రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం(Campaign against state oppression) ప్రకటన…
కార్మిక, విద్యార్థి, హక్కుల, నిర్వాసిత్వ వ్యతిరేక కార్యకర్తల ఇళ్లపై జరిగిన ఎన్‌ఐఎ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం
కార్యకర్తలను వెంటాడి వేధించడాన్ని ఆపాలి!
భీమా కోరేగావ్ కేసు లాగా ఉత్తర భారత దేశమంతటా కార్యకర్తలను వేటాడేందుకు ఉద్దేశించిన అబద్ధపు ఎఫ్‌ఐఆర్ నంబర్ RC-01/2023/NIA/లక్నోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
2024 డిసెంబర్ 20 తెల్లవారుజామున, పంజాబ్ లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లా, గాంధర్ గ్రామంలోని మనేసర్ జనరల్ మజ్దూర్ ఫ్రంట్‌కు చెందిన కార్మిక హక్కుల కార్యకర్త రాంపాల్ సింగ్; పాటియాలాలో స్టూడెంట్స్ ఫర్ సొసైటీ (ఎస్‌ఎఫ్‌ఎస్) పూర్వ అధ్యక్షుడు దమన్‌ప్రీత్ సింగ్; ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో ఢిల్లీ జనరల్ మజ్దూర్ ఫ్రంట్ (డిజిఎంఎఫ్)కు చెందిన అజయ్ కుమార్-ప్రియాంశులు; జగదీష్ సింగ్ (పూర్వ జనరల్ సెక్రటరీ (డిజిఎంఎఫ్); ఢిల్లీకి చెందిన నిర్వాసిత్వ వ్యతిరేక కార్యకర్త శ్రీ రామ్; హర్యానాలోని సోనిపట్‌లోని భూరి గ్రామానికి చెందిన మనేసర్ జనరల్ మజ్దూర్ సంఘ్ సభ్యుడు బిందు రామ్ ఇళ్ళపై ఎన్‌ఐఎ దాడులు జరిపింది.
రాంపాల్ సింగ్, బిందు రామ్‌లు మనేసర్ గురుగ్రామ్‌కు చెందిన మనేసర్ జనరల్ మజ్దూర్ సంఘ్ అనే కార్మిక సంఘంతో పనిచేస్తున్నారు. 3 నెలల క్రితం సెప్టెంబరు 6న ఆ సంస్థ అధ్యక్షుడు అనిరుధ్ రాజన్ చెన్నైలోని తన ఇంటికి వెళుతుండగా బెంగళూరు పోలీసు స్పెషల్ బ్రాంచ్ ‘ఉపా’ UAPA కింద అరెస్టు చేసింది.
ఇంటిపై జరిగిన దాడి సమయంలో, కార్మిక హక్కుల కార్యకర్త రాంపాల్ సింగ్ నుండి, అతని కుటుంబం నుండి బలవంతంగా ఒప్పుకోలు సంతకాలు పొందడానికి ఎన్‌ఐఎ ప్రయత్నించింది; వారు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన పత్రాలన్నింటి పైనా సంతకం చేయమని వారిని బెదిరించింది. ఢిల్లీలో, దాడి సమయంలో, ఎన్‌ఐఎ సిబ్బంది అజయ్ కుమార్, ప్రియాంషులనిద్దరినీ వారి గది వెలుపలికి తీసుకెళ్ళి కొన్ని ఒప్పుకోలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించడానికి ప్రయత్నించింది. అలాగే, దాడి- స్వాధీన నివేదిక పూర్తయిన తర్వాత, వారి దగ్గర లేదా వారి గదిలో కాని దాడి సమయంలో కనబడని మరికొన్ని విషయాలను స్వాధీనం నివేదికలో చేర్చడానికి ప్రయత్నించింది.
“మావోయిస్ట్‌ల ఉత్తర ప్రాంత బ్యూరో (ఎన్‌ఆర్‌బి) పునరుద్ధరణ కేసు”అని కూడా పిలుస్తున్న, ఎఫ్‌ఐఆర్ నంబర్ RC-01/2023 ఎన్‌ఐఎ లక్నో కేసుకు సంబంధించి ఈ దాడులు చేసారు. ఈ కేసులో, ఇప్పటికే 3 నెలల క్రితం న్యాయవాది, నిర్వాసిత్వ వ్యతిరేక కార్యకర్త అజయ్ కుమార్‌ను ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. స్టూడెంట్స్ ఫర్ సొసైటీ (ఎస్‌ఎఫ్‌ఎస్) పంజాబ్ పూర్వ అధ్యక్షుడు, దమన్ ప్రీత్ సింగ్‌ను, ఇదే కేసులో మునుపటి దాడులలో కూడా విచారణ చేసారు; పాటియాలా (పంజాబ్) సమీపంలోని రాజ్‌పురాలో అతని ఇంటిపై దాడి కూడా చేశారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్న తర్వాత సోదా, స్వాధీన పత్రాల పైన బలవంతంగా సంతకం చేయించుకున్నారు.
అరెస్టు చేయడానికి, బెదిరింపులకు, అసమ్మతిని నిశ్శబ్దం చేయడానికి “మావోయిస్ట్‌ల ఉత్తర ప్రాంత బ్యూరో (ఎన్‌ఆర్‌బి) పునరుద్ధరణ కేసు” లేదా లక్నో కుట్ర కేసును తయారు చేసే ప్రయత్నం బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ ఆర్‌ఎస్‌ఎస్-బిజెపిల గెస్టపో బలగం ఎన్‌ఐఎ చేస్తోంది. భీమా కోరేగావ్ కుట్ర కేసులో లాగా దేశవ్యాప్తంగా కార్మికవర్గ, నిర్వాసిత్వ వ్యతిరేక, రైతాంగ, సాంస్కృతిక ప్రజా ఉద్యమాలకు చెందిన అనేక ప్రజా ఉద్యమకారులను తప్పుగా ఇరికించి జైలుకు పంపే ప్రయట్నంలో భాగమే ఈ దాడులు. అదే కేసు ఫాదర్ స్టాన్‌స్వామిని హత్య చేసింది.
ఈ దాడులు, సోదాలు, స్వాధీనాలు, ప్రజాస్వామిక కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా ఇదే తరహా కుట్ర కేసులు పునరావృతమవడాన్ని మనం చూస్తున్నాం. సోదాల్లో నేరారోపణచేయగలిగేదేమీ దొరకలేదు; కానీ భీమా కోరేగావ్ కుట్ర కేసులో చేసినట్లుగా కార్యకర్తలను దోషులుగా చేయడానికి ఎన్‌ఐఎ ఎలక్ట్రానిక్ పరికరాలను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుంది.
మావోయిజం భావజాలాన్ని విశ్వసించడం లేదా సీపీఐ (మావోయిస్ట్)లో సభ్యుడిగా ఉండటం చట్ట ప్రకారం నేరం కాదని దేశంలోని వివిధ కోర్టులు వివిధ తీర్పుల్లో పేర్కొన్న సంగతి కూడా మనకు తెలుసు. అయితే, వివిధ ప్రముఖ సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలపైన సిపిఐ (మావోయిస్ట్) పార్టీ “ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్” అని ముద్ర వేసి, సంవత్సరాల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచుతున్నారు. అందువల్ల, విచారణ అనేది శిక్షగా మారుతుంది; ప్రజల గౌరవంగా జీవించే హక్కును హరిస్తుంది; న్యాయ పాలన ముసుగును చీల్చివేస్తుంది. దోపిడీకి గురవుతున్న, పీడిత ప్రజల ప్రతిఘటన, పోరాట గొంతుకలను నిశ్శబ్దపరచే ప్రయత్నం ఇది.
అర్బన్ నక్సల్స్/ఓవర్ గ్రౌండ్ వర్కర్‌ల పేరుతో దేశవ్యాప్తంగా ఎన్‌ఐఎ చేపడుతున్న వెంటాడి వేధించే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
బూటకపు “మావోయిస్ట్‌ల ఎన్‌ఆర్‌బి పునరుద్ధరణ కేసు”ను రద్దు చేయాలని, ఈ కేసులో కార్యకర్తలపై వేధింపులను అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రగతిశీల, ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఉద్యమకారులను వెంటాడి వేధిస్తున్న ఎన్‌ఐఎవేటకు వ్యతిరేకంగా గళం వినిపించాలని కోరుతున్నాం.
రాజ్య అణచివేత ప్రచారోద్యమం (Campaign against state oppression)
ఎఐఆర్ఎస్ఒ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్, ఎపిసిఆర్, ఎఎస్‌ఎ, బిఎపిఎస్‌ఎ, బిబిఎయు, బిఎఎస్ఎఫ్, బిఎస్ఎమ్, భీమ్ ఆర్మీ, బిఎస్‌సిఇఎమ్, సిఇఎమ్, సిఆర్‌పిపి, సిటిఎఫ్, దిశ, డిఐఎస్‌ఎస్‌సి, డిఎస్‌యు, డిటిఎఫ్, ఫోరం అగైన్స్ట్ రిప్రెషన్, తెలంగాణ, ఫ్రటర్నిటీ, ఐఏపిఎల్, ఇన్నోసెన్స్ నెట్‌వర్క్, కర్ణాటక జనశక్తి, ఎల్‌ఎఎ, మజ్దూర్ అధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రిక, మోర్చా పత్రిక, ఎన్‌ఎపిఎమ్, ఎన్‌బిఎస్, నిశాంత్ నాట్య మంచ్, నౌరూజ్, ఎన్‌టియుఐ, పీపుల్స్ వాచ్, రిహాయి మంచ్, సమాజ్‌వాది జన్ పరిషద్, సమాజ్‌వాది లోక్ మంచ్, బహుజన్ సమాజ్‌వాది లోక్ మంచ్, ఎస్‌ఎఫ్‌ఐ, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్, యునైటెడ్ పీస్ అలియన్స్, డబ్ల్యూఎస్ఎస్, వై4ఎస్

‘అమిత్ షాకు డబ్బు భాష తప్ప మరే భాష తెలియదు’
‘నేను ఎందుకని అజ్ఞాతంలోకి వెళ్ళాను’ - ఢిల్లీ విద్యార్థిని బహిరంగ లేఖ!
Fascism, State & Family: Why I Became Underground (UG) Underground political activist Open Letter
ఆపరేషన్ కగార్ ను ఆపాలంటూ పంజాబ్ లో భారీ ప్రదర్శన
నంబళ్ళ కేశవరావుతో సహా 22 మంది మావోయిస్టుల హత్యకు నిరసనగా పంజాబ్ లో భారీ ర్యాలీ, సభ
దండకారణ్యంలో ప్రభుత్వ మారణకాండకు వ్యతిరేకంగా పంజాబ్ వ్యాప్త యాత్ర… భగత్ సింగ్ పూర్వీకుల ఇంటి నుండి ప్రారంభం 