గతవారం కేరళ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు అగ్రనేత సోమన్ త్రిసూర్‌లోని హై సెక్యూరిటీ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నాడని మానవ హక్కుల సంస్థ జనకీయ మనుష్యవాకస ప్రస్థానం (జేఎంపీ) (People’s Human Rights Movement) వెల్లడించింది.
తనను నగ్నంగా చేసి పోలీసులు పెడుతున్న చిత్రహింసలకు వ్యతిరేకంగా సోమన్ ఈ దీక్షకు పూనుకున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ విషయాన్ని సోమన్ కోర్టుకు ఫిర్యాదు చేయడానికి పిర్యాదు కాపీ సిద్దం చేశాడని జెఎంపి చెప్పగా, పోలీసులు దానిని ఈ-మెయిల్ చేసినట్లు చెప్పారు. కానీ సోమన్ ను కోర్టుకు తీసుక రాలేదని జెఎంపి తెలిసింది. తీవ్ర అనారోగ్యంతో, గాయాలతో ఉన్నసోమన్ను త్రిసూర్ మెడికల్ కాలేజీలో చేర్పించినా సరైన వైద్యం అందించలేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీలో సోమన్ ను కలవడానికి న్యాయవాది పిఎ షైనా అధికారుల నుండి అనుమతి తీసుకున్నప్పటికీ పోలీసులు అనుమతించలేదని జెఎంపి ఆరోపించింది. కేరళలో మరో స్టాన్ స్వామిని సృష్టించేందుకు ఆ రాష్ట్రం ప్రయత్నిస్తోందని ఆ సంస్థ మండిపడింది.
వాయ్ నాడ్ జిల్లా కల్ పెట్ట కు చెందిన సోమన్ ను గత ఆదివారం షోరన్ పూర్ రైల్వే స్టేషన్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతను సీపీఐ (మావోయిస్ట్) కబని దళం నాయకుడు అని పోలీసులు ప్రకటి౦చారు.

పోరాడండి; లొంగిపోవద్దు: కామ్రేడ్ బసవరాజు అమరత్వ పిలుపు -కె. మురళి @ అజిత్
చర్లపల్లి జైలులో మావోయిస్టు రాజకీయ ఖైదీ నిరహార దీక్ష
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం
5 రాష్ట్రాల బంద్ – మావోయిస్టు పార్టీ పిలుపు
సోను (వేణుగోపాల్) విప్లవ ద్రోహి – ప్రజా యుద్ధమే మన మార్గం : మావోయిస్టు పార్టీ 