తేనెపూసిన అగ్రహార కత్తులకు వెలివాడల జవాబు - వరవరరావు

తేనెపూసిన


(సామాజిక సమరసత వేదిక కన్వీనర్ కె శ్యాం ప్రసాద్ గారికి బహిరంగ లేఖ‌)

రక్షాబంధన్ ఉత్సవ నిర్వహణ నిమిత్తం మీరు 2015 సెప్టెంబర్ 8న తెలంగాణ సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కార్యదర్శిగా డా. వంశీ తిలక్తో కలిసి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లినపుడు అక్కడ ఉన్న 70 మంది విద్యార్థి, విద్యార్థినీ బృందం వేసిన ప్రశ్నల గురించి ప్రస్తావించారు. ఆ బృందానికి రోహిత్ నాయకుడని రాశారు. మీ వ్యాసం పేరే ʹరోహిత్ మిత్రబృందంతో మూడు గంటలు...ʹ వాళ్లు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రశ్నలు, మీ సమాధానాలు రాసి ʹ... ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అంబేద్కర్ సంఘం వారు సభ పెట్టినప్పుడు ఇతరులు వచ్చి ఇలా ప్రశ్నలు వేసి వారికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తే వారు ఊరుకుంటారా అన్నదే మా ప్రశ్నʹ అని రాసి ʹఎవరిలో సహనశీలత ఉంది మరి? ʹ అని ఒక బహిరంగ సవాల్ విసిరారు. మీరు ఆత్మహత్యలకు పురికొల్పి, స్వయంగా హత్యలు చేసే విద్వేషపూరిత సంస్కృతి మీద చర్చను సహనం-అసహనం స్థాయికి కుదించి తేలిక పరచదలుచుకుంటున్నారు. ఆ విషయాల ప్రస్తావన, చర్చలోకి వెళ్లే ముందు వాళ్లు ఎంత శాస్త్రీయమైన అంశాలు లేవనెత్తుతున్నారో చూద్దాం. మీరు రోహిత్, అతని సహచర విద్యార్థులు చదువుకుంటున్నచోటికి, వాళ్లున్నచోటికి వెళ్లారు. వాళ్లు మీరున్నచోటికి రాలేదు. అది కూడా మీ మాటల్లోనే ఇంతవరకు కుటుంబ ఉత్సవంగా నిర్వహించుకుంటున్న రక్షాబంధన్ను సామాజిక ఉత్సవంగా నిర్వహించుకుందామని వెళ్లారు. ʹరక్షాబంధన్ నిర్వహించడమంటేనే పురుషాధిక్యతను సమర్ధించడంʹ అని ఒక విద్యార్థి న్యాయంగానే ప్రశ్నించాడు. అట్లాగే బౌద్ధుడయిన డా. అంబేద్కర్ పేరు ముందు శ్రీ పెట్టడమంటే హిందూ సంప్రదాయమే కదా, ఆయన ఏ మతాన్ని దాని అంటరాని తనాన్ని మానసికతను, ఆచరణను ప్రశ్నించి, జీవితమంతా ప్రతిఘటించి, దళితులు స్వీయగౌరవంతో బతకాలంటే బౌద్ధాన్ని స్వీకరించాలని భావించి, తాను బౌద్ధమతాన్ని స్వీకరించాడో ఆ మతానుయాయిని, హిందూ సంప్రదాయపు శ్రీ చేర్చి ప్రస్తావించడం ఆయన త్యజించిన దానిని ఆయనకు ఆపాదించే ఆధిక్యతా భావం కాదా?

భారత ప్రభుత్వం 1947లో జమ్ము కాశ్మీర్ పై, 1948లో హైదరాబాద్ సంస్థానంపై సైనిక దాడిచేసి ఆక్రమించుకున్నది. 1962లో గోవాను ఆక్రమించుకున్నది. 1971లో తూర్పు పాకిస్తాన్ పైకి "ముక్తిఫౌజ్ ను పంపించింది. 1975లో సిక్కింను ఆక్రమించుకున్నది. 1985లో శ్రీలంకకు ఐపికెఎఫ్ పేరుతో సైన్యాన్ని పంపింది. సరిహద్దులు కాపాడాల్సిన సైన్యాన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చి జమ్మకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో పరోక్ష సైనిక పాలన చేస్తున్నది. తూర్పు మధ్యభారతంలోనూ ఆదివాసులపై సైనిక దాడులు చేస్తున్నది. కనుక ఆ విద్యార్థులు అన్నట్లు భారతదేశం (భారత ప్రభుత్వం అనే అర్థంలో) మరే దేశం మీద దండయాత్ర చేయడం లేదన్నది అసత్యం. ఆ విద్యార్థులన్నట్టు నేడు కేంద్ర ప్రభుత్వ సైనిక బలగాలు జమ్మూ కాశ్మీర్లోని ప్రజలను ఊచకోతకు గురిచేస్తున్నాయన్నది చూడగలిగిన వారికి విస్పష్టమైన భీభత్స దృశ్యమే. సుప్రీం కోర్టు వంటి రిజర్వేషన్లు అన్వయించని న్యాయస్థానాల భావజాలం బ్రాహ్మణీయ భావజాలం కాకపోతే ఈ దేశంలో ఉరిశిక్షలు ఎవరికి వేస్తున్నారో ఒకసారి విశ్లేషించి పరిశీలించండి. ఏ ఒక్క దళితున్నో ముస్లింనో, ఆదివాసీనో, మహిళనో, అసమ్మతివాదినో, అంతెందుకు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి ఈ దేశం అరవై ఐదేళ్ల గణతంత్ర చరిత్రలో ఎన్నడైనా తెల్లవారూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిద్రకాచిందా?

దళితులు తమకు తాము స్వీయ గౌరవంతో కూడిన ఒక శబ్దాన్ని ఉపయోగిస్తున్నారు కానీ బ్రాహ్మణీయ భావజాలంగల హిందువులు వారిని అంటరాని వారుగానే భావించారు. చూశారు. ఆ పేర్లతోనే పిలిచారు. లేదా ఉదార సంస్కరణవాదులు దేవుని బిడ్డలు అన్నారు. తమ వంటి మనుషులుగా ఎపుడైనా చూశారా? దళితులేకాదు, బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళెవరూ హిందువులు కాజాలరు. ఆ మాట దళితులను కాదు, శంకరాచార్య వంటి పీఠాధిపతులనడగండి. దేవుని గర్భగుడిలో ఉండే పూజారి వ్యవస్థనడగండి. మీరే దళితులను హిందువులుగా చూడనివెన్ని ఉదాహరణలని?

ఇండియా ఒక ఉపఖండం. ʹజంబూద్వీపే భరతఖండేʹ సత్యనారాయణ వ్రతకల్పం మీరు వినలేదా? ఇక్కడ చప్పన్నారు జాతుల స్వతంత్ర పరిపాలనలు ఉండేవి. బ్రిటిష్ ఇండియా ఆవల ఐదు వందల సంస్థానాలు స్వతంత్రంగా 1947 దాకా ఉన్నాయి. మీరన్నట్లు 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చేదాకా ఉన్నాయి. కనుక భారతదేశం అనే భావనను అంగీకరించని వాళ్లు దళితులొక్కరే కాదు, చరిత్ర చదివిన, తెలిసిన అసంఖ్యాకులున్నారు.

ఇంక మీ వ్యాసంలో రెండవ అంశం - ఇన్ని ప్రశ్నలువేసి, చర్చించి, తమ అభిప్రాయాలను దృఢంగా, స్పష్టంగా వ్యక్తీకరించిన బృందానికి నాయకుడిగా ఉన్న రోహిత్, మీరు చాయ్ కు రమ్మని పిలిచిన ఆహ్వానాన్ని కాదని నినాదాలు చేస్తూ వెళ్లిపోయిన బృందం నాయకుడు రోహిత్, మీరే రాసినట్లు నిష్కర్ష‌, మొండితనం, పట్టుదల కలిగిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మబుద్ధి కావడం లేదు
ఆయనను హత్య చేశారు. అది స్మృతిబద్ధ హత్య మనుస్మృతిబద్ధ హత్య క్యాంపస్లో మనుస్మృతిని అన్వయించి ఆయనను వెలివేయమని ఒక మంత్రి రాశారు. స్మృతి ఇరానీ ఒకటికి నాలుగు సార్లు రాశారు. కులపతి ఆ బృందంలోని ఐదుగురిని వెలివేశాడు. నలుగురు కూడే చోటికి రావద్దని, హాస్టల్కు రావద్దని - అంటే నలుగురు తినే చోటికి, ఉండే చోటికి రావద్దని సాంఘిక బహిష్కరణ విధించారు. ʹఅతడిని సవర్ణులెవరూ తిట్టలేదుʹ అని మీరు రాశారు. అతణ్నే కాదు, అంబేద్కర్ విద్యార్థి సంఘాన్ని మొత్తాన్ని ఎబివిపి అధ్యక్షుడు సుశీల్ కుమార్ గూండాలు అన్నాడు. ఆ తర్వాత పోలీసులకు, భద్రతాధికారికి సమాచారం ఇచ్చి భద్రతా అధికారిని రప్పించి, అతని ముందు ప్రశ్నిస్తే ఆ మాట వెనక్కి తీసుకుంటానన్నాడు గానీ, పోలీసులకు, ఎంఎల్సికి, మంత్రికి ఫిర్యాదు చేశాడు. రోహిత్ తన మిత్రులతో తనపై దాడి చేశాడనే ఆరోపణతో కోర్టులో కేసు వేశాడు. తల్లితో కూడా వేయించాడు. భద్రతా అధికారి ముందు తప్ప ఒప్పకుని, ఆ తర్వాత తీసిన దొంగ దెబ్బను మీరు సహన సంస్కృతి అంటున్నారు.
ʹహైదరాబాద్ విశ్వవిద్యాలయంలో దళిత ఆచార్యులందరూ ఒకే బృందంగా కలిసి ఉంటారుʹ అని మీరంటున్నారంటే దళితేతర ఆచార్యులెవరూ వారిని కలుపుకోరని అర్థం కాదా? దల్లిత్ర ఆచార్యులే వివక్షకు గురయి అభద్రతా భావంతో కలిసి ఉండే వాతావరణం ఉన్నప్పుడు ఈ మెజారిటేరియన్ ఫాసిజానికి దళిత విద్యార్థులు బలి కావడం రోహిత్తోనే మొదలు కాలేదు. ఈ వివక్షను రూపుమాపకపోతే రోహిత్తోనే ముగింపు కూడా కాకపోవచ్చు

విశ్వవిద్యాలయంలో చేరే సమయానికి ఉన్నత విద్యలు చదువుకోవడం ఆయన లక్ష్యం. ఆయన గొప్ప సైంటిస్తు కావాలనుకున్నాడు, ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు. తత్వవేత్త కావాలనుకున్నాడు. అవేవి కావాలన్నా మొదట బుద్ధిస్టు కావాలని, విస్తృతంగా మార్బిజాన్నిఅంబేద్కరిజాన్ని చదువుకున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో పిహెచ్ డీ కోసం రెండు కేంద్ర ఫెలోషిప్లను మెరిట్ మీద తెచ్చుకున్నాడు. ఆయన ప్రొఫెసర్ అప్పారావు విద్యార్థియే. ఆయన సహకరించక పోవడంవల్లనే సోషల్ సైన్స్కు పరిశోధన మార్చుకున్నాడు. అందుకే ఆ తర్వాత కులపతిగా వచ్చి తమను వెలివేసిన అప్పారావుకు - ఎబివిపి అధ్యక్షున్ని వెనుకేసుకొచ్చి కాపాడినందుకు వ్యంగ్యంగా పొగుడుతూ 2015 డిసెంబర్ 18న లేఖ రాశాడు. అది అందినట్లు వైస్ చాన్సలర్ ఆఫీసు అతనికి తెలియజేసింది. ఆ లేఖలో వైస్ చాన్సలర్ ముందు అమెరికా అధ్యక్ష అభ్యర్థి జాత్యహంకారి(రేసిస్ట్) డోనాల్డ్ ట్రంప్ కూడా మరుగుజ్ఞ (లిల్లీ పుట్)గా తేలిపోతాడని రాశాడు రోహిత్. గమనించవలసిందేమిటంటే ఒక నెల రోజుల ముందే ఎబివిపి వాళ్లను కాపాడుతూ, మంత్రుల ఒత్తిడికి లోనవుతూ తమను వెలివేసిన వైస్చాన్సలర్ చూపుతున్న వివక్ష ఫలితంగా దళిత విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే స్థితి ఏర్పడిందని ఆయన పరోక్షంగా ఆ లేఖలో ప్రస్తావించాడు. అంబేద్కర్ పుస్తకాలు చదువుతున్న విద్యార్థుల హాస్టల్ గదులకు పది మిల్లీ గ్రాముల విషం, ఉరితాడు పంపించి కారుణ్య మరణాలు ప్రసాదించమని కోరాడు. అపుడు గానీ ఇక్కడే కాదు అన్ని విద్యాలయాల్లో కులపతులు ప్రశాంతంగా శ్మశాన శాంతిని అనుభవించవచ్చునన్నాడు.

ఎంతో సహనంతో, ఔదార్యంతో రాసినట్లు కనిపిస్తున్న మీ వ్యాసంలో మీరు పళ్లకింద నాలుకను మడచి ʹరోహిత్ చేరిన విద్యార్థి సంఘం, వారి ఆలోచనా ధోరణులు, వారు చేస్తున్న ఉద్యమాలు, వీటి ఫలితంగానే రోహిత్ తన జీవితలక్ష్యానికి దూరమయ్యాడా? అని చాలా మర్యాదస్తులైన పెద్దమనిషివలె ఉద్దేశపూర్వకమైన ఆరోపణ చేస్తున్నారు. రోహిత్ అంబేద్కర్ సూడెంట్స్ అసోసియేషన్ను తన కుటుంబంగా తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. వాళ్లు తనను ఎంతగానో ప్రేమించారని, తనను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, ఈ చర్యకు తాను పూనుకుని వాళ్లకు బాధ, దుఃఖం, ఆవేదన కలిగిస్తున్నందుకు క్షమించమని రాశాడు. మీ కడుపులో ఎంత విషముంది? ఎబివిపి పై, దాని అధ్యక్షుడు సుశీల్ కుమార్ పై, వైస్ చాన్స‌లర్ అప్పారావుపై, రోహిత్ విస్పష్టంగా డిసెంబర్ 18న వైస్ చాన్సలర్ కు రాసిన లేఖలోని అభిప్రాయాలను, అభియోగాలను కప్పిపుచ్చడానికి ఆయన సూసైడ్ నోట్ (2016 జనవరి 17న ఎంతో ఆత్మీయంగా తన హృదయానికి హత్తుకున్న విద్యార్థి సంఘాన్ని వాళ్ల ఆలోచనా ధోరణులను, ఉద్యమాలను - దోషులుగా బోనెక్కించాలని చూస్తున్నారు. రోహిత్ జీవితలక్ష్యాలను, ఆయన జీవితాన్ని దుర్మార్గంగా తుంచేసిన వ్యవస్థను సమర్ధించడానికి మీరతని జీవన దృక్పథాన్ని అవమానపరుస్తున్నారు.
ఈ నేరారోపణపూరిత కుట్రను ప్రతిఘటించడానికి, తేనె పూసిన కత్తికి జవాబు ఇవ్వడానికి ఇవ్వాళ మన మధ్య ఆ డెబ్బై మంది విద్యార్థుల నాయకుడు రోహిత్ లేకపోవచ్చు. కాని తన త్యాగంతో జనవరి 17 నుంచి రోజూ ఎంతో మంది రోహిత్లను అగ్రహారం వెలివాడలో రోహిత్ రూపొందిస్తున్నాడని మాత్రం మరచిపోకండి.
-వరవరరావు
8-2-2016

Keywords : rohit vemula, hcu, varavararao, bjp, abvp,
(2024-04-24 10:59:43)



No. of visitors : 1452

Suggested Posts


రోహిత్!.. ఓ యుద్ధ తరంగం..

వెలివాడలో యుద్ధగీతం ఇంకా వినిపిస్తూనే ఉంది.పల్లవికి తోడుగా లక్షలాది చరణాలు చేర్చబడుతూనే ఉన్నాయి.కోట్లాది గొంతులు గళమెత్తి పాడుతూనే ఉన్నాయి.బాష ఏదైనా భావమొక్కటే.చాలా సులువుగా అనువదించుకుని పాడుతున్నారు.ఒక పాటకి తోడుగా మరో పాటను...

రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !

మీరీ ఉత్తరం చదివేటప్పటికి నేనుండను. కోప్పడకండి. మీలో కొందరు నన్ను నిజంగా ప్రేమించారు, ఆప్యాయంగా చూసుకున్నారు, నాకు తెలుసు. నాకెవరిమీదా ఏ ఫిర్యాదూ లేదు. నాకెప్పుడూ నాతోనే సమస్యలున్నాయి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తేనెపూసిన