ఛత్తీస్ ఘ‌డ్ నుంచి చెన్నై దాకా రాజ్య నిర్బంధం అడ్వకేట్ మురుగన్ అరెస్ట్ - వరవరరావు

ఛత్తీస్

ఇప్పడింక వేటు చెన్నై అడ్వకేట్ మురుగన్ మీద పడ్డది. ఆయన కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ (సిడిఆర్ఒ)లో భాగమైన సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ - పౌరహక్కుల పరిరక్షణ కేంద్రంకు కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మద్రాస్ హైకోర్టులో న్యాయవాది. పది సంవత్సరాలకు పైగా పౌరప్రజాస్వామిక హక్కుల ఉద్యమంలో ఉన్నాడు. ఆయనను జనవరి 8న ఉదయం 4 గంటల సమయంలో తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు కరూరు జిల్లా కోర్టు నుంచి సర్చ్ వారెంట్ తీసుకువెళ్లి అరెస్ట్ చేశారు. ఐదు నెలల క్రితం కరూరుకు చెందిన ఇద్దరు మావోయిస్టు మహిళలకు ఆయన ఆశ్రయం ఇచ్చాడని ఆయన మీద చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం (యుఎపిఎ-ఉపా) కింద కేసు పెట్టారు. వాస్తవానికి ఆ ఇద్దరికీ ఆయన న్యాయవాది. ఆ ఇద్దరి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఫైళ్లు, ఇతర కేసులలో ఆయన సిద్ధం చేసుకున్న వాదనలు, మరికొన్ని పుస్తకాలు, హోమియోపతి మందులు, ఒక మెడికల్ పుస్తకం కూడా జపు చేసుకొని వెళ్లారు.

కరూరు జిల్లా కోర్డు జడ్డి సర్చ్ వారెంట్ ఇచ్చే ముందు న్యాయవాదులు కోర్డు అధికారులని, ప్రజలకు న్యాయాన్ని అందించడంలో న్యాయపాలనలో భాగం అవుతారని ఆలోచించి ఉండాల్సింది కోర్టులో ఎట్లాగైతే నేరారోపణకు సంబంధించిన సాహిత్యం ఉంటుందో న్యాయవాదుల దగ్గర కూడా ఉంటుంది. తాను చేపట్టిన ఒక కేసులోని ఆరోపణలను తన మీద ఆపాదించుకొని కోర్టులో వాదించే పద్ధతి ఉంటుంది. అంతమాత్రాన ఆరోపితునికి ప్రాతినిధ్యం వహించే న్యాయవాదే నేరారోపణకు గురికావడం ఇటీవలి కాలంలో ఒక ధోరణి అయిపోయింది. ఇందుకు ముఖ్యమైన కారణం ఇటువంటి న్యాయవాదులందరూ న్యాయం కోసం న్యాయస్థానాల్లో మాత్రమే కాకుండా బయటి వ్యవస్థతో కూడా పోరాడుతున్నారు. న్యాయశాస్త్ర సూత్రం న్యాయం ఇరవై నాలుగు గంటలు లభించవలసిందే అని చెప్తుంది. అందుకే నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్లను నిర్బంధించినప్పడు న్యాయమూర్తుల ముందు హాజరు పరచడానికి న్యాయస్థానం వేళలే పాటించనక్కర్లేదు. అర్దరాత్రి కూడా హాజరు పర్చవచ్చు. దానర్థం ఎంత నిందితులుగా భావింపబడినవారైనా మనుషులని, వారి ప్రాణాలు విలువైనవని మానవ సమాజం గుర్తిస్తుంది. స్వేఛ్చ జీవించే హక్కులకు సంబంధించిన ఈ నైసర్గిక బాధ్యతను గుర్తించిన న్యాయవాదులు సహజంగానే మానవ, పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలలో పనిచేయడానికి ఎంచుకుంటారు.

రాజ్యం స్వయంగా ఈ మూడు రకాల హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్న ఫాసిస్టు దశకు చేరిన సందర్భంలో ఈ బాధ్యత ఎంత కఠినతరమైనదో పరంపరగా జరుగుతున్న ఈ అరెస్టులు, దాడులు, హత్యలే రుజువు చేస్తున్నాయి.

రాజ్యం, ప్రభుత్వాలు టెర్రరిస్తులుగాను, దేశద్రోహులుగాను చిత్రించే ముస్లింల కేసులు లేదా జాతి విముక్తి పోరాటాల్లో సాయుధంగా పాల్గొన్నవాళ్ల కేసులు చేపట్టినపుడు న్యాయవాదులను సైన్యం, అర్థసైనిక బలగాలు అపహరించి, చంపేసిన సందర్భాలు ఉన్నాయి. మస్టీలో ఉన్న పోలీసులు చంపిన ఉదంతాలూ ఉన్నాయి. కశ్మీర్లో జలీల్ ఆండ్రెబి (1997), ముంబైలో షాహిద్ ఆజ్మీ (2010) అనే ఇద్దరు సుప్రసిద్ద న్యాయవాదులు ఇట్లా హత్యకు గురైనవారే.

షాహిద్ ఆజ్మీ వ్యక్తిత్వం, ఆయన హత్య గురించి ఒక అద్భుతమైన సినిమానే వచ్చింది. అయూబ్ రానా తన ʹగుజరాత్ ఫైల్స్ పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇచ్చిందంటే ఆయన న్యాయం కోసం, సత్యాన్ని ఆవిష్కరించడం కోసం ఎంత అంకితభావంతో పోరాడాడో ఊహించవచ్చు.
మావోయిస్టుల, మావోయిస్టు సానుభూతిపరుల కేసులు చేపట్టడమే కాకుండా, పౌరహక్కుల‌ ఉద్యమాల్లో పనిచేసినందుకు ఇతర హక్కుల ఉద్యమ నాయకులతో పాటు న్యాయవాదులు నర్రా ప్రభాకర్రెడ్డిని (1991) మష్టిలోని పోలీసులు, పురుషోత్తంను (2000) నయీం ముఠా హత్య చేయడం మనం చూశాం.

నిజనిర్ధారణకు వెళ్తున్న న్యాయవాదులను, ఆదివాసి, దళిత సంఘాల నాయకులను, జర్నలిస్టులను, రీసర్చ్ స్కాలర్స్ ను, తెలంగాణ, ఛత్తీస్ఘడ్ పోలీసులు అరెస్టు చేసి ఛత్తీస్ఘడ్ జైలులో నిర్బంధించి మావోయిస్టు పార్టీని కలవడానికి వెళ్తున్నారని ఆరోపించి నిర్బంధించడమే కాకుండా, బెయిల్ నిరాకరించడం కూడా చూశాం,

అయితే ఈ అరెస్టులు, నిర్బంధాలు విడి అంశాలుగా కాకుండా ఒక విధానంగా అమలవుతున్నాయి. 2009లో ప్రారంభమైన ఆపరేషన్ గ్రీన్ హంట్ లో భాగంగా దాని మూడో దశ తరువాత ఆపరేషన్ 2016లో భాగంగా ప్రజాస్వామిక వాదులందరూ వాటిని విశ్లేషిస్తున్నారు. స్వయంగా బిఎస్ఎఫ్ అధినేత, ఆపరేషన్ వీరప్పన్ ను నిర్వహించిన వాడుగా పేరు తెచ్చుకుని, జంగల్ మహల్లో మావోయిస్టు క్రిషన్ జీని ఎన్కౌంటర్ పేరుతో చంపిన కేంద్ర స్థాయి అర్థసైనిక బలగాల అధికారి విజయకుమార్ పేరుతో ఆపరేషన్ విజయకుమార్ అని, అజిత్ గోయెల్ డాక్టిన్ అని, ఐజి కల్లూరి స్టైల్ అని ఇవి మీడియాలో ప్రస్తావించబడుతున్నవి.

తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఏడుగురి నిజ నిర్ధారణ బృందం అరెస్టైన తరువాత ఐజి కల్లూరి వ్యాఖ్యలు మనం చూశాం. "నేనయితే వాళ్లను అట్లా కోర్టులో హాజరు పరిచేవాడిని కాదు. వాళ్లను వదిలేది లేదు" అని న్యాయస్థానం రక్షణలో ఉన్న వాళ్లని గురించి న్యాయస్థానం పట్ల ఏ ఖాతరు లేకుండా వ్యాఖ్యానిస్తున్నాడు. నందినీ సుందర్తో పాటు నలుగురిపై హత్యానేరం మోపినప్పడు కూడా అటువంటి వ్యాఖ్యలే చేశాడు.

పదవీ విరమణ చేసి, కేంద్ర భద్రతా దళాల సలహాదారుగా ఉన్న విజయకుమార్ చెన్నైలో ఉంటూ, తమిళనాడులో కుఖ్యాతి వహించిన క్యూ బ్రాంచ్ ఆపరేషన్స్ అన్నిటినీ పర్యవేక్షిస్తున్నాడు. పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాల అర్థసైనిక బలగాలు, స్థానిక మావోయిస్టు వ్యతిరేక బలగాలు నవంబర్ నెలలో కేరళలోని నంబూరి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దేవరాజ్ ୦°ର୍ତ୍ତ కమిటీ సభ్యురాలు అజితను పట్టుకొని చంపేశారు. అప్పటి నుంచి ఆ విషయంలో నిజనిర్ధారణ మొదలుకొని, మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించడం వరకు సిపిసిఎల్, సిడిఆర్ఒ చేసిన కృషిలో అడ్వకేట్ మురుగన్ భాగం. దేవరాజ్ ( కృష్ణగిరి) అజిత (చెన్నై) ఇద్దరూ తమిళనాడుకు చెందినవాళ్లు కాబట్టి వాళ్ల కార్యక్షేత్రం కేరళ అయినప్పటికీ తమిళనాడు నుంచి న్యాయవాదులు, హక్కుల సంఘాల వాళ్లు వాళ్ల కుంటుంబ సభ్యులను గాని, సన్నిహిత స్నేహితులను గాని తీసుకుని వెళ్లి కోజీకోడ్ కోర్టులో మృతదేహాల అప్పగింత కోసం న్యాయపోరాటం చేశారు. సిడిఆర్ఒ నిజనిర్ధారణలో భాగంగా ఘటనా స్థలానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎం.ఎన్. రావన్ని వంటి వృద్ధ విప్లవ ప్రజాసంఘ నాయకుడిని యుఎపిఎ కింద అరెస్టు చేయడం మాత్రమే కాకుండా, బిజెపి కార్యకర్తలు మృతదేహాల అంత్యక్రియల సందర్భంలోను, నిజనిర్ధారణ బృందం అడవికి వెళ్ళే ప్రయత్నం చేసిన సందర్భంలోను అడ్డగించారు. వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. భౌతికదాడులు చేసే ప్రయత్నం చేశారు.

రెండు నెలల పాటు ఈ ఎన్కౌంటర్ కేరళలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చకు రావడం కోజికోడ్లో, కేరళలో మరికొన్ని చోట్ల ఒక న్యాయ పోరాటానికి దారితీయడం, అందులో అడ్వకేట్ మురుగన్ ఒక ప్రముఖ భూమిక నిర్వహించడం రాజ్యానికి కంటగింపుగా ఉన్నది. న్యాయవాదులు కోర్టులకే పరిమితమై, తమ జీవిక కెరీర్ చూసుకోకుండా స్వేఛ్చ జీవించే హక్కుల కోసం పోరాడడం వాళ్ల స్వేచ్ఛకు, జీవించే హక్కుకే ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు సూచించే స్థితి.

అడ్వకేట్ మురుగన్ కు తెలుగు సమాజపు హక్కుల ఉద్యమంతోనే కాదు, దేశ ప్రజాస్వామిక ఉద్యమాలతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2012 అక్టోబర్ 12న కూడంకళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా మత్స్యకారులు, స్థానిక ప్రజలు, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు చేస్తున్న పోరాటాలు, వాటిపై రాజ్యహింస విషయంలో నిజనిర్ధారణకు వెళ్లిన ఒక అఖిల భారత స్థాయి కమిటీ సభ్యులను మధురైలో అరెస్టు చేశారు. అందులో ఒరిస్సా నుంచి ప్రతిమ అనే న్యాయవాది, జార్ఖండ్ నుంచి అరవింద్ అవినాష్, దామోదర్ అనే పియుసిఎల్ కార్యకర్తలు, ఢిల్లీ జెఎన్యూకు చెందిన ప్రియదర్శిని, తమిళనాడు సిపిసిఎల్ కు చెందిన అడ్వకేట్ కేశవన్, కరూర్ కు చెందిన సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమ కార్యకర్త పళనిస్వామి, మధురైకి చెందిన విద్యార్థి ఉద్యమ నాయకుడు జగన్, మధురైకి చెందిన మహిళా ఉద్యమకార్త అగరాధి మాత్రమే కాకుండా అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ఎపిసిఎల్సి హమీద్, రాయలసీసమ విద్యార్థి వేదిక దస్తగిరి, విరసం కార్యదర్శి వరలక్ష్మిలను నెల రోజులకు పైగా జైలులో పెట్టినప్పడు న్యాయపోరాటం నిర్వహించిన వాళ్లలో మురుగున్ ఉన్నాడు. స్థానికేతరులు, దూరదూరాల నుంచి వచ్చిన వాళ్లకు న్యాయ సహాయ సహకారాలు అందించాడు.

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఎంత ప్రమాదకారులో, వాళ్ల కార్యక్షేత్రంగా ఉన్న ఆదివాసి ప్రాంతాల్లోని స్థితిగతుల గురించి మాట్లాడుతున్న అక్కడి రాజ్యహింస గురించి మాట్లాడుతున్న మేధావులు, హక్కుల కార్యకర్తలు కూడా అంత ప్రమాదకారులని, కనుక మిషన్ 2017 వాళ్ల నోళ్లు మూసే కార్యక్రమం అజిత్ దోవల్ డాక్ట్రిన్ గా వ్యాఖ్యానింపబడుతున్నది. తెలంగాణ ప్రజాస్వామిక వేదికకు చెందిన తుడుం దెబ్బ కార్యదర్శి, మూడు దశాబ్దాలుగా ఆదివాసి హక్కుల కోసం పోరాడుతున్న రమడాల లక్ష్మయ్య దగ్గర మావోయిస్టులకు చెందిన లక్ష రూపాయల పాత నోట్ల దొరికాయన్నది కూడా ఒక ఆరోపణ. అట్లాగే ఇదే కాలంలో జాగ్లాగ్ న్యాయవాది శాలినీ గేర్ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకుడు ఐతు ఇద్దరు ముసుగు వ్యక్తులతో పంపిన పదిలక్షల పాతనోట్లు జగదల్పూర్ నుంచి రాయపూర్ కు వెళ్లి మార్పించే ప్రయత్నం చేస్తున్నదని ఒక కేసు నమోదు చేశారు. సోని సోరీ, రమడాల లక్ష్మయ్య మొదలు డా. బినాయక్ సేన్, నందినీ సుందర్ దాకా ఆదివాసుల గురించి వ్యగ్రత చూపే వాళ్ల మధ్యన ఒక రాజకీయ సంబంధాన్ని చూడడం, అటువంటి సంబంధాన్ని ఒక నేరారోపణగా చూపడం రాజ్యం ఒక పనిగా పెట్టుకున్నది. అట్లాగే రాజకీయ ఖైదీల విడుదల గురించి మాట్లాడేవాళ్లను వాళ్లపై కేసులు మోపి, నిర్బంధించడం కూడా ఒక కొత్త విధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్నది. సిఆర్పిపి అధ్యక్షుడు ఎస్ఆర్ గిలాని, అఖిల భారత స్థాయి నాయకుడు జిఎన్ సాయిబాబా వరకు ఇటీవలి కాలం దాకా ఇది జరిగింది. గతంలో రాజకీయ ఖైదీల విడుదల బాధ్యతలు నిర్వహించిన అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ను, ఇప్పడు సిఆర్పిపి అఖిల భారత కార్యవర్గ సభ్యుడు, ఆంధ్ర - తెలంగాణ చాప్టర్ కార్యదర్శి బల్లా రవీందర్ను, టిడిఎప్ నిజనిర్ధారణ బృందంలో భాగంగా అరెస్టు చేశారు. న్యాయం కోసం పోరాడడం మాత్రమే కాదు, నిజాలు తెలుసుకునే ప్రయత్నాలు కూడా నేరం అయిపోతున్నది. ప్రజల, ప్రజాస్వామ్యవాదుల సత్యాన్వేషణ రాజ్యానికి అంత ప్రమాదకరంగా కనిపించడమే ఫాసిజం. ఒక న్యాయ పోరాటం ఉధృత స్థాయికి వెళ్లినపుడు రాజ్యం ఎట్లా చిత్రిస్తుందనడానికి ఒక ఇటీవలి ఉదాహరణే చెప్పాలి. ఒక నలభై సంవత్సరాల పౌర హక్కుల పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్డు ఐదుగురితో కూడిన ధర్మాసనం ప్రతి ఎన్కౌంటర్ హత్యను హత్యా నేరంగా నమోదు చేయాలని ఏకగ్రీవ తీర్మానం ఇచ్చింది. దానిపై అవిభక్త ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం సుప్రీంకోర్టు వెళ్లి స్టే తెచ్చింది. సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతున్నది. ఈ తీర్పునే తమ వాదనగా చేపట్టవలసిందని ఎపిసిఎల్సి సుప్రీంకోర్టును కోరింది. దీనిపై ప్రతివాదనలను లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దానిపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతివాదనను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కన్నా మావోయిస్టు ఉద్యమాన్ని సమర్ధిస్తున్న బుద్ధిజీవులు ప్రమాదకరమన్నది ఆ వాదనలోని ఒక ముఖ్యమైన అంశం. అంటే, ఎన్కౌంటర్లన్నీ హత్య కేసులుగా నమోదు చేయబడాలనే హక్కుల సంఘాల, న్యాయవాదుల వాదనలు, ఉద్యమాలు కేంద్ర, కేంధ్ర‌ ప్రభుత్వాలకు, రాజ్యానికి అంత చికాకు కలిగిస్తున్నాయన్నమాట.

టిడిఎఫ్ న్యాయవాదులను, ఇతర ప్రజాస్వామిక కార్యకర్తలను, ఛత్తీస్ఘడ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించడమైనా, సిపిసిఎల్-తమిళనాడు అడ్వకేట్ మురుగన్ను యుఎపిఎ కింద నిర్బంధించడమైనా ప్రజాస్వామిక ఉద్యమాన్ని రాజ్యం ఈ దృష్టితో అణచివేయదల్చుకున్నదనే డాక్ట్రిన్ (సైద్ధాంతిక అవగాహన)గా అర్థం చేసుకుని ప్రతిఘటించే విశాల ఐక్య ప్రజాస్వామిక ఉద్యమ నిర్మాణం ఈనాటి ఫాసిస్టు వ్యవస్థలో మన కర్తవ్యం.

‍ -వరవరరావు

(ఈ వ్యాసం 13‍జనవరి 2017 న ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ʹచెన్నైలో గ్రీన్‌ హంట్ʹ అనే హెడ్డింగ్ తో ప్రచురించబడినది . అయితే అది ఎడిట్ చేయబడింది. ఇది పూర్తి పాఠం)

Keywords : tamilanadu, cattisgarh, murugan, maoits, police, court
(2024-03-26 10:14:19)



No. of visitors : 1624

Suggested Posts


ʹకక్కూస్ʹ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాత అరెస్ట్ !

సంచలనం సృష్టించిన ʹకక్కూస్ʹ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాత దివ్య భారతి ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 2009 డిసెంబరు రమేశ్ అనే సిటీ కాలేజ్ విద్యార్థి మరణించడంపై నిరసన వ్యక్తం చేస్తూ జరిగిన ఆందోళనలో దివ్యభారతి పాల్గొన్నారు.....

కక్కూస్ డైరెక్టర్ ను హత్యాచేస్తామని మతోన్మాదుల‌ బెదిరింపులు

కక్కూస్ డక్యుమెంటరీ ఫిల్మ్ దర్శకురాలు దివ్యభారతి ని హత్య చేస్తామని సంఘ్ పరివార్ హెచ్చరించింది. దేశంలో దళితులుఎవ్వరూ చేయడానికి ఇష్టపడని డ్రైనేజీలు క్లీన్ చేయడం, ఇతరుల మలాన్ని ఎత్తిపోయడం వంటి అంశాలపై ఆమె తీసిన కక్కూస్ ఫిల్మ్ చాలా....

After Madhya Pradesh, now Tamil Nadu farmers to relaunch protest in capital Chennai

Close on the heels of protests by farmers in Madhya Pradesh and Maharashtra, a group of cultivators led by P Ayyakannu, who had spearheaded a 40-day stir in New Delhi, today launched an "indefinite" protest here pressing for their demands including a comprehensive drought relief package....

Eating beef is not an offence - high court

NOWHERE IN THE INDIAN PENAL CODE IT IS STATED THAT EATING NON- VEGETARIAN FOOD IS AN OFFENCE. THERE IS NO LAW TOUCHING EATING HABITS OF ANY RELIGION AND IN SUCH A VIEW OF THE MATTER, THE CONTENTION OF THE PETITIONER THAT EATING BEEF IS AN OFFENCE, CANNOT BE ACCEPTED...

రైతులపై బీజేపీ నేత‌ దాడి !

తులపై ఓ బీజేపీ నేత దాడి చేశారు. చెప్పుతో కొడతానంటూ బెధిరించారు. అందరూ చూస్తుండగానే బహిరంగంగా ఆ బీజేపీ నేత రైతులపై వీరంగం వేశారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ ఓ రైతు చెంపపై కొట్టారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఛత్తీస్