Menu

ఓ జర్నలిస్టు వెల్లడించిన నిజం… పోలీసుల దుర్మార్గం… నక్సలైట్ల నిబద్దత, నిజాయితీ, జనం కోసం తృణప్రాయంగా ప్రాణాలిచ్చే తత్వం

anadmin 12 months ago 0 521

సీనియర్ జర్నలిస్టు నాగారెడ్డి సుబ్బారెడ్డి తన ఫేస్ బుక్ టైం లైన్ పై పోస్ట్ చేసిన కథనం

నాణేనికి ఒక వైపు చూస్తే ఇలాగే అనిపించవచ్చు,కనిపించవచ్చు.కడపజిల్లా రాయచోటి మండలం సుందు పల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి మధ్యతరగతి రైతు బిడ్డ.అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్త.తాను కడప rsu (రాడికల్ విద్యార్థి సంఘం)భాద్యుడుగా ఉన్న తాను తనకోసం ప్రత్యేకంగా డెన్ లేకుండానే ప్రజల్లో కలసిపోయిన గొప్పనాయకుడు శివారెడ్డి.కాలేజీల్లో ఈవ్ టీజింగ్ దృష్టికి వస్తె చాలు భుజానికి తపంచ వేసుకుని అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు.కాలేజ్ గ్రౌండ్ కు ఇడ్చుకు వెళ్లి దేహశుద్ధి చేసేవాడు.కాలేజి అమ్మాయిలు ధైర్యంగా చదువులకు వెళ్ళే వారు.కడపలో ఏ మూల ఎలాంటి దురాగతం జరిగినా బాధితులకు గుర్తుకు వచ్చే పేరు శివారెడ్డి.అలాంటి శివారెడ్డి మరణించాడు.అతని మరణ కారణాన్ని పోలీసులు అత్యంత హేయంగా పత్రికలకు విడుదల చేశారు.తనకు పరిచయమున్న ఒక యువకుడి చెల్లెలు తో శివారెడ్డి కి వివాహేతర సంబంధం ఉండేదని ఆమె అంటే ఇష్టం ఉన్న మరో యువకుడు,ఆ అమ్మాయి అన్న కలసి శివారెడ్డినీ హత్య చేసి శవాన్ని కాల్చి బూడిద చేశారని ఒక అభూత కల్పనను పోలీసులు ప్రచారం లో పెట్టారు.హత్యకు కారకులు అంటూ ఇరువురిపై కేసు పెట్టారు కూడా… నిజానికి జరిగింది వేరు.ఎవరు హత్యకు కారకులుగా చెప్ప బడుతున్నారో వారిరువురి నీ పీపుల్స్ వార్ పార్టీ అదుపులోకి తీసుకుని నిజాలు చెప్పించింది.వాస్తవానికి ఆ ఇరువురు పార్టీ సానుభూతి పరులు .ఆ కారణంగా శివారెడ్డి వారిని కలిశేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ యువకులిద్దరిని బెలిపించి,భయపెట్టి శివారెడ్డి పట్టించే బాధ్యతల్లో ఉంచారు.అనుకున్నట్టుగా వారిని కలిసేందుకు వెళ్లిన శివారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనేక చిత్రహింసల తరువాత శివారెడ్డి కొండల్లోకి తీసుకు వెళ్ళారు.సాక్షాత్తూ జిల్లా పోలీసు అధికారి కూడా వెంట వెళ్ళారు.అక్కడ జరిగిన సంఘటన,సంభాషణలు ఒక విప్లవకారునీ నిబద్ధతను ప్రపంచానికి చూపింది.అక్కడున్న అధికారి శివారెడ్డినిని పారిపో అని చెబుతూ తన సిబ్బందిని ఆయనపై కాల్పులు జరిపేందుకు ఆదేశించాడు.అయితే శివారెడ్డి అక్కడే నిలబడి సూటిగా ఆ అధికారి కళ్ళలోకి నేరుగా చూస్తూ నన్ను చంపాలనుకుంటే చంపుకో అంతే కానీ పారిపో అని సలహాలివ్వకు.నీ ఆలోచన నాకు తెలుసు.కానీ పొరపాటున నేను తప్పించుకో గలిగితే నీవు మాత్రం ప్రాణాలతో మిగలవు అని అన్నాడు.అక్కడున్న ఏ ఆర్ పోలీసులను శివారెడ్డి నేరుగా కాల్చమని ఆదేశించాడు అది కారి.అయితే అప్పటికే శివారెడ్డి నిజాయితీ,నిబద్ధత,మంచితనం తెలిసిన పోలీసులు అందుకు నిరాకరించారు.తమకు ఆయనతో వ్యక్తిగత వైరం ఏమి లేదని వారు అధికారి ఆదేశాలను త్రో సిపుచ్చారు.ఆపుడు కోపోద్రిక్తుడైన ఆ అధికారి తానే స్వయంగా తుపాకి చేతుల్లోకి తీసుకుని నేరుగా శివారెడ్డి పై గుండ్ల వర్షం కురిపించాడు.విప్లవాన్ని వర్డిల్లమని నినదిస్తూ శివారెడ్డి నెల కూలాడు .కానీ శివారెడ్డి ఒక అమర వీరుడు కావడం ఆ పోలీసు అధికారికి ఏ మాత్రం ఇష్టం లేదు.నక్సలైట్ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళడం వెనక వారి నైతికతతో కూడిన నిబద్ధతే కారణమన్న విషయం ఆ అధికారికి స్పష్టంగా తెలుసు.అందుకే కారెక్టర్ అసాషియేషన్ కు తెగ బడ్డాడు.శివారెడ్డి శవాన్ని ఆ ఇద్దరు యువకులతో తగలబెట్టి బూడిద చేయించాడు.పార్టీ వైపునుంచి శివారెడ్డి అదృశ్యం పై భూటకపు ఎన్ కౌంటర్ జరిగే ప్రమాదముందని ప్రకటన వెలువడగానే ఇద్దరు యువకుల అరెస్టు చూపి శివారెడ్డి అనైతిక ప్రవర్తన వల్ల హత్యకు గురైనట్లు అధికారి ప్రకటించాడు.ఇది చావు కంటే భయంకరమైనది.అయితే పార్టీ ఆ యువకులను కిడ్నాప్ చేసి పత్రికా విలేకరుల సమావేశంలో నిజం చెప్పించి వారికి మరణ దండన విధించారు .జిల్లాలో ఎందరినో ప్రభావితం చేసిన శివారెడ్డి ఇలా దారుణ హత్యకు గురి కావడం ఎందరినో ఆవేశానికి గురి చేసింది .అలాంటి కొందరు ప్రతీకారంతో ప్రతిజ్ఞలు చేశారు.తమ నాయకుణ్ణి ఇంత దారుణంగా చంపడమే కాక అతనిపై అనైతిక వ్యవహారిగా ముద్రవేసిన అధికారిని ఖతం చేసే అవకాశం తమకు ఇవ్వాలని పార్టీ ముందు ప్రపోజల్స్ పెట్టారు .చివరికి ఆ అధికారి గెరిల్లాల చేతుల్లో చంప బడ్డాడు.ఇదంతా కడప జిల్లాలో ప్రతి మారుమూలకు తెలిసిన వీరగాదే.
_ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోలీసు అధికారి గురించి … ఆయన వీరత్వం గురించి చెబుతూ ఆయనకు లేని అమర వీరుడి స్థాయి కల్పించి రాస్తున్నారు.అందుకే నిజాలు చెబుదామని….

-నాగారెడ్డి సుబ్బారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad