Menu

ఆయుధాలు పట్టుకోవడం నేరమైతే…..

anadmin 11 months ago 0 230

అమిత్ షా ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్‌లోకి పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను పంపి, నక్సలైట్లను నిర్మూలించే పేరుతో హత్య చేయిస్తున్నాడు.
నక్సలైట్లు ఆయుధాలు చేపట్టారు కాబట్టి వారిని చంపవచ్చు అని అమిత్ షా చెప్పిన దానితో మీరందరూ కూడా ఏకీభవిస్తున్నారు.
ఆయుధాలు పట్టుకోవడమే నేరమైతే కనక భారతదేశం అంతటా వీధుల్లో పోలీసులు, అర్ధ సైనిక బలగాల ముందర పెద్ద సంఖ్యలో ఆయుధాలను పట్టుకొని ఊరేగింపులు చేస్తున్న హిందూత్వ గూండాలపై చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు.
రామనవమి లేదా వేరేదైనా హిందూ పండుగ సమయంలో వీధుల్లో జరిపే ఊరేగింపులలో బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శించే వారిపై బిజెపి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుందని మీరు ఎప్పుడైనా విన్నారా?
అంటే ఆయుధాలు ఉంచుకోవడం నేరం కాదు.
అయితే ఏది నేరం ?
మీ రాజకీయ భావజాలం ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా ఉండటమే నేరం.
ఆయుధాలు, గూండాల సహాయంతో ఆర్ఎస్ఎస్ మొత్తం దేశాన్ని కబ్జా చేసుకుంటుంది.
వారిని ఎదిరించే వారి ఇళ్ళు తగలబెడుతుంది; వారి మెడలు నరికేస్తుంది; వారి కుటుంబం మొత్తాన్ని రక్తస్నానం చేయిస్తారు.
అటువంటి పరిస్థితిలో, ఒకవేళ నక్సలైట్ల దగ్గర కూడా ఆయుధాలు ఉంటే వారు ఈ ఆర్ఎస్ఎస్ గూండాలను ఎదుర్కోగలుగుతారు.
దేశవ్యాప్తంగా తమ దగ్గర తప్ప మరెవరి దగ్గరా ఆయుధాలు ఉండకూడదని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది.
మొత్తం దేశంలో, తమ దగ్గర కాకుండా వేరే ఎవరి దగ్గరైనా సరే ఆయుధాలు ఉంటే, ప్రభుత్వ భద్రతా బలగాల సహాయంతో ఆర్ఎస్ఎస్ వారిపై దాడి చేస్తుంది.
అందుకే పోలీసులు ఎప్పుడూ ముస్లింలు ఉండే ప్రాంతాల్లోని ఇళ్లలోకి ప్రవేశించి ఆయుధాల కోసం వెతుకుతారు.
ఈ దేశంలో పెద్ద మారణహోమం సృష్టించడం ఆర్ఎస్ఎస్ ఉద్దేశ్యం.
అందుకనే ఆర్ఎస్ఎస్ తన, తన గూండాల ఆయుధాలను పెంచుకుంటూ, మిగతా అందరి దగ్గర ఉన్న ఆయుధాలను అంతం చేస్తోంది.
నక్సలైట్లపై దాడులు కూడా ఈ ఉద్దేశ్యంతోనే జరుగుతున్నాయి.
ఈ ఆర్ఎస్ఎస్ సాయుధ గూండాలు భారతదేశంలోని ఆదివాసుల భూమిని లాక్కోవడంలో పెట్టుబడిదారులకు సహాయం చేస్తారు.
పెట్టుబడిదారుల కోసం దోపిడీకి గురయ్యే కార్మికులను దెబ్బ తీస్తారు.
మేధావులను భయపెట్టడానికి ఉపయోగపడతారు.
ముస్లింలను చంపడానికి, క్రైస్తవులను భయపెట్టడానికి ఉపయోగిస్తారు.
మీరు ఒకవేళ భారతదేశ రాజకీయాలను లోతుగా అర్థం చేసుకోకపోతే, తెరవెనుక ఉన్న ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే ఓడిపోతారు.
మీ కళ్ళు తెరవడమే మా పని, మీకు ఇంకా అర్థం కాకపోతే ఇక మీ ఇష్టం.
(హిమాంశు కుమార్ ఫేస్‌బుక్ పోస్టు)

తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad