Menu

దళిత యువకుడికి గుండు కొట్టించి ఊరేగించిన భజరంగ్ దళ్, వీహెచ్ పీ మూక‌

anadmin 11 months ago 0 62

ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో దళితులు క్రైస్తవ మతం తీసుకున్నారనే నెపంతో ఆ గ్రామంలోకి వచ్చిన భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ గుంపు దళితులను బెదిరించారు. దీంతో ఓ దళిత యువకుడు వారికి నిరసన వ్యక్తం చేశాడు. వారిని ఎదుర్కొన్నాడనే కోపంతో ఆ దళిత యువకుడికి బలవంతంగా గుండు కొట్టి, మెడలో కాషాయ కండువా వేసి, నుదుటిపై బొట్లు పెట్టి గ్రామంలో ఊరేగించారు. కర్రలు పట్టుకున్న ఓ గుంపు జైశ్రీరాం అనే నినాదాలు చేస్తూ యువకుడిని బెదిరించి బలవంతంగా ఆయన్తో కూడా జై శ్రీరాం అని నినాదాలు చేయించారు.

చివరకు గ్రామంలోని గుడి వద్దకు తీసుకెళ్ళి పూజలు చేసి ఆయనను మళ్ళి హిందూ మతంలోకి మారుస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై స్పందించిన పోలీసులు తమకు పిర్యాదు ఏమీ రాలేదు కాబట్తి తామేమీ చేయలేమని తేల్చేశారు. ఒకవేళ అధికారికంగా ఫిర్యాదు అందితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్థానిక అన్నారు.

కాగా దళిత‌ యువకుడిని గ్రామంలో ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

(freepressjournal.in సౌజన్యంతో)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad