దళిత యువకుడి హత్య...అగ్రకుల హంతకులకు పోలీసుల మద్దతు

దళిత

పోలీసుల లెక్కల ప్రకారం...

సతీష్ అనే ఈ దళిత యువకుడు ఓ కరెంట్ స్తంభానికి తనను తానే కట్టేసుకున్నాడు. కర్రలతో ఇనుప రాడ్లతో తనకు తానే కొట్టుకున్నాడు. రక్తాలు కారుతున్న తన శరీరం మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సగం కాలిన ఆ శరీరాన్ని మాత్రం సతీష్ ఫ్రెండ్ ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. ఆస్పత్రిలో సతీష్ చనిపోయాడు. సతీష్ తనను తానే హత్య చేసుకుంటే ఎవరి మీద హత్యకేసు పెట్టాలి ? అందుకే అసలు కేసే పెట్టకూడదని పోలీసులు నిర్ణయించుకున్నారు. పనీ పాట లేని, తిండికి గతిలేని, అల్లరి మూకలు గొడవ చేయడంతో తప్పక కేసు నమోదు చేయాల్సి వచ్చింది. కేసు బుక్ చేసినా సరే న్యాయం చచ్చిపోకుండా ఉండేందుకు . సతీష్ ది అనుమానాస్పద మృతిగానే కేసు పెట్టారు.

23 ఏండ్ల సతీష్ ది తమిళనాడు లోని విల్లుపురం జిల్లా కందమంగలం పంచాయితీలోని పెరియాబబుసమిత్తిరం కాలనీ రోజు కూలీ అయిన సతీష్ అతని మితృలు తమ కాలనీలో డిశంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలు జరుకున్నారు. అక్కడికి దగ్గరలోనే అగ్రకుల యువకులు కూడా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. దళితుల పాటలు డ్యాన్సులు అగ్రకులస్తులకు నచ్చలేదు. అసలు దళితులు వేడుకలు జరపుకోవడం అగ్రకులస్తులకు అస్సలు నచ్చలేదు. దాంతో మాటా మాటా పెరిగి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే దళిత పెద్దలు యువకులకు నచ్చజెప్పి పంపించేశారు. ఆ తర్వాత 4 వతేదీ రాత్రి ఏదో పని మీద సతీష్ రసపుత్తిర పాలాయం వెళ్ళాడు . రాత్రి 10 గంటలకు ఒంటినిండా దెబ్బలతో సగంకాలిన శరీరంతో సతీష్ అక్కడికి దగ్గర లోని తన మితృడి ఇంటి తలుపు తట్టాడు. సతీష్ పరిస్తితి చూసి అతని మితృడు హుటాహుటిన అరియూర్ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. ప్రాథమిక చికిత్స అనంతరం పాండిచ్చేరీకి తరలించారు. చికిత్సపొందుతూ సతీష్ 6వ తేదీన మరణించాడు. మరణించే ముందు సతీష్ మెజిస్ట్రేత్ కు ఇచ్చిన మరణ వాగ్మూలంలో..... ʹʹమొహాలకు ముసుగులు తొడుక్కున్న కొంతమంది నామీద దాడి చేశారు. నన్ను బలవంతంగా అక్కడున్న ఓ కరెంటు స్తంభానికి కట్టేశారు. ఇష్టమొచ్చినట్టు కర్రలతో కొట్టారు. ఆపై నామీద కిరోసిన్ పోసి నిప్పంటించారు. వాళ్ళతో పెనుగులాడి తప్పించుకుని నా మితృడి ఇంటికి వెళ్ళానుʹʹ

సతీష్ ఆస్పత్రిలో ఉండగానే 5 వతేదీనాడు సతీష్ తల్లి కందమంగళం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. తన కుమారుడి పై దాడి చేసిన అగ్రకులస్తులపై కేసు నమోదు చేయాలని కోరింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి తిరస్కరించారు.ఆ మర్నాడు సతీష్ చని పోయిన విషయం తెలుసుకున్న లిబరేషన్ పాంథర్స్ అనే సంస్థ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగింది దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అది హత్య కేసు కాదు అనుమానాస్పద మృతి అని. పైగా సతీష్ కు ఆక్సిడెంట్ అయ్యిందని , ఎలక్ట్రిక్ షాక్ వల్ల శరీరం కాలిపోయిందని పోలీసు జడ్జిలు తేల్చేశారు. పోలీసుల వాదనను ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులు తోసిపుచ్చుతున్నారు. పోల్ వల్ల ఒక వేళ షాక్ తగిలినా సతీష్ శరీరంపై ఉన్న కర్రలతో కొట్టిన గుర్తులు, నెత్తుటి చారికలు ఎక్కడి నుండి వచ్చాయన్నది అగ్రమూకల చేతుల్లో కీలు బొమ్మలైన‌ పోలీసులు ఎందుకు చెప్తారు ?

Keywords : tamilanadu, dalit, hindutva, murder, police
(2024-04-24 20:59:01)



No. of visitors : 1601

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


దళిత