Campaign Against State Repression (CASR) రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం పత్రికా ప్రకటన
జమ్ముకశ్మీర్‌లో ప్రజా భద్రతా చట్టాన్ని (PSA) రాజ్య అణచివేత సాధనంగా ఉపయోగించడం ఎక్కువైపోతోంది.
కార్పొరేట్ దోపిడి కోసం అస్సాం నుండి జమ్ము, కశ్మీర్ వరకు పర్యావరణ విధ్వంసం భారత రాజ్య ఎజెండాగా వుంది.
గత వారంలో జమ్ము కశ్మీర్‌లోని కిష్త్వర్ జిల్లాలో పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద ఐదుగురు యూనియన్ నాయకులను అరెస్టు చేశారు. ఈ దారుణ చర్య జరిపిన వెంటనే నవంబర్ 9న దోడాకు చెందిన మరో కార్యకర్తను కూడా అదే చట్టం కింద అరెస్టు చేశారు. వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి తమ జిల్లాల్లో పర్యావరణ, ఆరోగ్య న్యాయానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తడం సరిపోతుంది. అదే నమూనాలో అస్సాం, గౌహతిలోని భరలుముఖ్‌లో భారీగా చెట్లు నరకడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువ కార్యకర్తలను అరెస్టు చేసి జైలుకు పంపారు.
దేశ వ్యాప్తంగా, “అభివృద్ధి” అనేది స్థానికుల విస్తృత నిర్వాసిత్వం, వనరుల నిరంతర దోపిడీ, పర్యావరణ విధ్వంసం కోసం ఒక ముసుగు మాత్రమే. ఈ అభివృద్ధి అజెండా అని పిలవబడేది ఒక ప్రయోజనానికి – కార్పొరేట్ ప్రయోజనం- మాత్రమే ఉపయోగపడుతుంది.
ప్రపంచంలోనే అత్యంత సైనికీకరణ ప్రాంతమైన జమ్ము, కశ్మీర్ భారత రాజ్య నిరంతర, అపరిమిత హింసకు గురైంది. జమ్ము,కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు పోరాటంలో వారి స్వరాలను, ప్రతిఘటనను అణచివేయడానికి అన్ని రకాల హింసాత్మక, క్రూరమైన వ్యూహాలను ఉపయోగించింది. ప్రజా భద్రతకు ‘ముప్పు’గా వున్నారనే ముద్ర వేయడానికి, వారిని నిరవధికంగా నిర్బంధంలో ఉంచడానికి వీలు కల్పించే ప్రజా భద్రతా చట్టానికి వున్న ఏకపక్ష అధికారాలను జమ్ము కశ్మీర్‌లో ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఉపయోగిస్తున్నారు.
చీనాబ్ లోయ లోని ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు భారీస్థాయిలో సామూహిక నిర్వాసిత్వానికి, విధ్వంసానికి కారణమయ్యాయి. ఈ ప్రాజెక్టుల ఫలితంగా పర్యావరణ అస్థిరత, కాలుష్యం ఈ ప్రాంత నివాసుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే, అటువంటి జీవనం, ఆరోగ్యాలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తడం “మెగా ప్రాజెక్టుల వేగాన్ని మందగించే దేశ వ్యతిరేక వైఖరిని కొనసాగించడానికి” సమానం అనేది ప్రభుత్వ ధోరణి. ఈ ప్రాంతంలో మరింత ఎక్కువ వ్యర్థ పదార్ధాల అస్తవ్యస్థ నిర్వహణకు, దహనానికి కారణమైన, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును సవాలు చేసినందుకు, దోడాకు చెందిన రెహమతుల్లా అహ్మద్‌ను అరెస్టు చేశారు. పిఎస్ఎ కింద పెట్టిన ఒక కేసులో అతను ఇటీవలే విడుదలయ్యాడు.
భారత ప్రభుత్వ చర్యలను విమర్శించే స్వరాలను లక్ష్యంగా చేసుకోవడానికి; నిశ్శబ్దపరచడానికి ఒక సాధనంగా పిఎస్ఎను విస్తృతంగా ఉపయోగించిన చరిత్ర ఉంది. పర్యావరణ, పౌర హక్కుల కార్యకర్తలను ఘర్షణ ప్రాంతాల నుండి తొలగించడానికి ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తోంది. జమ్ము కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛా అవశేషాల గొంతు నొక్కేందుకు జర్నలిస్టులను కూడా ఈ చట్టం కింద తరచుగా టార్గెట్ చేస్తున్నది. ఈ చట్టం కింద నిరవధికంగా నిర్బంధించడం కొత్తేమీ కాదు.
భిన్నాభిప్రాయాలు, ఉద్యమాలను అరికట్టడానికి పిఎస్ఎ, యుఎపిఎలను భారత ప్రభుత్వం వినియోగించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రాంతాలలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఈ చట్టాలను రద్దు చేయడం చాలా అవసరం. జమ్ము, కశ్మీర్‌లోని రాజకీయ ఖైదీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
భారత దేశంలోని రాజకీయ ఖైదీలందరికీ అండగా నిలుస్తాం; జమ్ము- కశ్మీర్‌లోని కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం!
Campaign Against State Repression (CASR) రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం
(AIRSO,AISA, AISF, APCR,ASA,BAPSA BBAU,BASF, BSM, Bhim Army, bsCEM, CEM,COLLECTIVE,CRPP, CSM CTF, DISSC, DSU, DTF, Forum Against Repression Telangana, Fraternity, IAPL, Innocence Network, Karnataka Janashakti, LAA, Mazdoor Adhikar Sangathan, Mazdoor Patrika, NAPM, NAZARIYA , Nishant Natya Manch, Nowruz, NTUI, People’s Watch, Rihai Manch, Samajwadi Janparishad, Samajwadi Lok Manch, Bahujan Samjavadi Manch, SFI, United Peace Alliance, WSS,Y4S)
తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి

నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
Jammu Kashmir National Students Federation statement in support of Maoist party
కగార్‌లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్
Surrender Does Not Guarantee Freedom: The Story of Maoist Leader Dunna Keshava Rao alias Azad
మీ వేళ్లతో మీ రక్తబంధువుల కళ్లను పొడవకండి – ఆదివాసీ పోలీసులకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం 