include 'men';
?>
నిన్న తేజ్‌బహదూర్.. నేడు జీత్ సింగ్ - వెలుగు చూస్తున్న జవాన్ల దుర్భర జీవితాలు
వాళ్ళ పెట్టుబడి, గద్దెలు కాపాడేందుకు... వాళ్ళపై జనం ఎదురుతిరిగితే కాల్చి చంపేందుకు... ఉష్కో అనగానే వాళ్ళకు నచ్చని వాళ్ళమీదికి ఉరకడానికి... అవసరమైతే వాళ్ళకోసం చచ్చేందుకు... అనుక్షణం వాళ్ళకు కాపలా కాయడానికి పాలకులు ఉపయోగించుకునే పారా మిలటరీ బలగాలు దుర్భర జీవితాలు గడుపుతున్నాయనే నిజాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి.
నిన్నBSF జవాను తేజ్‌బహదూర్ యాదవ్ తమకు పెడుతున్న ఆహారం గురించి, అధికారుల అవినీతి గురించి వీడియో ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తే. ఇప్పుడు ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అతనికి తోడుగా గొంతు విప్పాడు. జీత్‌సింగ్ అనే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్... సైన్యంతో సమానంగా తామూ విధులు నిర్వరిస్తున్నా సౌకర్యాల విషయంలో తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.
ʹసైన్యంలో పనిచేసే సిబ్బందికి సౌకర్యాలు కల్పిస్తున్నారని మాకేమీ బాధ లేదు. కానీ మేం అడుగుతున్నది మా పట్ల చూపుతున్న వివక్ష గురించే. మాకు క్యాంటీన్ సౌకర్యం లేదు. కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవు. మా పెన్షన్ ఆగిపోయింది. అవసరమైన సమయంలో సెలవు తీసుకోడానికి లేదు. మా పనులు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. లోక్‌సభ ఎన్నికలనుంచి స్థానిక ఎన్నికల వరకు అన్నిటికీ మేమే భద్రత ఇస్తాం. విమానాశ్రయం, ప్రార్థనాలయాల్లాంటి అన్ని ప్రముఖ ప్రదేశాలకూ మా భద్రత కావాలి. కానీ మా సెలవులేమో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ అడవుల్లో, కశ్మీర్ లోయల్లో గడిచిపోతుంటాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు జీతాలు చెల్లిస్తున్నారు. వారు సెలవులను తమ కుటుంబంతో కలిసి గడుపుతారు. సీఆర్పీఎఫ్ జవాన్లకు ఎలాంటి సంక్షేమ పథకాలూ లేవు.. అసలు మా గోడు పట్టించుకునేవారెవరు? పెన్షన్ కూడా ఆపేశారు.. ఉద్యోగం నుంచి రిటైరయ్యాక మేం ఎలా బతకాలిʹ అంటూ జీత్ సింగ్ ఈ వీడియోలో పలు ప్రశ్నలు సంధించాడు.
తేజ్ బహదూర్ ఫిర్యాదుపై బీఎస్ఎఫ్ అధికారులు ప్రత్యారోపణలతో, అతని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేసిన అధికారులు మరి జీత్ సింగ్ ప్రశ్నలకు స్పందిస్తారో చూడాలి.
Keywords : army, tej bahadur, jeet singh, modi, bsf, crpf,
(2024-03-23 13:09:34)
No. of visitors : 1982
Suggested Posts
| కడుపునిండా అన్నం అడిగినందుకు BSF జవానుపై అధికారుల దుర్మార్గపు దాడి !
నుకన్నట్టే అవుతోంది. తమ అవినీతి బట్టబయలు చేసిన BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ పై అధికార్లు కత్తిగట్టారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కుక్కను చంపేందుకు పిచ్చికుక్క్త అనే ముద్ర వేసినట్టు అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్మార్గపు దాడి చేస్తున్నారు.... |
| ʹనాభర్త ఏమయ్యాడొ తెలియడం లేదు... నాకొడుకును ఆర్మీలో చేర్చనుʹBSF జవాన్లు ఆకలితో ఎలా అలమటిస్తున్నారో, వారికి రావాల్సిన రేషన్ ను అధికారులు అమ్ముకుంటున్నారో BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ లో వీడియో పెట్టిన తర్వాత నుండి అతను తమకు కాంటాక్ట్ లో లేకుండా పోయాడని, అతను ఎక్కడున్నాడో కూడా తెలియడంలేదని అతని భార్య ఆందోళన చెందుతున్నారు... |
| సరిహద్దుల్లోజవాన్ల ఆకలి కేకలు - అధికారుల అవినీతి పై ఆగ్రహ జ్వాలలుఈ వీడియోలో నా వెనుక కనపడుతున్న దృశ్యాలు మీకు చాలా అందంగా ఉన్నాయనుకుంటా. కానీ ఇక్కడ మాజీవితాలు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. మా ఈ జీవితాల గురించి ఏ మీడియా చూయించదు. ఏ మంత్రి, ఏ ప్రభుత్వమూ వినదు. నేను మీకు చూయిస్తున్న ఈ వీడియో.. మా అధికార్లు మాపట్ల ఎంత అన్యాయం చేస్తున్నారో... ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ... |
| మమ్ములను భానిసలకన్నా హీనంగా చూస్తున్నారు - మరో సైనికుడి ఆవేదనభారత సైనికులపై సైనికాధికారుల వేధింపులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో.. వాళ్ళను భానిసలకన్నా నీచంగా ఎలా చూస్తున్నారో మరో సైనికుడు గొంతు విప్పాడు. BSF జవాను తేజ్ బహదూర్ సింగ్ తమ దుర్భర జీవితాన్ని ప్రపంచానికి వెల్లడించిన తర్వాత ఒక్కొక్కరు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. మొన్న తేజ్ బహదూర్ సింగ్ నిన్న జీత్ సింగ్ ఇవ్వాళ్ళ యగ్య ప్రతాప్ సింగ్ ... |
| జవాన్ల ఆకలి కేకలు, అధికారుల అవినీతి బాగోతాలు - వెలుగు చూస్తున్న కొత్త నిజాలుసరిహద్దులో జవాన్ల ఆకలి కేకలు , అధికారుల అవినీతి బాగోతాన్నిBSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన తర్వాత అధికారుల అవినీతి కథలు మరిన్ని బయటపడుతున్నాయి.... |
| పెరుగుతున్న అణిచివేత, ఒత్తిడి - తోటి వారిని కాల్చి చంపిన జవానుమిలటరీ, పారా మిలటరీ బలగాల్లో అధికారుల వేధింపుల పట్ల రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ గోడు ప్రపంచానికి వెళ్ళబోసుకుంటే వత్తిడి భరించలేని మరో CISF జవాను ఏకంగా కాల్పులు జరిపి నలుగురు సాటి జవాన్లనే బలిగొన్నాడు.... |
| ప్రశ్నించినందుకు ఆ సైనికుడిని డిస్మిస్ చేశారుపై అధికారులు తమ ఆహారాన్ని అమ్ముకుంటూ తమను ఆకలికి మాడిపోయేట్టు చేస్తున్నారని ఆరోపణలు చేసిన బీఎస్ఎఫ్ జవాను తేజ్‌బహదూర్ యాదవ్ గుర్తున్నాడా ? అతన్ని ఉద్యోగంలోంచి తొలిగించారు. బీఎస్ ఎఫ్ జవాన్లకు పెడుతున్న ఆహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అతనిపై బీఎస్ ఎఫ్ అధికారులు... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..