‘మోషా’ల మానవ హననం సాగుతూనే ఉంది. సామ్రాజ్యవాదులు, దేశీయ బడా పెట్టుబడిదారులకు దేశ ఖనిజ స౦పదను దోచి పెట్టడానికి అడ్డంకిగా ఉన్న ఆదివాసులను, వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను తుడిచిపెట్టడానికి కగార్ ఆపరేషన్ పేరుతో హత్యలు సాగుతూనే ఉన్నాయి. ఒక వైపు చత్తీస్ గడ్ లో ప్రతి రోజూ పదుల సంఖ్యలో మావోయిస్టులను, ఆదివాసులను ఎన్ కౌంటర్ పేరుతో కాల్చి చంపుతున్న బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఝార్ఖండ్ లో ఎనిమిది మందిని హత్య చేసి ఎన్ కౌంటర్ కథ వినిపిస్తున్నారు.
పోలీసులు వినిపిస్తున్న కథ…
ఝార్ఖండ్ రాష్ట్రం, బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ ఎలియాస్ వివేక్ , అవినాష్ ఎలియాస్ అరవింద్ యాదవ్, సాహెబ్రామ్ మాంఝి, మహేష్ మాంఝి, తాలు, రంఝు మాంఝి, గంగారాం, మహేష్ ఉన్నారు.
‘వివేక్ దా’, ‘ఫుచ్నా’, ‘నాగో మంజి’ మరియు ‘కరణ్ దా’ అని కూడా పిలువబడే ప్రయాగ్ మాంజీ గత కొన్ని నెలలుగా గిరిడిహ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు.
CRPF 209 కోబ్రా బెటాలియన్, జార్ఖండ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ ఎన్ కౌంటర్ జరిగిందని,. సంఘటనా స్థలం నుండి ఒక SLR మరియు ఒక INSAS రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని, భద్రతా సిబ్బంది ఎవరూ గాయపడలేదని పోలీసులు ఎప్పటిలాగే ప్రకటించారు.

మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి-కూనంనేని డిమాండ్
ఈ నెల 24, 25వ తేదీల్లో విరసం 30వ మహాసభలు
‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్
ఏ మార్గాన్ని అనుసరించాలి?
జైలు చీకటి కొట్లలో కేకలేస్తున్న మానవ హక్కులు: యాతనలు, ఆకలి, క్రూరత్వాల భయంకర చిత్రం
హిడ్మాను పట్టించింది ఆ నలుగురే – మావోయిస్టు పార్టీ ప్రకటన 