నిర్మల్ జిల్లా రేవోజిపేట గ్రామం దస్తూర్బాత్ మండలం కి చెందిన 23 సంవత్సరాల లతను ఆమె భర్త అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది.
లత తండ్రి పోగుల రాజేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో పౌర హక్కుల సంఘం కోశాధికారిగా పనిచేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అతన్ని UAPA కేసు పై అక్రమంగా అరెస్ట్ చేసి పది నెలల నుండి జైలులో నిర్బంధించారు. అతను ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పనిచేసే నాయకుడు అతని కుమార్తె ను భర్త అత్తమామలు వేధింపులు గురి చేయడం అత్యంత బాధాకరం. కూతురి కడసారి చూపులకు పోగుల రాజేశం కు వెంటనే ఎమర్జెన్సీ ఫెరోల్ బెయిల్ ఇవ్వాలి. లత హత్యకు కారణం అయిన వారిని అరెస్టు చేసి సమగ్ర విచారణ జరిపి చట్టమైన చర్యలు తీసుకోవాలని చైతన్య మహిళా సంఘం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది.
చైతన్య మహిళా సంఘం
రాష్ట్ర కన్వీనర్
జ్యోతి
రాష్ట్ర కోకన్వీనర్స్
రాధ,శ్రీదేవి
మరో వైపు లత హత్య ను తీవ్రంగా ఖండించిన పౌరహక్కుల సంఘం పోగుల రాజేశంను పెరోల్ పై విడుదలయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేసింది.

ఏ మార్గాన్ని అనుసరించాలి?
చర్లపల్లి జైలులో మావోయిస్టు రాజకీయ ఖైదీ నిరహార దీక్ష
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
కగార్లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్
Surrender Does Not Guarantee Freedom: The Story of Maoist Leader Dunna Keshava Rao alias Azad
మీ వేళ్లతో మీ రక్తబంధువుల కళ్లను పొడవకండి – ఆదివాసీ పోలీసులకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి 