include 'men';
?>
ఇప్పటికీ మనువాద పాలకులను వణికిస్తున్న రోహిత్ వేముల !
మనువాదులు ఓ దళిత మేదావిని హత్య చేసి ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో మనువాదులకు వ్యతిరేకంగా జరగాల్సినంత పోరాటంజరిగిందో లేదో....మనువాదులకు వ్యతిరేకంగా ప్రజల్లో రావాల్సినంత చైతన్యం వచ్చిందో లేదో .... కానీ రోహిత్ చనిపోయి మనువాదుల గుండెల్లో వణుకు పుట్టించడం మాత్రం నిజం. ఈ రోజుకూ రోహిత్ పేరు వినపడితే మనువాద పాలకులకు నిద్రకూడా పట్టడం లేదన్నది నిజం. వాళ్ళెంత భయపడుతున్నారనడానికి రోహిత్ వర్దంతి సభ జరగనివ్వకుండా అడ్డుకోవడమే గుర్తు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ధీక్షచేసిన చోట.. విద్యార్థులు ఆ అమరుడి స్మృతిని నిర్మించుకున్న చోట మంగళవారంనాడు వర్దంతి సభ నిర్వహించుకునేందుకు పాలకులు అనుమతి ఇవ్వలేదు. వేలాది విద్యార్థుల నినాదాల్లోంచి రోహిత్ ఎక్కడ లేచొస్తాడోనని వణికిన పాలకులు సభజరగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల తల్లి రాధిక , సోదరుడు రాజాతో సహా అనేక మంది విద్యార్థులను అరెస్టు చేశారు. బైటినుండి ఎవ్వరినీ క్యాంపస్ లోకి రానివ్వలేదు క్యాంపస్ నుండి ఎవ్వరినీ బయటకు రానివ్వలేదు. క్యాంపస్ బయట అడుగడుగునా తెలంగాణ పోలీసులు మోహరించి విద్యార్థులను సభకోసం వచ్చిన వారిని భయబ్రాంతులకు గురి చేశారు. లాఠీ చార్జ్ చేశారు. చివరికి విద్యార్థుల ఒత్తిడితో క్యాంపస్ బయట సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన రోహిత్ తల్లి రాధిక ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ʹప్రభుత్వంతో నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇప్పటికే కులం నిర్ధారణ పేరుతో నన్ను తీవ్రంగా వేధించారుʹ అని రాధిక అన్నారు. రోహిత్ లేఖరాసిన వెంటనే యూనివర్సిటీ అధికారులకు స్పందించి ఉంటే తనకు పుత్రశోకం ఉండేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై యూనివర్సిటీల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు.
మరో వైపు దేస వ్యాప్తంగా మంగళవారంనాడు రోహిత్ వేముల సంస్మరణ సభలు జరిగాయి. ఢిల్లీ లో రోహిత్ హంతకులను శిక్షించాలని ఆందోలనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.
మంగళవారం రాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను , ఇతర నిరసనకారులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వందలాది మంది విద్యార్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దిష్టి బొమ్మతో శవ యాత్రను నిర్వహించారు
Keywords : rohit vemula, hcu, abvp, asa, vc apparao, telangana, police
(2024-03-06 18:59:34)
No. of visitors : 1121
Suggested Posts
| ఫిల్మోత్సవ్లో రోహిత్ వేముల పై సినిమా ప్రదర్శనను అడ్డుకున్న కేంధ్రంఆయన పై తీసిన డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనివ్వడంలేదు. ఆయనపై తీసిన 45 నిమిషాల డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రదర్శనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. కేరళలో ఈనెల 16 నుంచి ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది.... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..