కడుపునిండా అన్నం అడిగినందుకు BSF జవానుపై అధికారుల దుర్మార్గపు దాడి !

కడుపునిండా

అనుకన్నట్టే అవుతోంది. తమ అవినీతి బట్టబయలు చేసిన BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ పై అధికార్లు కత్తిగట్టారు.ఓ కుక్కను చంపేందుకు పిచ్చికుక్క్త అనే ముద్ర వేసినట్టు అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్మార్గపు దాడి చేస్తున్నారు.
తేజ్ బహదూర్ యాదవ్ అనే BSF జవాను దేశ సరిహద్దుల్లోని మంచు కొండల్లో తాము ఆకలితో ఎలా బాధలు అనుభవిస్తున్నామో తమకు వచ్చే రేషన్ అధికారులు ఎలా అమ్ముకుంటున్నారో వీడియో తీసి మరీ తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పెట్టడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో హుటాహిటిన కదిలిన అధికారులు ముందుగా ఆ జవానుపై దాడికి దిగారు. అతను చెప్పిన విషయాలలోని నిజానిజాల గురించి మాట్లాడకుండా అతనో తాగుబోతని, క్రమశిక్షణ లేనివాడని... అసలు డ్యూటీలో ఉండగా సెల్ ఫోన్ ఎలా వాడతాడని ..ఇలా రకరకాల ఆ జవానుపై దుర్మార్గమైన దాడికి దిగారు. ఈ విషయంపై విచారణకు ఆదేశిస్తున్నామని చెబుతూనే.. బహదూర్ యాదవ్ చెబుతున్నట్టు అక్కడ అలాంటి పరిస్థితులు లేవని ఒక సారి.. చలి కాలం కాబట్టి తిండికి కొద్దిగా ఇబ్బందులు నిజమేనని మరోసారి. రకరకాలుగా మాట్లాడుతున్నారు. తమ ప్రాణాలకు తెగించి చలిలో మంచులో, తుఫాన్లలో సరిహద్దులను కాపాడుతున్న జవాన్ల పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన తేజ్ బహదూర్ యాదవ్ ను అక్కడినుంచి బదిలీ చేశారు.

బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ డి.కె. ఉపాథ్యాయ ఈ అంశంపై మంగళవారం జమ్ములో మీడియాతో మాట్లాడారు.
ʹʹమన సైనికులకు అందించే భోజనం ఏమంత బాగుండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైగా ఇది చలికాలం కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఏ ఒక్కరూ ఫిర్యాదు చెయ్యలేదు. బీఎస్‌ఎఫ్‌ చరిత్రలోనే మొదటిసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అందరం షాకయ్యాంʹʹ

జవాన్లకు సరిగా తిండి లేని పరిస్థితి వీళ్ళకు ముందునుండి తెలుసట ! అందుకు వీళ్ళెప్పుడూ షాక్ అవలేదు కానీ ఓ జవాను ఆ విషయాలను ప్రపంచానికి తెలియజేసినందుకు షాక్ అయ్యారట !

ʹʹబీఎస్‌ఎఫ్‌ నియమావళి ప్రకారం డ్యూటీలో ఉండే జవాన్లు మొబైల్‌ ఫోన్లు వినియోగించకూడదు. తేజ్‌ బహదూర్‌ ఆ నిబంధనలను అతిక్రమించి మొబైల్‌ను వినియోగించాడు. చుట్టుపక్కల దృశ్యాలన్నీ కనిపించేలా వీడియోలో మాట్లాడాడు. ఇది క్షమించరాని తప్పిదం. ఈ విషయంలో అతనిపై విచారణ తప్పదుʹʹఅని ఐజీ ఉపాథ్యాయ పేర్కొన్నారు.

రేష‌న్ అమ్ముకోవడం జవాన్లు ఆకలితో నకనకలాడటం నేరంకాదట కానీ ఆ జవాని సెల్ ఫోన్ వాడటం క్షమించరాని నేరమట ! దానిపై విచారణ జరుపుతారట !

సదరు వీడియో పోస్ట్‌ చేసిన తేజ్‌బహదూర్‌ యాదవ్‌ గతంలో(2010)నూ ఓసారి క్రమశిక్షణా నియమాలను ఉల్లంఘించి, కోర్ట్‌మార్షల్‌కు గురయ్యేపరిస్థితిని కొనితెచ్చుకున్నాడని ఐజీ తెలిపారు. కుటుంబపరిస్థితి దృష్ట్యా అప్పట్లో అతనిని క్షమించి వదిలేశామని గుర్తుచేశారు. వీడియో వైరల్‌ అయిందని తెలిసిన వెంటనే డీఐజీ స్థాయి అధికారి ఒకరు తేజ్‌బహదూర్‌ పనిచేస్తోన్న ప్రాంతానికి వెళ్లి, తనిఖీలు చేపట్టారని, ఆ సమయంలో తేజ్‌బహదూర్‌ నుంచిగానీ, ఇతర జవాన్లనుంచిగానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఐజీ ఉపాథ్యాయ చెప్పారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా జవాన్‌ తేజ్‌ బహదూర్‌ను మరో హెడ్‌ క్వార్టర్స్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.

అధికారులు తనిఖీలకు వెళ్తే ఎవ్వరూ పిర్యాదు చేయలేదట ! కాబట్టి అంతా అద్భ్తమని లోకాన్ని నమ్మించడానికి పాపం ఐజీ గారు చాలా కష్టపడుతున్నారు కానీ వాళ్ళ అధికారులముందు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ళే నోరు తెరవరు అలాంటిది BSF జవాన్లు అధికారులముందు నోరుతెరిచి నిజాలు మాట్లాడే సాహసం చేయగలరా. అందులోనూ అధికారులు చేసే అవినీతి గురించి మాట్లాడటం అంటే చావును కొని తెచ్చుకోవడం కాదా !

Keywords : army, bsf, officers, modi, hungry, india, latest news,
(2024-04-11 19:28:51)



No. of visitors : 4951

Suggested Posts


ʹనాభర్త ఏమయ్యాడొ తెలియడం లేదు... నాకొడుకును ఆర్మీలో చేర్చనుʹ

BSF జవాన్లు ఆకలితో ఎలా అలమటిస్తున్నారో, వారికి రావాల్సిన రేషన్ ను అధికారులు అమ్ముకుంటున్నారో BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ లో వీడియో పెట్టిన తర్వాత నుండి అతను తమకు కాంటాక్ట్ లో లేకు‍ండా పోయాడని, అతను ఎక్కడున్నాడో కూడా తెలియడంలేదని అతని భార్య ఆందోళన చెందుతున్నారు...

సరిహద్దుల్లోజవాన్ల‌ ఆకలి కేకలు ‍- అధికారుల అవినీతి పై ఆగ్రహ జ్వాలలు

ఈ వీడియోలో నా వెనుక కనపడుతున్న దృశ్యాలు మీకు చాలా అందంగా ఉన్నాయనుకుంటా. కానీ ఇక్కడ మాజీవితాలు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. మా ఈ జీవితాల గురించి ఏ మీడియా చూయించదు. ఏ మంత్రి, ఏ ప్రభుత్వమూ వినదు. నేను మీకు చూయిస్తున్న ఈ వీడియో.. మా అధికార్లు మాపట్ల ఎంత అన్యాయం చేస్తున్నారో... ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ...

నిన్న తేజ్‌బహదూర్‌.. నేడు జీత్‌ సింగ్ - ‍వెలుగు చూస్తున్న‌ జవాన్ల దుర్భర జీవితాలు

నిన్నBSF జవాను తేజ్‌బహదూర్‌ యాదవ్‌ తమకు పెడుతున్న ఆహారం గురించి, అధికారుల అవినీతి గురించి వీడియో ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తే. ఇప్పుడు ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అతనికి తోడుగా గొంతు విప్పాడు. జీత్‌సింగ్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్.....

మమ్ములను భానిసలకన్నా హీనంగా చూస్తున్నారు ‍- మరో సైనికుడి ఆవేదన‌

భారత సైనికులపై సైనికాధికారుల వేధింపులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో.. వాళ్ళను భానిసలకన్నా నీచంగా ఎలా చూస్తున్నారో మరో సైనికుడు గొంతు విప్పాడు. BSF జవాను తేజ్ బహదూర్ సింగ్ తమ దుర్భర జీవితాన్ని ప్రపంచానికి వెల్లడించిన తర్వాత ఒక్కొక్కరు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. మొన్న తేజ్ బహదూర్ సింగ్ నిన్న జీత్ సింగ్ ఇవ్వాళ్ళ యగ్య ప్రతాప్ సింగ్ ...

జవాన్ల ఆకలి కేకలు, అధికారుల అవినీతి బాగోతాలు ‍- వెలుగు చూస్తున్న కొత్త నిజాలు

సరిహద్దులో జవాన్ల ఆకలి కేకలు , అధికారుల అవినీతి బాగోతాన్నిBSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన తర్వాత అధికారుల అవినీతి కథలు మరిన్ని బయటపడుతున్నాయి....

పెరుగుతున్న అణిచివేత, ఒత్తిడి ‍‍- ‍ తోటి వారిని కాల్చి చంపిన జవాను

మిలటరీ, పారా మిలటరీ బలగాల్లో అధికారుల వేధింపుల పట్ల రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ గోడు ప్రపంచానికి వెళ్ళబోసుకుంటే వత్తిడి భరించలేని మరో CISF జవాను ఏకంగా కాల్పులు జరిపి నలుగురు సాటి జవాన్లనే బలిగొన్నాడు....

ప్రశ్నించినందుకు ఆ సైనికుడిని డిస్మిస్ చేశారు

పై అధికారులు తమ ఆహారాన్ని అమ్ముకుంటూ తమను ఆకలికి మాడిపోయేట్టు చేస్తున్నారని ఆరోపణలు చేసిన బీఎస్ఎఫ్ జ‌వాను తేజ్‌బ‌హ‌దూర్ యాద‌వ్ గుర్తున్నాడా ? అతన్ని ఉద్యోగంలోంచి తొలిగించారు. బీఎస్ ఎఫ్ జవాన్లకు పెడుతున్న ఆహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అతనిపై బీఎస్ ఎఫ్ అధికారులు...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కడుపునిండా