట్లాడాలి. కానీ ఈ సందర్భంలో కుదరదు. తాను రమ్మన్నది కాబట్టి... వెళ్ళాలా వద్దా అనే ఊగిసలాటను పక్కనబెట్టి ʹఈ సందర్భంలో నేను రావడం సంతోషమేమోʹ బయలుదేరా. ఆ ఊరికి వెళ్లేందుకు ఆటో ఎక్కినప్పటి నుంచి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ 5 కిలోమీటర్లు ఎన్ని జ్ఞాపకాలని ! ʹవాడే కదా ఆమె ప్రాణం. వాడి కోసమే ఎన్ని అవమానాలు, ఇబ్బందులు అయినా పడింది... ఒక సంవత్సరమా? రెండు సంవత్సరాల? ఇప్పుడు తను ఎలా ఉంటోంది?ʹ
వెళ్లేసరికి ఇంటి ముందర వేసిన టెంట్ కింద కొందరు కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంటికి సున్నాలు వేసి ఉన్నాయి. టిఫిన్లు తినేవాళ్లు తింటున్నారు. చాయ్ తాగేవాళ్ళు తాగుతున్నారు. కిచెన్లో అందించే వాళ్ళు అందిస్తున్నారు. వెళ్లి బ్యాగు లోపల పెట్టాను. తను మంచం మీద కూచుంది. చుట్టూ ఉన్నవాళ్లు తింటూ తాగుతూ మాట్లాడుతున్నారు. తను వుంది. కానీ నిజంగానే చైతన్యవంతంగా ఉందా? తానే నన్ను పలకరించింది. మొన్న కలిసినప్పుడు కూడా ఇలాగే ʹʹబాగున్నావా?ʹʹ అంది. ఎవరు పలకరించాలి? నేను తననా? తను నన్ను పలకరించాలా? నాకు బోరున ఏడవాలని అనిపించింది.
ʹʹవెళ్లి మొఖం కడుక్కుని స్నానం చెయ్యిʹʹ అంది.
ʹʹఆ వెళ్తా. ముందు సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి.ʹʹ ఛార్జింగ్ పెట్టాను. డ్రెస్ తీసుకుని స్నానికి వెళ్ళా.
ʹʹఅక్కా నీళ్లు వేడి పెడతా. ఈ లోగా మొఖం కడుక్కోండిʹʹ తన అక్క కూతురు అన్నది.
ʹʹసరేʹʹ అన్నాను. ʹఫోన్ను ఛార్జింగ్కు పెట్టడం ఏమిటి? ఇలా బట్టలు తీసుకుని బయటకు రావడం ఏమిటి? ఏం చేస్తున్నాను? ఆ మనిషిని పలకరించలేదే.ʹ
గబా గబా లోపలి వెళ్లి తన చేతిని చేతిలోకి తీసుకున్నా. ʹʹఇంతకీ నువ్వెలా ఉన్నావు?ʹʹ
నవ్వింది. ఆ నవ్వుకు ఎన్ని అర్థాలు!
అంతకు మించి ఏం మాట్లాడాలో కూడా తోచలేదు. మాటలు దొరకడం లేదు. అంతా అర్థమవుతుంటే ఏం మాట్లాడాలి? కొద్దిసేపు తన చెయ్యి పట్టుకుని అలాగే కూచున్నా. ఎదుటి వ్యక్తిపట్ల వున్న అభిమానాన్నీ అంత మందిలో చూపడం, వారితో మాట్లాడటం చాతకాదు. తర్వాత అక్కడ ఉండలేకపోయిన. బయటికి వచ్చి కూచున్న. వాతావరణం ప్రశాంతంగా ఉంది. మనసులేమో ఖాళీ అయ్యాయి. నిజంగా ఖాళీగా ఉన్నాయా? ఉంటే గుండెల మీద ఇంత భారమెందుకు?
వీధిలో చివరి ఇల్లు. ఇంటి ముందర అంతా మట్టినే. ఇంటి పని పూర్తైనట్టు లేదు. ఒక హాలు. హాలులోకి కిచెన్‌, బెడ్‌రూమ్‌ దర్వాజలు. బయట టాయ్‌లెట్‌. దాని ఎదురుగా మూడు బొప్పాయి చెట్లు. వాటికి కొన్నీ కాయలు. టాయ్‌లెట్‌ పక్కనుంచి వేసిన కంచేకు కాకర తీగ. కొన్ని పూల మొక్కలు. ఆ పక్కన అన్నీ పొలాలు. దుక్కి దున్నివిత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. దూరంగా పచ్చని చెట్లు. బహుశా ఫ్లాంటేషనేమొ. ఇంటి ముందర చర్చి. చర్చికి ఇంటికి మధ్యలో ఖాళీ జాగా. అందులో ఆకు కూరలు, కూరగాయల మొక్కలు. అంతా సాఫీగా ఉంటే చాలా ప్రశాంతమైన వాతావరణమే. ఈ ఇంట్లో నిజంగానే ప్రశాంతంగా ఉందా? నిద్ర మాత్రలు వేసుకోకపోతే నిద్ర రాకపోయేదట. ఇది ఇప్పటిమాటా? చాలా ఏండ్లుగా సాగుతున్న వ్యవహారమే కదా.
ఆయనంటే వెళ్లాడు. వీడు కూడా వెళ్లడమేమిటి? వాడికి తెలియదు ` తన ప్రతి ఆలోచనా, కదలికా, పని ` తనకోసమేనని. అయినా వదిలేసి వెళ్లిపోయాడే. ʹʹఎందుకురా నాన్నా? నన్ను ఒంటరిని చేశావుʹʹ అని నిలదీయాలనుకుంది. ఎక్కడా? మాట్లాడనిస్తేనా? మాటలతో మాయచేశాడు. భగత్‌సింగ్‌ గురించి చెప్తున్నాడు. తనెందుకు ఈ మార్గాన్నీఎంచుకున్నాడో చెప్తున్నాడు. తనేమి అడుగాలనుకుంటుందో తెలిసే ఇదంతా చెప్తున్నాడా? వాడినేనా తను చూస్తున్నది? ఇంత తెలివి, జ్ఞానం ఎప్పుడు నేర్చుకున్నాడు! పైగా ʹʹఇంత అమాయకంగా ఉన్నావు. నాన్నెట్లా చేసుకున్నాడమ్మాʹʹ అంటాడు. నిన్న మొన్నటి వరకూ వీడు నా కొంగుచాటు బిడ్డడు కాదూ.
ఈ ఇల్లు ఇంతకుముందు కట్టుకుని ఉంటే వాడు తనను విడిచి వెళ్లేవాడు కాదేమో. అయినా పిచ్చిగానీ, విచ్చుకున్న ఆలోచనను ఎలా తుంచగలదు తను. పోనీ ఏదో ఒక రోజు ఈ అమ్మను కవడానికి వాడు రాడా? ʹʹఅరే కన్నా.. ఇదిగిరో అమ్మ నీ కోసం ఇల్లు కట్టిందిరాʹʹ అని చూపాలనుకుంది. నిజానికి వాడి కోసమే తను ఈ ఇల్లు కట్టిందేమో. వాడికి ఇష్టమైన పప్పు, నెయ్యి వేసి పెట్టానుకుంది. వాడికి ఇష్టమైన ఇడ్లీ, దోశ వేసి ఇవ్వాలనుకుంది. వచ్చినా ఇంటికి వస్తాడా? రాడేమో. అయినా మనసులో చావని ఆశ. మొన్నటి వరకూ అదే ఆశతో బతికింది. వాళ్లు ఏదో ఒకరోజు కలుస్తారు కదా. ఆ ఏదో ఒకరోజు కోసం ఎదురుచూస్తూనే ఉంది.

వాడు రానే వచ్చాడు. వాడి కోసం కట్టిన ఇంట్లోకి వాడు రానే వచ్చాడు. కానీ వాడుగా రాలేదు. తీసుకువచ్చారు.
ʹʹవేరేవాళ్ల ఇంట్లో ఉంటే బయట టెంట్‌ వేసి అక్కడి నుంచి అటే పంపించేసి ఉండేవాళ్లు. ఇల్లు కట్టాను కద. ఇంట్లోకి తీసుకురమ్మని ముందు రూములో పడుకోబెట్టాను రాʹʹ మొన్నటిసారి కలిసినప్పుడు తను నాతో చెప్పిన మాటలు. అనేటప్పుడు ఏదో తృప్తి. నాకు మాత్రం గుండెలు మెలిపెట్టే బాధ.
ʹʹనీళ్లు మరిగాయక్కా. తీసుకురానా?ʹʹ ఒకమ్మాయి అడిగింది.
ʹʹకాగాయా? నేను తెచ్చుకుంటాలేరాʹʹ.
స్నానం చేసి వచ్చేసరికే హడావుడి - రమ్మని పిలుపు వచ్చిందని. ఇంటికి దగ్గర్లోని ఖాళీ జాగాలో వేసిన టెంట్‌లోంచి ʹʹకార్యక్రమం కాసేపట్లో మొదవుతుందిʹʹ మైక్‌లో ఎవరో అనౌన్స్‌ చేస్తున్నారు.
వాడి పేరు పృథ్వి. వాడికి ఆ పేరును ఎంత ప్రేమగా పెట్టుకున్నారని! ఇప్పుడు వాడు నిజంగానే భూమి తల్లి ఒడిలో.
ʹʹఅమ్మా జెండా ఎగురేద్దావురామ్మాʹʹ ఎవరో పిలిచారు.
వెళ్లింది. జెండా ఎగురవేసి, ఆకాశంలో రెపరెప లాడుతున్న దానివైపు చూస్తుంటే ఎంత ప్రయత్నించినా ఆగక దూకిన కన్నీళ్ళు. ʹʹఏంట్రా? ఇంత ఎత్తుకు ఎదిగావు?ʹʹ
అరుణ అరుణ బాటలో
అరుణ బావుట నీడలో అమరులైన ఓ అమర వీరులారా... పాట సాగుతోంది.
రెడ్ శెల్యూట్స్ పొజిషన్లో నిలబడి కోరస్ ఇస్తూ జనం.
నిన్నుచూసి గర్వపడాలా? ఏం చేయాలిరా నేనిప్పుడు? నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే కావాల్సిందేముందమ్మా అన్నావు కదరా.
తెలుసారా ? రెండు, మూడు నెలల నుంచి ఎందుకనో చాలా ఆందోళనగా ఉంటోంది. కూచోబుద్ధికాదు, నిలబడ బుద్ధికాదు, పని చేయబుద్ధి కాదు, తిండి తినబుద్ధికాదు. ఎందుకని? హాస్పటల్‌కి వెళ్లా. డాక్టర్‌ ఏమీ లేదన్నాడు. ఎందుకట్లా ఉంటున్నావు అని అందరూ అడిగారు. ఏం చెప్పాలి? ʹఏమో తెలియదు. ఆందోళనగా ఉంటోందిʹ. ఆ రోజు కాఫీ కప్పు పట్టుకుని వంటింట్లోంచి ముందు గదిలోకి వచ్చి టీవీ చూస్తున్నా. స్క్రోలింగ్‌లో వాడి పేరు. కప్పు చేతిలోంచి ఎప్పుడు జారిపోయిందో తెలియదు. బహుశా అందుకేనేమో ఇన్ని రోజుగా కన్నపేగు అంతగా తల్లాడిల్లింది.
ʹʹఇంటికొకరిని రమ్మన్నారు. మీ నాన్న వెళ్లారు కదరా. నువ్వు నాతో రారాʹʹ.
ʹʹఅమ్మా యాక్సిడెంట్‌ అయి చనిపోతున్నవాళ్లు ఎందరు లేరమ్మాʹʹ అన్నాడు. ʹʹనేను చెడ్డ పని చేస్తలేను కదమ్మాʹʹ అన్నాడు.
ఇడ్లీనో, దోశనో లేకుంటే టిఫిన్‌ తినని వాడు... ఇష్టంగా జావ తాగుతున్నాడు. ఎంత ఆశ్చర్యపోయిన్నో. ఎంత మారాడు వీడు. చాలా పెద్దవాడు అయ్యాడు అనుకున్నా.
వాడిని వదిలి వచ్చేటప్పుడు చెయ్యి మీద, నుడుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ʹʹఅమ్మా నీ ప్రతి ఆలోచన నాకు తెలుస్తుందేʹʹ అన్నట్టుగా తల్లిలా నన్ను గుండెకు హత్తుకున్నాడు. అదే చివరసారి వాడిని చూడటం. ఆపుకుంటూ వచ్చిన దుఃఖపు తెర ఇక మాట్లాడనీయలేదు.
మీటింగ్ మధ్యలో వెళ్లి ʹʹఇంటికి వెల్దామాʹʹ అడిగా ʹʹఈ పాత అయిపోయిన తర్వాత వెళ్దాంʹʹ
మీటింగ్లోనే కూచున్నా. ఏవేవో ఆలోచనలు.
ʹʹపెండ్లి చేసుకున్నాడాʹʹ మొన్నటిసారి కలిసినప్పుడు అడిగా.
ʹʹఇంకా చేసు
యెవరినైనా ప్రేమించాడా ? అడిగే ధైర్యం లేకపోయింది.
అప్పుడెప్పుడో చెప్పింది. టెన్త్ లోనో ఏమో .... ఓ అమ్మాయి గురించి పదే పదే చెప్తుంటే ʹʹఆ అమ్మాయి అంటే ఇష్టమారాʹʹ అని అడిగితే "అవునే " అనే సమాధానం.
"ఎవర్రా ఆ అమ్మాయి?"
"ఓ పోలీసాయన కూతురు"
వాడిది స్నేహమే కావచ్చు. కానీ తన భయం తనది. వాడి నాన్న ఏమైనా అందరి నాన్నల లాంటి వాడా ?
ʹʹఅంతకు మించి వేల్లకురోరే"
"యెందుకు ?"
యధాలాపంగా అడిగాడా ? వాడి మనసులో ఇంకే ఉద్ధేశ్యమైనా ఉందా ? ఎదుగుతున్న వయసు. చెప్పడానికి నాన్న లేడు.తన అనుమానాలు, తన భయం తనది.
"ప్రేమ గీమ అనేవ్. బొక్కలో వేస్తారు"
"అమ్మా.... " విసుగ్గా అని
"ప్రేమిస్తే జైల్లో వేస్తారే ?" వాదన కోసమే కావచ్చు/
"మీ నాన్న సంగతి తెలుస్తే ఊరుకుoటారేమిరా ?"
ఇంత కాలమ్ వాడికి నాన్న గురించి అంతా తెలిసినట్టే ఉండెది. ఏమీ తెలిసేది కాదు. ఏదో ఎందుకో దాస్తున్నారు. తనను ఎన్నిసార్లు అడిగినా దాటవేసేది.
"నాన్న ఎక్కడ ఉంటాడమ్మా ?"
ఇక చెప్పక తప్పలేదు.
వాళ్లు ఏమ్ చేస్తారు ? అడవుల్లో ఎoదుకు ఉంటున్నారు ? వాళ్ళు ఇంటికి వస్తే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? వాడికి అప్పటికప్పుడు నాన్నని చూడాలనిపించి, చాలా అడగాలని ఉంది. అయన అసలు ఎట్లా ఉంటాడు ? "అమ్మా , నాన్న దగ్గరికి ఎప్పుడు తీసుకెళతావే " ఒకటే పోరు.
"పోదాం లేరా " అని అప్పటికి తప్పించుకున్నా వాడు వింటేగా.
రమ్మని పిలుపు. వాడసలు ఒకచోట కూచుంటేనా? బయటి నుంచి క్యాంపులోకి ఎవరు వచ్చినా లైన్లో నిలబడి లాల్‌సలాం చెప్తూ చేతలు కలపడం రివాజు. అభిమానాన్నంతా చేతుల్లోకి ఒంపుకుని కలిపే ఆ కరస్పర్శ ఎన్నినేర్పుతుందని. ఎన్నీ అనుమానాలను పటాపంచలు చేస్తుందని.
ఫొటోలో తప్ప ప్రత్యక్షంగా చూడని కొడుకుని చూస్తున్న ఆయన మనసు ఎంత ఉద్వేగానికి లోనైందని. సంతోషాన్నీ బయటకు కనిపించనీయ వద్దని ఆయన ఎంత ప్రయత్నించినా అర్థమైపోయింది. ఆ రోజు ఆయన మాట్లాడుతుంటే చూడాలి - మొఖం వెలిగిపోయింది. నిజానికి వాడు ఆయన కొడుకు అని ఎవరూ చెప్పలేదు. అట్లా చెప్పరు కూడా. జిరాక్స్‌ కాపీనే కదా. ఎవరూ చెప్పకుండానే అందరికీ తెలిసిపోయింది. ఆ ముగ్గురికి అవి అపురూపమైన క్షణాలు.
సంతోషంగా ఉండాల్సిన ఆ కుటుంబం ఇలా ఎందుకుంది? కారణమేంటి? తన గురించి మాత్రమే తను చూసుకుంటే ఎవరికీ ఏ ప్రమాదమూ ఉండేది కాదేమో. వాళ్లు భిన్నమైన వాళ్ళా ? నిజంగా భిన్నమైన వాళ్లేనా ? మనుషుందరూ మంచిగా బతకాలనుకునే నేరం చేసినవాళ్లు. నిజంగానే వాళ్లు నేరస్తులా?
క్యాంపులో అందరితోపాటు వీడూ నీళ్ల క్యాన్లు రెండిటిని ఆ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి మొసేవాడు అందరిలా. చాలా బక్క ప్రాణి. ʹవద్దులేʹ అన్నా వినేవాడు కాదు. టీ తాగేటప్పుడు ఈ విషయాలను మాట్లాడుకుంటుంటే ఆయనకు ఎంత సంతోషమో. పట్టనట్టే ఉండేవాడు కానీ అన్నీ వినేవాడు. క్యాంపులో ఉన్న ఆ పది పదిహేను రోజులు వాడికి పట్టాపగ్గాలు లేవు. అట్లని తండ్రి దగ్గర కూచుని మాట్లాడిందీ లేదు. అందర్లో కలిసిపోయాడు. అది ఆయనకు మరింత సంతోషాన్నీచ్చింది.

వాడి మీద రాసిన పాట మీటింగ్‌లో పాడుతున్నారు.
ʹʹమన కామ్రేడ్స్‌ పిల్లలు ఎందుకనో దూరంగా ఉంటున్నారు అని అన్న బాధపడేవాడు. పృథ్వి అన్న బాధను తీర్చాడు.ʹʹ పక్కనే వున్న జ్యోతి అంటోంది.
తాము కష్టపడ్డా పిల్లలను సుఖంగా ఉంచానులనుకుంటున్నారు కదా తల్లిదండ్రులు. అందుకే అందరికీ దూరంగా పెంచుతున్నారు, చదివిస్తున్నారు కదా. అదే అసలైన ప్రేమ కదా. ఈయనేంటి? ఇట్లా ఆలోచించారు? అందునా ప్రాణాలకు గ్యారంటీ లేని చోట తన కొడుకు పని చేయానుకున్నాడు. బయట మాత్రం గ్యారంటీ ఉందా? ఎలా బతుకుతున్నాం? అసలు బతకనిస్తున్నారా? ఇదిగో ఈ మీటింగుకు రావడానికి ఎన్ని తంటాలు పడాల్సి వచ్చింది. వంద నోట్లు దొరికితేనా? అప్పు అడిగినా ఇచ్చే స్థితి లేదే. కొత్త కొత్త టెన్షన్లు వచ్చి పడుతుంటాయి. ఈ టెన్షన్లు ఎవరికి వారు కొని తెచ్చుకున్నవేనా? కాదే. కానీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు కదా. అయినా జీవితం ʹవెళ్లమారిʹ పోతోంది కదా. ఇట్లా కాక ఎట్లా జీవించాలి? ఎట్లా జీవించాలో వాళ్లకు తెలుసునా? అందుకేనా ఈ పోరాటం. మరి, జనానికి తెలుస్తోందా? నేను బాగుంటే చాలు పక్కవాడు ఏమైతే నాకేం అనుకునే రోజులు కదా. వీళ్లేంటి తమకంటూ ఏమీ కూడబెట్టుకోవడం లేదు. తమ బాగు చూసుకోకపోతే పోయారు. ప్రాణాలనే ఇచ్చేస్తున్నారు కదా.
పాట అయిపోయింది. ఎవరో మాట్లాడుతున్నారు.
తండ్రిని కలిసి వచ్చిన తర్వాత వాడు అస్సలు చదువుకుంటేనా? ఏదో సాధించిన గర్వం. తల్లి ప్రేమ వాడిని ఎక్కడికీ వెళ్లనీయదనీ, కట్టిపడేస్తుందనీ అనుకున్న. అమాయకురాలిని కాదూ. ఇంతకుముందులా మాట్లాడటమూ తగ్గించాడు. పెద్దవాడు అవుతున్నాడనుకున్నా కానీ దూరమవుతున్నాడనీ గమనించుకోలేకపోయారా. ఇల్లు కాలేజీ తప్ప ఎక్కడికీ వెళ్లేవాడు కాదు. వెళితే తను ఆందోళన పడుతుందని వాడికి తెలుసు. అయినా చాలా సబ్జెక్టుల్లో ఫెయిల్‌. ఏమైంది వీడికి? అడిగితే సమాధానం ఉండదు. ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. అంత పెద్ద కష్టం ఏం వచ్చిందని వీడికి? పిల్లాపాపతో సంతోషంగా జీవించాలని కదా తన ఆరాటం. తండ్రేమో అట్లా. వీడేమో ఇట్లా. పట్టలేని కోపం వచ్చింది. ఎవరికి చెప్పుకోవాలి?
తండ్రి చెప్తేనైనా వింటాడేమో అనుకున్నా.. ఆయనను కలిసాక వెంటనే బయటకు రాలేకపోయినం. కొద్దిరోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. తండ్రే ఏమి చెప్పాడో.. వాడేమీ ఆలోచించుకున్నాడో.. తెలియదు. నన్ను బయటకు తీసుకువచ్చి వదలిపెట్టి, ʹమళ్లీ కలుస్తానమ్మాʹ అంటూ వెళ్లిబోయాడు. ఏదో జరుగుతోందని నాకు అప్పుడే అర్థమైంది. ʹʹఎందుకు నాన్న మళ్లీ వెళ్తున్నావు. ఇంటికి పోదాం రాʹʹ ఆందోళనతోనే అడిగా. ʹʹనిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తానే. ఎప్పుడూ నీతోనే ఉంటానుʹʹ ఎంత నమ్మకంగా చెప్పాడురా.
ఏమనుకున్నాడో బస్టాండు వరకు వచ్చి బస్సెక్కిచ్చి వెళ్లాడు. కనిపించకుండా పోయే వరకు వాడినే చూస్తూ కూచున్నా. ఇప్పుడిక అందుకోలేనంత దూరం వెళ్లిపోయాడు. మొన్న కలిసినప్పుడు చెప్పుకుంటూ పోయింది. ఏడవదేంటి? గుండెలు పగిలేలా ఏడిస్తే బాగుండు.
ఏడ్వడం బలహీనతకు చిహ్నమా? రాళ్లే కదా చెమ్మగిల్లవు. తడి ఉంన్నవాళ్లే కదా ఇతర్ల దుఃఖాన్ని చూసి కంటనీరొలికేది. అవును, వీళ్లకే కదా తడి ఎక్కువ. అందుకే కదా ప్రజల సంపదను గద్దలు తన్నుకుపోకుండా పహారా కాస్తున్నారు. అందుకే కాదు తనూ ప్రాణంగా చూసుకున్న వాడు తండ్రి బాటన వెళ్లినందుకు మౌనంగానైనా ఆమోదించింది, లోలోన ఎక్కడో గర్వపడింది.

ఒక్కసారి బోరున ఏడవవే తల్లి.
తను ఏడిస్తే వాడు చూడలేడనా? నిజంగా వాడిప్పుడు తనను చూస్తున్నాడా? ఎక్కడి నుండి చూస్తూ ఉండి ఉంటాడు. ఈ జనంలో లేడా వాడు? లేకపోతే పొద్దుటి నుంచి మీటింగు జరుగుతున్నా కదలరేంటి? ప్రతీ మాటను అంత శ్రద్ధగా వింటున్నారేమిటి? ఇంకా ఎంతో కాలం బతకకపోవచ్చు ఆ అవ్వ.. పాట పాటకి ముందు వరుసలోకి వచ్చి కూచుంటోంది. ఎందుకు? వయసుల తేడా లేకుండా అందరిలోకీ తొంగి చూస్తున్నాడా వాడు?
ʹʹఅక్క రమ్మంటోందిʹʹ ఒకమ్మాయి వచ్చి చెప్పింది.
వెళ్లాను. ʹʹఇంటికి వెల్దామాʹʹ
మీటింగు నుంచి బయలుదేరాం. ʹʹచూసావా వాణ్ని?ʹʹ
ʹʹఆ... ఎదురొమ్మున మూడు తూటాలు.ʹʹ తన గుండెలను తడుముకుంటూ...
నీ గుండెలకంత నిబ్బరం ఎక్కడి నుంచి వచ్చిందిరా నాన్న? కొండను ఢీకొనాలని నిశ్చయించుకున్నారేమిట్రా..? బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ! అవును పాము... చీమలు.... మీకు బాగు తెల్సు.
ʹʹఎట్లా జరిగిందట?ʹʹ
ʹʹవీళ్లు కవర్‌గా ఉండి ఫైరింగ్‌ చేస్తుంటే ఒక బ్యాచీ కొండ ఎక్కిందట. ఎక్కినవాళ్లు ఫైరింగ్‌ చేస్తుంటే ఆ కవర్లో వీళ్లు ఎక్కుతున్నారట. అప్పుడే మెషిన్‌గన్‌తో కాల్పులు ప్రారంభమైనవట. కొండ ఎక్కుతున్న వాడల్లా రాలిపోయాడట. చూస్తూనే ఉన్నారట మిగతావాళ్లు. ఆ తర్వాత ఇంకో రెండు.ʹʹ
ʹʹఈ ఇల్లూ, ఈ మనుషులను వదిలి ఎక్కడికైనా పారిపోవాలనుందిరాʹʹ
తన రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుని గుండెల్లో దాచుకున్నా. అయినా ఇప్పుడేం తెలుస్తుంది మనిషి లేనితనం. చుట్టూ ఉన్న వాళ్లు వెళ్లిపోయాక... కాలం గడుస్తున్నా కొద్దీ అప్పుడు కదా తెలిసేది. ఇక రారు వాళ్లు. ఎన్నటికీ రారు. అల్లల్లాడిపోతుంది పోదూ మనసు. కొద్దిసేపు అలాగే ఉండిపోయాం.
ʹʹవచ్చిన దగ్గరి నుంచి నీతో మాట్లాడటమే కుదరలేదు. ఇందుకే ఈ రోజు రావడం నాకు ఇష్టం లేకుండేʹʹ అసందర్భమే కావచ్చు. తనను మాట్లాడించాలి.
ʹʹవస్తే ఏమైంది. వాడికి సంతోషం కదాʹʹ
ఇప్పటికీ వాడి సంతోషం కావాలి తనకు. అవును వాడు సంతోషంగా ఉండాలి. తను ఎట్లా ఉంటె వాడు సంతోషంగా ఉంటాడు?
ఇప్పుడు వాడూ, వాడి సంతోషం ఆమె ఒక్కదాని సొంతమా ? కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూన్న అమ్మని కూడా కాదని వెళ్ళిపోయాడే. కాళ్ళా వెళ్ళా పడ్డా వినలేదే. తన స్వార్థం కోసం వదిలేసి పోయాడా ? పోనీ ఓ అమ్మాయి ప్రేమ కోసం అమ్మని వదిలేసాడా ? అట్లా చేసినా బాగుండునే. ప్రాణాలతో ఉండిపోవునే.
ఇన్నేoడ్లల్లో వాళ్లు ఏమి సాధించారు -ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప. మొన్నీ మధ్యే ఓ పెద్ద మనిషి.
నిజంగా వాళ్లు ఏమీ సాధించ లేదా ? సాధించనే లేదా ?
అనగనగా ఓ అడవి. ఆ అడవికో రాజు పులిరాజు. ఆ రాజు ఎలాంటి వాడయ్యా అంటే దొర. పుట్టేదీ, గిట్టేదీ తన కోసం. ఇది రాజుగారి శాసనం. ఆ అడవిలోని ఆడప్రాణులన్ని వాడి సొంతమే. అంతేనా? ప్రతి ప్రాణి శ్రమా వాడిదే. ఆ అడవిలోని ప్రతి జీవీ వాడి కోసమే. ఎంత చెమటోడ్చినా నోటి కాడి ముద్ద తన్నుకు పోయేవాడు. ఏ ప్రాణి అయినా ప్రశ్నించిoదా ? తెల్లవారి చచ్చి పడి ఉండేది. లేదూ ప్రశ్నిస్తే ఇదే గతని అడవిలోని బక్క జీవులన్నింటినీ పోగేసి చావ బాదేవాడు. తరాలు గడిచినా ఆ జీవుల తల రాతలు మారలేదు.
అదిగో అప్పుడు ప్రవేశించాయయ్యా కొన్ని కుందేళ్లు, మరికొన్ని లేళ్ళు. ఇక నీ ఆటలు చెల్లవన్నాయి. జీవులనన్నింటినీ ఏకo చేసాయి. భయపడిన జంతువులతో... మీ ప్రాణాలకు మా గుండెలు అడ్డేస్తాము అన్నాయి.
అదిగదిగో అట్లాంటిదయ్యా వాళ్ల తెగువ.
రాజు ఊకుంటాడా? సింహం దగ్గరికి వెళ్ళాడు. చెప్పుకున్నాడు తన గోడు. తెచ్చుకున్నాడు తోడు గద్దలను, నక్కలను, తోడేళ్ళను, కొన్ని సర్పాలను.
ఉంటే ప్రాణo... పోతే ప్రాణo.. కదిలాయయ్యా చిన్నా పెద్దా జంతువులన్నీ చీమల దండులా.
ఏమిటీ....!? పాములు పుట్టలనోదిలి పారిపోయాయా ? పులులు తమ రాజ్యాలను విడిచి వెళ్లిపోయాయా !? ఎట్లెట్లా ?
ఊర్లకు ఊర్లు పట్టణాలకు పట్టణాలు ఇదే చర్చ కాదా సార్. వాళ్ళ చేత ప్రభావితులు కాని వాళ్ళెవరూ ? ద్వేషం వెళ్ళ గక్కుతూనో.. అభిమానంతోనో.
మరి వాల్లేమి సాధించ లేదని అంటారేమిటి సార్ ?
నిజంగా వాళ్లు ఏమీ సాధించ లేదా ? సాధించనే లేదా ?
మరి ఈ బూడిద రంగు కుక్కలా సృష్టి ఎందుకు సార్? ఎక్కడో ఏడేడు సముద్రాల ఆవల ఉన్న రాబందు దృష్టి వీళ్ళ మీద సారించెను ఎందుకు సార్ ?
వాళ్ళ నెత్తురుతో పల్లెలు, అడవులు తడిసిపోతే ఎం జరగలేదు అంటారేమిటి సార్?
ʹʹరష్యా, చైనా దెబ్బతిన్నాయి. ఎందుకు అనేది పక్కన పెడదాం. మీ మాట ప్రకారం కమ్యూనిజం ఒడి పోయింది అనుకుందాం -కాసేపటి వరకు. మీకు మంచిదే కదండీ. మరి పిడికెడు మంది కూడా లేని వాళ్ళ కోసం ఇంత శ్రమ ఎందుకు పడుతున్నారండి? వాళ్ళ కోసం అడవుల వెంట ఎందుకు తిరుగుతున్నారండీ? వాళ్ళ మానాన వాళ్ళు ఎదో జనంతో మీటింగులు పెట్టుకుంటున్నారు. మీకొచ్చిన నష్టమేమి ఉందండీ? వాళ్ళను చూసి ఇంత భయపడుతున్నారెందుకండీ ? అంటే వాళ్ళ దగ్గర ఎదో ఉంది.ʹʹ పోలీసులు వేసిన పాప్లేట్లపై రుక్మిణక్క మాట్లాడుతోంది. మైకులో ఇంటి వరకూ వినిపిస్తోంది.
ʹʹఇంకా ఎంత కాలం బతుకుతాంరా ? ఏదైనా సంఘంలో పని చేద్దాం.ʹʹ
ʹʹసరే చేద్దాం.ʹʹ
ʹʹపిల్లలను పోగొట్టుకున్న నా లాంటి తల్లులు ఎందరో ఉన్నారు కదా. వాళ్ళ కోసం ఏదైనా ఆశ్రమం నడపాలని.ʹʹ
ʹʹసరేʹʹ
ʹʹవాడు పైనుంచి చూస్తుంటాడు కదా అని. నమ్మకాలు లేవు కానీ మనసుకు అలా అనిపిస్తుంది.ʹʹ
మూఢ నమ్మకాలు లేవు కానీ వాడి నమ్మకాలు, విశ్వాసాలు పోతూ పోతూ తల్లికి ఇచ్చి పోయాడా ?. నమ్మకమూ, విస్వాసం... వీటికి అర్థాలు మారి చాలా కాలమే కాలేదూ. ఎవరి నమ్మకాలు వారివి. నా కోసమే నేను. వాళ్ళ విస్వాశాల కోసం నేనెందుకు మారాలి ? అవును, ఎవరి కోసమో నువ్వెందుకు మారాలి ? నీ కోసమైనా నువ్వు మారకూడదా. గంటలు గంటలు ఏటీఎంల దగ్గర క్యూ లైన్లలో నిలబడుతున్నావు కదా? నా బతుకు నేను బతుకుంటే రోడ్డుకెందుకు ఈడ్చావని నిలదీయకూడదా ? నీ కోసమే. ఇంకెవరి కోసమో వద్దు. కేవలం నీ కోసమే. ఇలాంటివి ఇంకెన్ని ప్రశ్నిచాలి? వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం బతకలేదు. కనీసం నువ్వు నీ కోసమైనా బతకకూడదా?

"వెళ్తాను"
"ఈ రాత్రికి ఉండరాదు"
"ఉండాలనే ఉంది. కానీ ఇట్లా కాదు. నీ కోసమే వచ్చి ఉంటా "
ఇంట్లో నుంచి బయటకి నాతో పాటూ వచ్చింది. ఉంటానని చేతులు కలిపా.
నన్ను గుండెలకు హాత్తకుని నా నొసటి మీద ముద్దు పెట్టుకుంది - వాడిలాగే. అచ్చం వాడిలాగే.

- తాయమ్మ కరుణ‌

Keywords : maoists, martyrs, fake encounter, story, thayamma karuna, writer, munna, ramakrishna
(2024-04-17 18:10:37)



No. of visitors : 2167

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹʹవాళ్లుʹʹ