సరిహద్దుల్లోజవాన్ల‌ ఆకలి కేకలు ‍- అధికారుల అవినీతి పై ఆగ్రహ జ్వాలలు


సరిహద్దుల్లోజవాన్ల‌ ఆకలి కేకలు ‍- అధికారుల అవినీతి పై ఆగ్రహ జ్వాలలు

దేశ సరిహద్దులో మంచుకొండల మీద ప్రతి క్షణం అప్రమత్తతతో... సైనికుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ? దేశ భక్తిని బిజినెస్ గా మార్చి, ఓట్లుగా మార్చి కులికే పాలకులు... ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పనులను ఎవ్వరు విమర్షించినా... సైన్యం మనకోసం ప్రాణాలిస్తోందని. పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం వినిపించే భక్త జనం.. ఈ వీడియో తప్పక చూడాలి. తేజ్ బహదూర్ యాదవ్ అనే ఈ BSF జవాను పెడుతున్న ఆకలి కేకలను తప్పక వినాలి. జవాన్ల శవాలపై ఓట్లను ఏరుకునే పాలకుల నీతిని తప్పక తెలుసుకోవాలి.

ʹదేశప్రజల‍ందరికీ నమస్కారం

నేను మీకు మా బాధలు వినిపించదల్చుకున్నాను. మేము భారీగా కురుస్తున్న ఈ మంచులో పొద్దున 6 గంటలనుండి సాయంత్రం 5 గంటలదాకా రోజూ 11 గంటలు కంటిన్యూగా నిలబడే డ్యూటీ చేస్తూనే ఉంటాము. మంచుకురుస్తున్నా.... వర్షాలు పడుతున్నా... తుఫాన్లొచ్చినా మేము మాడ్యూటీని సాగిస్తూనే ఉంటాము. ఈ వీడియోలో నా వెనుక కనపడుతున్న దృశ్యాలు మీకు చాలా అందంగా ఉన్నాయనుకుంటా. కానీ ఇక్కడ మాజీవితాలు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. మా ఈ జీవితాల గురించి ఏ మీడియా చూయించదు. ఏ మంత్రి, ఏ ప్రభుత్వమూ వినదు. నేను మీకు చూయిస్తున్న ఈ వీడియో.. మా అధికార్లు మాపట్ల ఎంత అన్యాయం చేస్తున్నారో... ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ప్రభుత్వం మాకోసం కేటాయిస్తున్న రేషన్ లో కొద్ది భాగం మాత్రమే మాకు దక్కుతుంది.మొత్తం అధికారులే కాజేస్తారు. ( అమ్ముకుంటారని ఈ జవాను భావం ) చాలా సార్లు మేము ఆకలి కడుపులతో పడుకోవాల్సి వస్తుంది. పొద్దున టిఫిన్ పేరుతో ఒక పరోటా ఇస్తారు. దాంట్లో కూరగానీ , పప్పుగానీ ఉండదు. ఒక టీ మాత్రం ఇస్తారు. ఇక మధ్యాహ్నం పప్పులో పసుపు, ఉప్పు తప్ప ఇంకేమీ ఉండదు. పోపు కూడా వేయకుండా ఉన్న ఆపప్పుతో పరోటాతో కడుపు నింపుకోవాలి. ఈ పరిస్థితి పై ప్రధానమంత్రి విచారణ జరపాలని నా వినతి. నేను ఈ వీడియోను ఇలా ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసినందుకు రేపు నేనుంటానో లేదో నేను చెప్పలేను. ఎందుకంటే మా అధికారులు దేనికైనా తెగిస్తారు. మీరు మాత్రం ఈ వీడియోను అందరూ షేర్ చేయండి ఇక్కడి మాకష్టాలు అధికారుల అవినీతి గురించి దేశం మొత్తం తెలియాలిʹ

తేజ్ బహదూర్ యాదవ్ అనే ఈ BSF జవాను తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పై పెట్టిన వీడియో ఇప్పటికే లక్షలమంది చూశారు. అనేక మంది షేర్లు చేశారు. ఇంకా ప్రభుత్వందృష్టికి అధికారుల దృష్టికి వెళ్ళినట్టు లేదు. ఎందుకంటే ఇంకా ఆయన ఫేస్ బుక్ పేజ్ లైవ్ గానే ఉంది. ఇవ్వాళ్ళ పొద్దున కూడా అతను గుడ్ మార్నింగ్ చెప్పాడు.
చివరగా... అతని అమాయకత్వం ఏంటంటే అధికారులే అవినీతి పరులని ప్రభుత్వం చాలా మంచిదనుకోవడం

Keywords : miletery, army, india, latest news, hunger,Officers
(2019-04-17 00:10:23)



No. of visitors : 1734

Suggested Posts


కడుపునిండా అన్నం అడిగినందుకు BSF జవానుపై అధికారుల దుర్మార్గపు దాడి !

నుకన్నట్టే అవుతోంది. తమ అవినీతి బట్టబయలు చేసిన BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ పై అధికార్లు కత్తిగట్టారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కుక్కను చంపేందుకు పిచ్చికుక్క్త అనే ముద్ర వేసినట్టు అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్మార్గపు దాడి చేస్తున్నారు....

ʹనాభర్త ఏమయ్యాడొ తెలియడం లేదు... నాకొడుకును ఆర్మీలో చేర్చనుʹ

BSF జవాన్లు ఆకలితో ఎలా అలమటిస్తున్నారో, వారికి రావాల్సిన రేషన్ ను అధికారులు అమ్ముకుంటున్నారో BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ లో వీడియో పెట్టిన తర్వాత నుండి అతను తమకు కాంటాక్ట్ లో లేకు‍ండా పోయాడని, అతను ఎక్కడున్నాడో కూడా తెలియడంలేదని అతని భార్య ఆందోళన చెందుతున్నారు...

నిన్న తేజ్‌బహదూర్‌.. నేడు జీత్‌ సింగ్ - ‍వెలుగు చూస్తున్న‌ జవాన్ల దుర్భర జీవితాలు

నిన్నBSF జవాను తేజ్‌బహదూర్‌ యాదవ్‌ తమకు పెడుతున్న ఆహారం గురించి, అధికారుల అవినీతి గురించి వీడియో ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తే. ఇప్పుడు ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అతనికి తోడుగా గొంతు విప్పాడు. జీత్‌సింగ్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్.....

జవాన్ల ఆకలి కేకలు, అధికారుల అవినీతి బాగోతాలు ‍- వెలుగు చూస్తున్న కొత్త నిజాలు

సరిహద్దులో జవాన్ల ఆకలి కేకలు , అధికారుల అవినీతి బాగోతాన్నిBSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన తర్వాత అధికారుల అవినీతి కథలు మరిన్ని బయటపడుతున్నాయి....

మమ్ములను భానిసలకన్నా హీనంగా చూస్తున్నారు ‍- మరో సైనికుడి ఆవేదన‌

భారత సైనికులపై సైనికాధికారుల వేధింపులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో.. వాళ్ళను భానిసలకన్నా నీచంగా ఎలా చూస్తున్నారో మరో సైనికుడు గొంతు విప్పాడు. BSF జవాను తేజ్ బహదూర్ సింగ్ తమ దుర్భర జీవితాన్ని ప్రపంచానికి వెల్లడించిన తర్వాత ఒక్కొక్కరు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. మొన్న తేజ్ బహదూర్ సింగ్ నిన్న జీత్ సింగ్ ఇవ్వాళ్ళ యగ్య ప్రతాప్ సింగ్ ...

పెరుగుతున్న అణిచివేత, ఒత్తిడి ‍‍- ‍ తోటి వారిని కాల్చి చంపిన జవాను

మిలటరీ, పారా మిలటరీ బలగాల్లో అధికారుల వేధింపుల పట్ల రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ గోడు ప్రపంచానికి వెళ్ళబోసుకుంటే వత్తిడి భరించలేని మరో CISF జవాను ఏకంగా కాల్పులు జరిపి నలుగురు సాటి జవాన్లనే బలిగొన్నాడు....

ప్రశ్నించినందుకు ఆ సైనికుడిని డిస్మిస్ చేశారు

పై అధికారులు తమ ఆహారాన్ని అమ్ముకుంటూ తమను ఆకలికి మాడిపోయేట్టు చేస్తున్నారని ఆరోపణలు చేసిన బీఎస్ఎఫ్ జ‌వాను తేజ్‌బ‌హ‌దూర్ యాద‌వ్ గుర్తున్నాడా ? అతన్ని ఉద్యోగంలోంచి తొలిగించారు. బీఎస్ ఎఫ్ జవాన్లకు పెడుతున్న ఆహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అతనిపై బీఎస్ ఎఫ్ అధికారులు...

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
more..


సరిహద్దుల్లోజవాన్ల‌