జైసింగ్, రమేష్, సుక్కి అనే ముగ్గురిని పోలీసులు పట్టుకెళ్ళి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, ఆ ముగ్గురిని ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఏటూరు నాగారం-మహదేవపూర్ దళంలోని నిరాయుధులైన సభ్యులు జై సింగ్, రమేష్ లను నిన్న, సుక్కిని ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలో పట్టుకొని వెళ్ళారని వారిని కోర్టులో హాజరు పర్చాలని మావోయిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, పెద్దపల్లి (JMWP) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేసిన ఆయన వారికి ఎలాంటి హాని జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.ఈ అక్రమ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధి జీవులందరూ వ్యతిరేకించాలని కోరారు.

తెలంగాణలో ఉద్యమకారులకు NIA నోటీసులు
మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి-కూనంనేని డిమాండ్
ఈ నెల 24, 25వ తేదీల్లో విరసం 30వ మహాసభలు
‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్
అరెస్టును లొంగుబాటుగా చూపించడంలో మర్మమేంటి?
బీజేపీ బాటలో ఆప్… దళితులకు భూమి కోసం పోరాడుతున్న ముకేశ్ మలౌద్ అక్రమ అరెస్ట్ 